New trains
-
త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్స్
న్యూఢిల్లీ: త్వరలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఆగస్ట్ 15వ తేదీ నాటికి వీటి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఇవి మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ఇవి త్వరలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుని పట్టాలెక్కే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు అంటున్నాయి. వీటితోపాటుగా, తక్కువ దూరంలో ఉండే నగరాల మధ్య ప్రయాణాల కోసం వందే మెట్రో లేదా వందే భారత్ మెట్రోగా పిలిచే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే మొదలవనుందని చెబుతున్నారు. -
ఏపీలో రేపు మూడు కొత్త రైళ్ల ప్రారంభం
గుంటూరు, సాక్షి: రాష్ట్రానికి కొత్త రైళ్లు వచ్చేశాయి. మూడు రైళ్లను శుక్రవారం గుంటూరు స్టేషన్ నుంచి ప్రారంభించనుంది రైల్వే శాఖ. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ఇవి పట్టాలపై ఎక్కనున్నాయి. హుబ్బల్లి - నర్సాపూర్, విశాఖపట్టణం - గుంటూరు, నంద్యాల - రేణిగుంట రైళ్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపటి నుంచే ప్రయాణికులకు ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
వచ్చే అయిదేళ్లలో 3 వేల కొత్త రైళ్లు
న్యూఢిల్లీ: రానున్న నాలుగయిదేళ్లలో మూడు వేల కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.వీటివల్ల రైల్వేల ప్రయాణికుల సామర్థ్యం ప్రస్తుతమున్న 800 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెరుగుతుందని వెల్లడించారు. రైళ్ల వేగాన్ని పెంచడం, నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించడం కూడా తమ శాఖ ప్రథమ లక్ష్యమని గురువారం ఆయన రైల్వే భవన్లో మీడియాకు తెలిపారు.ప్రస్తుతం 69 వేల కొత్త కోచ్‌లు అందుబాటులో ఉండగా, ఏటా 5 వేల కోచ్‌లు కొత్తగా తయారవుతున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. వీటితో ఏడాదికి 200 నుంచి 250 వరకు కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయని, వీటికి తోడు రానున్న సంవత్సరాల్లో మరో 400 నుంచి 450 వరకు వందేభారత్ రైళ్లు కూడా ఉంటాయని పేర్కొన్నాయి. -
‘వందే సాధారణ్’ ట్రయల్ రన్
ముంబై: రైల్వే శాఖ దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ‘వందే సాధారణ్’ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలి వందే సాధారణ్ రైలును బుధవారం ముంబై–అహ్మదాబాద్ మధ్య విజయవంతంగా నడిపినట్టు రైల్వే శాఖ పేర్కొంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌అవుతోంది. కొంతకాలం క్రితం ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో విజయవంతంగా నడుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం అదే తరహాలో ‘వందే సాధారణ్’ రైళ్లు తేవాలని రైల్వే శాఖ గతంలోనే నిర్ణయించడం తెల్సిందే. వందేభారత్ రైళ్లలో పూర్తిగా ఏసీ కోచ్‌లు ఉండగా ‘వందే సాధారణ్’ నాన్ ఏసీ కోచ్‌లతో నడవనున్నాయి. వీటిలో మొత్తం 22 స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. రెండువైపులా ఇంజన్లుండటం వీటి ప్రత్యేకత. సీసీటీవీ నిఘా, సెన్సార్ ఆధారిత సౌకర్యాలు, తదితర సదుపాయాలను ఈ కోచ్‌లలో కలి్పంచనున్నారు. ఒక్కో రైలులో 1,800 మంది దాకా ప్రయాణించవచ్చు. ఇవి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని రైల్వే శాఖ చెబుతోంది. దేశంలో 500 కిలోమీటర్లు దాటిన ప్రఖ్యాతిగాంచిన పలు మార్గాల్లో ఈ కొత్తతరహా రైలు సరీ్వసులను ప్రారంభించాలని రైల్వేశాఖ యోచిస్తోందని సమాచారం. ముంబై– న్యూఢిల్లీ, పటా్న–న్యూఢిల్లీ, హౌరా–న్యూఢిల్లీ, హైదరాబాద్–న్యూఢిల్లీ, ఎర్నాకులం–గువాహటి మార్గాలు ఈ రూట్ల జాబితాలో ఉన్నాయి. -
సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు కొత్త రైలు సర్వీస్ ప్రారంభం
-
ఇది విన్నారా..! వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లు వస్తున్నాయ్
భారతదేశంలో ఇప్పుడు వందే భారత్ రైళ్ల హవా నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కొత్త వందే భారత్ మొదలైంది. అయితే రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసులు త్వరలోనే దేశం మొత్తం మీద అందుబాటులో రానున్నాయి. నివేదికల ప్రకారం, భెల్ (BHEL) నేతృత్వంలో ఉన్న కన్సార్టియం మరో ఆరు సంవత్సరాల్లో 80 స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లను అందించే ఆర్డర్ సొంతం చేసుకుంది. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ. 9,000 కోట్లకంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ప్రస్తుతం స్లీపర్ క్లాస్ వందే భారత్ ట్రైన్ల వినియోగం కూడా చాలా అవసరమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (ఇదీ చదవండి: కొత్త యాప్‌లో కలిసిపోయిన ట్విటర్.. ఎలన్ మస్క్ ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా!) స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు ఢిల్లీ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి హౌరా వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ట్రైన్లు ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ క్లాస్‌లను మాత్రమే కలిగి ఉంటాయి. అయితే స్లీపర్ క్లాసులు ఇప్పటికి అందుబాటులో లేదు. (ఇదీ చదవండి: AIMA Awards 2023: ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న వ్యాపారవేత్తలు.. వీరే!) స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లను అందించే భెల్ ఒక్క ట్రైన్ కోసం రూ. 120 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. కన్సార్టియం ICF చెన్నైలోని తయారీ యూనిట్‌తో పాటు భారతీయ రైల్వేలు కేటాయించిన రెండు డిపోలలో అందించిన ప్రత్యేక స్థలాన్ని కూడా సన్నద్ధం చేస్తుంది. మొత్తానికి స్లీపర్ క్లాస్ వందే భారత్ ట్రైన్స్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయని స్పష్టమవుతోంది. -
South Central Railway: వందే భారత్ సరే... ఇంటర్సిటీ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: సుమారు పన్నెండేళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు, లింగంపల్లి నుంచి బీహెచ్ఈఎల్ వరకు ఆరు కిలోమీటర్ల మేర అదనపు సదుపాయం అందుబాటులోకి వచ్చినా రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఠంచన్‌గా కేంద్ర బడ్జెట్ మాత్రం వచ్చిపోతూనే ఉంది. కానీ జంటనగరాల్లోని ప్రాజెక్టులకు మాత్రం రెడ్ సిగ్నలే పడడం గమనార్హం. రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణలో భాగంగా స్టేషన్ల ఆధునికీకరణ వంటి కొన్ని లాభదాయకమైన ప్రాజెక్టులు మినహాయించి లక్షలాది మంది ప్రయాణికలు ఆధారపడిన కొత్త రైళ్లు, లైన్ల విస్తరణకు మాత్రం నిధులు లభించడం లేదు. మరో వారం పది రోజుల్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రతి సంవత్సరం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసే ఎంపీల సమావేశం కూడా ఈసారి ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రవేశపెట్టనున్న కేంద్రబడ్జెట్లో హైదరాబాద్ ప్రజల రైల్వే ప్రయాణ అవసరాలు ఏ మేరకు ప్రతిబింబిస్తాయనే సందేహంగా మారింది. మరోవైపు గతంలో ప్రారంభించిన పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తప్ప పనులు ముందుకు సాగే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు మధ్య ఏర్పడిన పీటముడి కారణంగా మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. వందే భారత్ సరే...ఇంటర్సిటీ ఏదీ... సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాధారణ ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రూ.100 నుంచి రూ.150 వరకు చార్జీ ఉంటుంది. కొత్తగా వచ్చిన వందేభారత్‌లో ప్రయాణం చేయాలంటే వరంగల్ వరకు కనీసం రూ.450 చెల్లించాలి. సికింద్రాబాద్ నుంచి నేరుగా విశాఖకు వెళ్లే ప్రయాణికులకు కూడా చార్జీలు భారమే అయినా సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొంటే భారత్ ప్రయోజనకరమే. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో ప్యాసింజర్లుగా నడిచిన రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా పేరు మార్చి చార్జీలు పెంచారు. అదే సమయంలో హాల్టింగ్ స్టేషన్లను తగ్గించారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం నగరానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్సిటీ రైళ్లను పెంచాలనే ప్రతిపాదన ఆచరణకు నోచడం లేదు. వందేభారత్ కంటే సామాన్యులకు ఎంతో ముఖ్యమైన ఇంటర్సిటీ, ప్యాసింజర్ రైళ్లను ఈ బడ్జెట్లోనైనా ప్రవేశపెట్టాలని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రెండో దశకు పన్నెండేళ్లు .... రాజధాని, శతాబ్ది వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్ల కంటే నగరంలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యతనివ్వాలని అప్పట్లో కేంద్రం భావించింది, ఈ మేరకు ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. మొదటిదశలో పట్టాలెక్కిన రైళ్లు తప్ప కొత్తగా ఒక్క రైలు కూడా అందుబాటులోకి రాలేదు.పైగా గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటిని 78కి తగ్గించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల ఆధునికీకరణ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. తాజాగా భారత్ అమృత్ స్టేషన్స్ పథకం కింద హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, లింగంపల్లి స్టేషన్లను గుర్తించారు. మిగతా 23 స్టేషన్లలో కనీస సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు వంటివి కూడా తగినన్ని లేకపోవడం గమనార్హం. సుమారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు స్టేషన్లతో అనుసంధానమయ్యే రెండో దశ వల్ల రవాణా సదుపాయాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. ఆరు మార్గాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు మూడు లైన్లు మాత్రం పూర్తయ్యాయి. ఈ మార్గాల్లో నడిపేందుకు రైళ్లు లేక నిరుపయోగంగా ఉన్నాయి. నగరంలో నాలుగో టర్మినల్‌గా భావించే చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్‌పైన ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఒక్క స్టేషన్ నుంచే రోజుకు 200 రైళ్లు నడుస్తున్నాయి. పుణ్యక్షేత్రాలకు రైళ్లు లేవు.. నగరం నుంచి యాదాద్రికి వెళ్లేందుకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్‌కు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాయగిరి స్టేషన్ అభివృద్ధికి మాత్రం రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. లక్షలాది మంది భక్తులు సందర్శించే యాదాద్రికి ఎంఎంటీఎస్ లేకుండా కేవలం స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే అది అలంకారప్రాయమే కానుంది. -
Hyderabad: అరకొర రైళ్లే.. పదేళ్లుగా పాతవాటితోనే సరి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నుంచి ప్రతి రోజూ సుమారు 3 లక్షల మంది రైళ్లలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. మరో 50 వేల మంది వరకు వెయిటింగ్ జాబితాలో నిరీక్షిస్తున్నారు. పండగలు, వరుస సెలవులు వస్తే ఈ జాబితా రెట్టింపవుతుంది. రద్దీ ఉంటే అరకొరగా ప్రత్యేక రైళ్లు నడపడం మినహాయించి ఈ పదేళ్ల కాలంలో ఒకటి, రెండు మినహాయించి కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని ఆ మేరకు కొత్త రైళ్లను వేయాల్సి ఉండగా.. ఈ ప్రక్రియకు రైల్వే చాలా ఏళ్ల క్రితమే తిలోదకాలిచ్చింది. దీంతో ఒకవైపు ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ పెరుగుతున్నప్పటికీ అందుకనుగుణంగా రైళ్లు మాత్రం పెరగడం లేదు. కేవలం 85 ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. కసరత్తు ఏదీ.. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు పార్లమెంట్ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి ప్రజాభిప్రాయం వెలువడే విధంగా ఏర్పాట్లు చేసే దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఆ పద్ధతిని సైతం విస్మరించింది. ఎంపీల సమావేశం నిర్వహించలేదు. మరోవైపు రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్లో విలీనం చేసిన తర్వాత రైల్వేల ప్రాధాన్యం బాగా పడిపోయిందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జోన్ పరిధిలోని, డివిజన్ పరిధిలో క్రమం తప్పకుండా రైల్వే వినియోగదారుల సమావేశాలను నిర్వహించే అధికారులు ఆ సాంప్రదాయాన్ని కూడా పాటించడం లేదు. ఇలా ప్రయాణికుల అవసరాలను తెలుసుకొనేందుకు ఎలాంటి కసరత్తులు చేపట్టకపోవడంతో ప్రధాన బడ్జెట్లో రైల్వేల అంశం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పాట్నాకు అరకొర రైళ్లే ఉన్నాయి. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ మినహాయించి పెద్దగా అందుబాటులో లేవు. ఈ రూట్లో అదనంగా రైళ్లను నడపాలని పదేళ్లుగా ప్రయాణికులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి షిరిడీకి ఒక్క రైలు మాత్రమే నడుస్తోంది. వేలాది మంది భక్తులు సందర్శించే షిరిడీకి తగినన్ని రైళ్లు లేకపోవడం వల్ల ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సి వస్తోంది. నో కనెక్టివిటీ.. పట్టణాలు, నగరాల నుంచి రాజధానికి రైల్ కనెక్టివిటీ పెంచాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, దూరప్రాంతాల రైళ్లపైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా ఇంటర్సిటీ రైళ్లను, ప్యాసింజర్ రైళ్లను పెంచాలని ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి సైతం ప్రతి సంవత్సరం వినతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్, వరంగల్, తాండూరు, వికారాబాద్, నిజామాబాద్, తదితర ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రతి రోజు నగరానికి వచ్చి తిరిగి సాయంత్రం తమ ఊళ్లకు వెళ్లిపోయే ఈ ప్రయాణికులంతా సరిపడా రైళ్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. పెరిగిన చార్జీల భారం.. ► ప్రతి రోజు ఉదయం కాజీపేట నుంచి నగరానికి వచ్చే పుష్ఫుల్ ట్రైన్ ప్రయాణికుల్లో చాలా మంది తిరిగి సాయంత్రం తమ ఊళ్లకు బయలుదేరి వెళ్తారు. వరంగల్, మడికొండ, ఘన్పూర్,రఘునాథ్‌పల్లి, జనగామ, తదితర ప్రాంతాల నుంచి సుమారు 5 వేల మందికి పైగా నెలవారీ పాస్‌లపైన రాకపోకలు సాగిస్తారు. ► మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ చుట్టుక్కల ప్రాంతాల నుంచి మరో 7 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తారు. వికారాబాద్, తాండూర్, తదితర ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ ఉంటుంది. ► గతంలో ఆలేరు నుంచి హైదరాబాద్‌కు కేవలం రూ.250 నెలవారీ పాస్‌తో రాకపోకలు సాగించిన ప్రయాణికులు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో రూ.1000కి పైగా ఖర్చు చేయాల్సివస్తోంది. (క్లిక్ చేయండి: మెరుపు సమ్మెపై మెట్రో యాజమాన్యం స్పందన) -
స్వేచ్ఛా విగ్రహం కంటే ఐక్యతా విగ్రహమే ఘనం
అహ్మదాబాద్: అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ) కంటే గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) సందర్శించడానికే ఎక్కువ మంది వస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన కేవాడియాలో నెలకొల్పిన ఈ విగ్రహాన్ని 2018 అక్టోబర్‌లో ప్రారంభించగా, ఇప్పటివరకు 50 లక్షల మంది సందర్శించారని పేర్కొన్నారు. అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్ ప్రాంతాలను కేవాడియాతో అనుసంధానించేందుకుగాను కొత్తగా 8 రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ రైళ్లతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐక్యతా విగ్రహాన్ని చూసేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నిత్యం లక్ష మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారని ఒక సర్వేలో తేలిందని వివరించారు. దబోయి, చందోడ్, కేవాడియా రైల్వే స్టేషన్లను, దబోయి–చందోడ్, చందోడ్–కేవాడియా బ్రాడ్‌గేజ్ లైన్లను, నూతనంగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్–కేవాడియా సెక్షన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఒకే గమ్యస్థానానికి చేరుకునే 8 రైళ్లకు ఒకే సమయంలో పచ్చజెండా ఊపడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. కేవాడియా అనేది ఇకపై మారుమూల చిన్న పట్టణం కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారబోతోందని స్పష్టం చేశారు. పర్యావరణ హిత రైల్వే ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. అందుకు కేవాడియా రైల్వే స్టేషన్ ఒక ఉదాహరణ అని చెప్పారు. మోదీ ప్రారంభించిన 8 రైళ్లలో అహ్మదాబాద్–కేవాడియా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఈ రైల్లో ప్రత్యేక ఏమిటంటే ఇందులో విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి. కోచ్ కిటీకలు, తలుపులే కాకుండా పైభాగాన్ని కూడా అద్దాలతోనే తీర్చిదిద్దారు. -
కొత్త రైళ్లతో రైల్వే షేర్లు స్పీడ్
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్‌ను ఈ నెలాఖరు వరకూ నాలుగోసారి పొడిగించినప్పటికీ పలు ఆంక్షలను సడిలించింది. దీనిలో భాగంగా రైల్వే శాఖ శ్రామికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు నిర్వహిస్తున్న శ్రామిక్ స్పెషల్ రైళ్లను రెట్టింపునకు పెంచుతున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ వారం నుంచీ 400 శ్రామిక్ స్పెషల్స్ నడవనున్నాయి. కాగా.. మరోవైపు సాధారణ ప్రయాణికుల కోసం మరో 200 నాన్ఏసీ రైళ్లను సైతం జూన్ 1 నుంచీ ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. అయితే వీటికి రిజర్వేషన్ సౌకర్యం ఆన్లైన్ ద్వారా మాత్రమే కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే న్యూఢిల్లీ నుంచి దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ ఈ 11 నుంచీ రైల్వే శాఖ 30 ఏసీ ట్రయిన్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. రెండు నెలల లాక్‌డవున్ తదుపరి నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న కారణంగా రైల్వే మౌలిక సదుపాయాలు తదితరాలు ఊపందుకోనున్నట్లు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. లాభాల్లో.. ఎన్ఎస్ఈలో రైల్ రంగ కౌంటర్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోలుదారులు అధికం కావడంతో ఐఆర్సీటీసీ లిమిటెడ్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 63.5 పెరిగి రూ. 1333ను అధిగమించింది. ఈ బాటలో రైల్ వికాస్ నిగమ్ సైతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌కు చేరింది. రూ. 17.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. ఇక టెక్స్మాకో రైల్ 2.6 శాతం ఎగసి రూ. 21.7 వద్ద ట్రేడవుతోంది. -
కిసాన్ రైలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రైళ్లు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్లు, వేగంగా పాడయ్యే పదార్థాల రవాణా.. ఇవీ రైల్వేల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు. రూ.70,000 కోట్ల బడ్జెట్‌తో వీటిని అమలు చేస్తారు. గత ఏడాది సవరించిన బడ్జెట్ రూ.69,967 కోట్లు. రిఫ్రిజిరేటర్ కోచ్‌లతో కిసాన్ రైలు రైతుల కోసం తెచ్చే ‘కిసాన్ రైల్లో రిఫ్రిజిరేటర్ కోచ్‌లు ఉంటాయి. త్వరగా పాడైపోయే పదార్థాలను తరలించడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి దేశ వ్యాప్తంగా ఆటంకాలు లేని జాతీయ సప్లయ్ చెయిన్ నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లకు కూడా రిఫ్రిజిరేటర్ కోచ్‌లను అనుసంధానిస్తారు. ఇక రైల్వే విస్తరణ ప్రణాళికలను కొనసాగించేందుకు మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్లో రూ. 1.61 లక్షల కోట్లకు పెంచారు. కొత్త లైన్లకు రూ.12 వేల కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోణంలో కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. గేజ్ మార్పునకు రూ. 2,250 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 5,786.97 కోట్లు, సిగ్నలింగ్, టెలికం వ్యవస్థకు రూ. 1,650 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల సదుపాయాల కల్పనకు రూ. 2,725.63 కోట్లు కేటాయించారు. సరుకు రవాణా 1,265 మెట్రిక్ టన్నులు ఉండవచ్చు. ప్రయాణికులు, సరుకు రవాణా ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ. 61 వేల కోట్లు, సరుకు రవాణా నుంచి రూ. 1.47 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. రెవెన్యూ ఖర్చులో జీతాలను రూ. 92,993.07 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 6 వేల కోట్లు ఎక్కువగా ఉంది. -
కొత్త రైళ్లలో రాష్ట్రానికి మొండిచేయి!
* అక్టోబర్ ఒకటి నుంచి రైల్వే కొత్త టైంటేబుల్ * రెండు కొత్త రైళ్లు ఏపీకే పరిమితం.. పలు రైళ్ల వేళల్లో మార్పులు సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైల్వే శాఖ కొన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త సమయపట్టిక అమలులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కొత్త రైళ్ల వివరాలను వెల్లడించింది. కానీ ఇందులో తెలంగాణ మీదుగా వెళ్లే ఒక్క రైలూ లేకపోవటం విశేషం. దక్షిణ మధ్య రైల్వేకు రెండు కొత్త రైళ్లు ఇవ్వగా ఆ రెండూ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే గుండా వెళ్లే మరికొన్ని రైళ్లను ప్రకటించగా అవీ ఏపీ మీదుగానే ప్రయాణించనుండటం విశేషం. విజయవాడ-విశాఖపట్నం, తిరుపతి-జమ్మూతావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లు కొత్తవి. భువనేశ్వర్-కృష్ణరాజపురం, హౌరా-యశ్వంతపూర్, కామాఖ్య-బెంగళూరు, సంత్రాగచ్చి-చెన్నై, హౌరా-ఎర్నాకులం, హాతియా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లు దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి వెళ్లేవే అయినా ... ఇందులో ఏవీ కూడా తెలంగాణకు రాకుం డానే ప్రయాణిస్తాయి. ఇటీవల రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నగరానికి వచ్చినపుడు రైల్వేశాఖ అధికారులు యూపీఏ ప్రభుత్వ హయాంలో హామీ ఇచ్చి.. పట్టాలెక్కని 2 రైళ్లను ప్రారంభించేలా ఏర్పాటు చేశారు. ఇందులో కాజీపేట-ముంబై, సికింద్రాబాద్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లు తెలంగాణ పరిధికి సంబంధించినవి కావటంతో ఇప్పుడు రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. పలు రైళ్ల పొడిగింపు.. కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి చెంగల్పట్టు వరకు వెళ్తుంది. నాందేడ్-పుణే ఎక్స్‌ప్రెస్ పన్వెల్ వరకు, కరీంనగర్-లింగంపేట-జగిత్యాల డెమూ రైలు మోర్తాడ్‌వరకు నడుస్తాయి. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (57254/ 57253-77292/77291), యశ్వంత పూర్- శ్రీమాతావైష్ణోదేవీ కట్రాఎక్స్ప్రెస్ (22679/ 22680- 82651/ 82652) నంబర్లు మారాయి. 111 రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. కాచిగూడ-రాయచూర్ (శనివారం నడవదు), రాయచూర్-గద్వాల (శనివారం నడవదు), గద్వాల-రాయచూర్ (సోమవారం ఉండదు), రాయచూర్-కాచిగూడ (సోమవారం ఉండదు) రైళ్లు నడవని రోజులను మార్చారు. 62 రైళ్ల వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించారు. -
కొత్త రైళ్లలో బాదుడే..
న్యూఢిల్లీ: రైల్వే చార్జీల పెంపుపై బడ్జెట్ సమావేశంలో నోరైనా మెదపని ప్రభుత్వం తాజాగా రానున్న కొత్త రైళ్లలో సౌకర్యాలను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. హుమ్ సఫర్, తేజాస్, ఉత్ర్కిష్ట్ డబుల్ డెక్కర్, ఉదయ్ వంటి ఈ సంవత్సరం ప్రారంభం కానున్న పలు రైళ్లలో 15 నుంచి 30 శాతం రేట్లను పెంచే ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. 2016-17 బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ రైళ్లన్ని ఏ ప్రతిపాదిత ప్రాంతాల్లో నడపాలనే దాని మీద ఇంకా కసరత్తు నడుస్తోంది. భారతీయ రైల్వేలు ఇప్పటికే సువిధ పేరుతో సమయాన్ని అనుసరించి ధరల మార్పిడితో రైళ్లను నడుపుతున్నాయి. ఎక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో సువిధ రైళ్లను నడపడం వల్ల రైల్వే శాఖ భారీగా లాభాలను అర్జిస్తోంది. హమ్‌సఫర్ రైళ్లలో అన్నీ 3 టైర్ ఏసీ బోగీలు ఉంటాయి. తేజస్ రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కొత్తగా డిజైన్ చేసిన ఉదయ్ డబుల్ డెక్కర్ రైళ్లు 40 శాతం ఎక్కువ మందిని గమ్యస్థానాలకు చేరుస్తాయి. రైల్వేలు తాజాగా పరిచయం చేసిన మహామన ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండటం వల్ల రేట్లు కూడా పెంచారని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
పాత పట్టాల పరుగే
అందరినీ సంతృప్తి పరచాలనే తాపత్రయం అతి తరచుగా ఎవరినీ సంతృప్తి పరచకుండా ముగుస్తుంటుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రెండవ రైల్వే బడ్జెట్ సరిగ్గా అలాంటిదే. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల ఆశలు చూపని ఈ బడ్జెట్లోని ప్రధాన ఆకర్షణ ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను పెంచకపోవడమే. 2015-16 రైల్వే బడ్జెట్ రూ. 1.83 కోట్ల రాబడిని లక్ష్యంగా పెట్టుకున్నా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 1.67 కోట్లకు మించకపోవచ్చు. ఈ రాబడి లోటుకు తోడు ఏడవ పే కమిషన్ సిఫారసుల ప్రకారం వేతనాల పెరుగుదల రూ. 32.000 కోట్ల అదనపు భారాన్ని కూడా మోయాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవస్థ మంద గమనం వల్ల రవాణా చార్జీలను, ప్రయాణికుల చార్జీలను స్వల్పంగా పెంచినా రాబడిలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదనీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదే జరగాల్సి ఉండగా భారీ చార్జీల పెంపుదల రాజకీయంగా మంచిది కాదనీ ఆ జోలికి పోలేదనిపిస్తుంది. తర్వాత వడ్డింపులకు ఎలాగూ అవకాశం ఉంటుంది. చార్జీలు పెంచకుండానే రైల్వే మంత్రి ఈ ఏడాది కంటే 10 శాతం ఎక్కువ రాబడిని, రూ.1,84,820 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాదిలోనే రాబడి లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన ైరైల్వేలు వచ్చే ఏడాది రాబడిని ఎలా పెంచుకోగలవో అర్థం కాదు. ఆపరేటింగ్ వ్యయాల నిష్పత్తిని... ప్రతి రూ. 100 రాబడి కోసం ఖర్చు చేయాల్సివచ్చే వ్యయాన్ని... ప్రస్తుత రూ.97.8 నుంచి రూ.92కు తగ్గిస్తా మన్నారు. మన రైల్వేలను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక రుగ్మతలైన అనవసర, వృథా వ్యయాలు, అసమర్థత, అలసత్వాలను ఒక్క ఏడాదిలో మటుమాయం చేయగల చిట్కా ఏమిటో అంతుపట్టదు. గత ఏడాది దాదాపు లక్ష కోట్లుగా ఉన్న వ్యయాన్ని ఈ బడ్జెట్లో రూ. 1,21,000 కోట్లకు అంటే 21 శాతం పెంచారు. నిధులను జీవిత బీమా సంస్థ వచ్చే ఐదేళ్లలో అందజేయనున్న 1.5 లక్షల కోట్ల సులభ షరతుల రుణం నుంచి, విదేశాలలో బాండ్ల అమ్మకం ద్వారా సమీకరిస్తామన్నారు. భారత రైల్వేల ఆత్మ ప్రజలే అంటూ ప్రభు రైల్వేలను ప్రయాణికులకు అనుకూలమైనవిగా మార్చడానికి పలు చర్యలను ప్రతిపాదించారు. టెలిఫోన్ ద్వారా టికెట్ల రద్దు, ఎస్ఎమ్ఎస్ ద్వారా క్యాటరింగ్, ఉచిత వైఫై సర్వీసులు, పిల్లలున్న తల్లుల కోసం ప్రత్యేక సదుపాయాలు వంటి పలు మెరుపులు మెరిపించారు. ప్రయాణికులకు సదుపాయాలను, స్టేషన్లు, రైళ్లలో పారిశుద్ధ్యం, సమాచార వ్యవస్థలను మెరుగుపర్చడం అవసరమనడం నిస్సం దేహం. తద్వారా ప్రయాణికులను ఆకట్టుకోగలమని భావించడంలోని సహేతుకత అంతుబట్టదు. సరుకుల, ప్రయాణికుల రవాణా రాబడులు పడిపోవడానికి ప్రధాన కారణం పారిశ్రామిక క్షీణత, రెండేళ్లుగా వ్యవసాయ రంగం దె బ్బ మీద దెబ్బతినడం. వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనలకు తావిచ్చిందంటున్న ఈ బడ్జెట్ మన సంప్రదాయక ఆలోచనల పరిధి నుంచి బయటపడ లేకపోయింది. స్వల్ప దూరాలకు ప్రయాణ సాధనాలుగా రైల్వేలు అట్టడుగు స్థాయిల్లో ఉండ టంలోని అర్థరాహిత్యాన్ని ఎందుకు గ్రహించలేరో అర్థం కాదు. చిన్న పట్టణాలను, నగరాలను గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానించడానికి తక్కువ దూరపు లైన్ల నిర్మాణం, గ్రామీణ, సబర్బన్ రైళ్ల నిర్వహణ చేపట్టడం లాభదాయకమే కాదు, రాబడిని పెద్ద ఎత్తున పెంచుకునే మార్గం కూడా. పాత బాటనే నడిచిన ప్రభు బడ్జెట్ కూడా అటు దృష్టి సారించలేదు. దేశంలోని రైల్వే క్రాసింగులలో 35 శాతం, అంటే 10 వేలకు పైగా కావలి లేనివి. ప్రతి రైల్వే మంత్రీ, ప్రతి రైల్వే బడ్జెట్లోనూ ఈ సమస్యను పరిష్కరిస్తామంటూనే ఉన్నారు. గత ఏడాది ప్రభు కూడా వాగ్దానం చేశారు. గత ఆరు నెలల్లో 156 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద మాత్రమే సిబ్బందిని నియమించ గలిగారు. ఈ లెక్కన ఈ సమస్య పరిష్కారానికి మూడు దశాబ్దాలు పడుతుంది. రాబోయే 3-4 ఏళ్లలోనే ఆ పని పూర్తి చేసేస్తామని మంత్రి ఎలా హామీ ఇచ్చారో తెలియదు. ప్రస్తుత సగటు వేగం 30 కిలోమీటర్లను రెట్టింపు చేస్తామనడం, మిషన్ జీరో యాక్సిడెంట్ వంటి ఆశలన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలే తప్ప ఏడాది బడ్జెట్లో సాధ్యం కానివి. దేశంలోని 40 శాతానికి పైగా లైన్లు ఇప్పటికే 100 శాతానికిపైగా సామర్థ్యంతో పనిచేయాల్సి వస్తోంది. 2011-12 నుంచి కొత్తలైన్ల నిర్మాణం క్షీణిస్తూ వస్తోంది. ఇప్పుడున్న లైన్ల మీదే రిజర్వేషన్లేని ప్రయాణికులకు అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లను, హమ్‌సఫర్, తేజస్ ఉదయ్, ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెడతామన్నారు. వీటిలో తేజస్ 130 కిలోమీటర్ల లగ్జరీ ఎక్స్‌ప్రెస్. ఇవన్నీ విపరీతమైన రద్దీ భారాన్ని మోస్తున్న లైన్లపై మరింత భారాన్ని మోపుతాయి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు సహా ప్రభు 44 భాగస్వామ్య ప్రాజెక్టులను, రెండు రైలింజన్ల ఫ్యాక్టరీలను ప్రకటించారు. ఈశాన్యం తదితర ప్రాంతాలలో ఇప్పటికే ఉన్న లైన్లను బ్రాడ్గేజీకి మార్చడం, ఆధునీకరించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమే. అయితే ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులను పరిపూర్తి చేయడం వల్ల ఒక్క ఏడాది కాలంలో తక్కువ వ్యయాలతో ఎక్కువ ఫలితాలను రాబట్టవచ్చని విస్మరించడం విచారకరం. ఆనవాయితీ అన్నట్టుగా ఈ బడ్జెట్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల పట్లా సమాన నిర్లక్ష్యాన్ని చూపింది. తెలంగాణలో కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఊసే ఎత్తలేదు. మనోహరాబాద్-కొత్తపల్లి-భద్రాచలం-సత్తుపల్లి లైన్, దశాబ్దిన్నర క్రితమే సగం పూర్తయిన పెద్దపల్లి-కరీంనగ ర్-నిజామాబాద్ మార్గం సహా ఏదీ పూర్తి అయ్యే అవకాశమే లేకుండా అన్ని ప్రాజెక్టులకూ చిల్లర డబ్బులు విదిల్చినట్టు నిధులను కేటాయించడంలోని సహేతుకత ఏమిటో అంతుబట్టదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే వైఖరి చూపిన బడ్జెట్... విశాఖపట్నం రైల్వే జోన్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో చేసిన వాగ్దానాన్ని సైతం విస్మరించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీరని అన్యాయంగా భావించడం అసహజం కాదు. జాతీయ ప్రయోజనాల రీత్యానే అత్యంత కీలకమైన శ్రీకాళహస్తి -నడికుడి రైల్వే లైన్‌ను పూర్తి చేయడానికి సిద్ధపడకపోవడంలోని ఔచిత్యం ఏమిటో అర్థం కాదు. పలు ఆకర్షణల మెరుపులతో ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పాత పట్టాల మీద పరుగే. -
ఆపుతారో... ఊపుతారో!
కొత్త రైళ్ల కల నెరవేరేనా? నేడు రైల్వే బడ్జెట్ సిటీబ్యూరో: మహా నగర ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తిస్తున్న బడ్జెట్ రైలు పట్టాల పైకి రాబోతోంది. మరి కొద్దిసేపట్లో రైల్వే మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. నగర వాసులు ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా రైల్వే బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా ‘ఆశల రైళ్లకు’ పచ్చజెండా ఊపుతారో... యధావిధిగా ఎర్రజెండా చూపుతారో తేలిపోనుంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ నుంచి నిత్యం 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్ రైళ్లతో పాటు నగరంలో 121 ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి.విశాఖ, తిరుపతి వంటి రూట్లలో కొత్త రైళ్లను ప్రవేశపెట్టినప్పటికీ ఇంకా డిమాండ్ ఉండనే ఉంది. హైదరాబాద్ నుంచి వివిధ పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాలకు వెళ్లే భక్తుల కోసం మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకు రావాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ జాబితాలో ఉంది. ఏటా వేలాది మంది అజ్మీర్ దర్గాకు వెళ్తారు. అలాగే షిరిడీ, శబరికి వెళ్లే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. ఈ సంఖ్యకు తగినట్టు రైళ్లు పెరగడం లేదు. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త లైన్లు... ప్రస్తుతం వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు మొదలయ్యాయి. కానీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైల్వే మార్గం విషయమై ఏడాదిగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. దీనిపై ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు ఇప్పుడు ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసులకు ప్రత్యేక లైన్లు లేకపోవడం వల్ల అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి. శంకర్పల్లి-పగిడిపల్లి మధ్య బైపాస్ రైల్వే లైన్ నిర్మించడం వల్ల గూడ్సు రైళ్లను ఆ దిశలో మళ్లించేందుకు అవకాశం లభిస్తుంది. సికింద్రాబాద్ మార్గంలో గూడ్సు రైళ్ల ఒత్తిడి తగ్గి ఎంఎంటీఎస్‌కు అవకాశాలు పెరుగుతాయి. అలాగే మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 150 కిలోమీటర్ల కొత్త మార్గం వేయవలసి ఉంది. నగరం నుంచి మహబూబ్‌నగర్‌కు కొత్త లైన్లు వేయాలనే ప్రతిపాదన కూడా పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు సికింద్రాబాద్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు వట్టినాగులపల్లి, మౌలాలీల్లో భారీ ప్రయాణికుల టెర్మినళ్లను నిర్మించాలన్న ప్రతిపాదనలూ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ ఏడాది ఆ దిశగా ఏమైనా కదలిక, పురోగతి ఉంటాయా, లేదా అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. కొండెక్కిన ‘ముష్కిల్ ఆసాన్’ ప్రయాణికుల చెంతకే రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం అన్న లక్ష్యంతో 2010లోనే ‘ముష్కిల్ ఆసాన్’ అనే పథకానికి ప్రతిపాదనలు రూపొందించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. సికింద్రాబాద్‌లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. కానీ అంగుళం కూడా ముందుకు కదల్లేదు. రిజర్వేషన్ బుకింగ్ కార్యాలయాల వద్ద రద్దీ వల్ల, ఆన్లైన్ సేవలు అందుబాటులో లేకపోవడం వంటి ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రయాణికుల వద్దకే సంచార రిజర్వేషన్ కేంద్రాలను తీసుకెళ్లాలనేది ఈ పథకం లక్ష్యం. ఈ మార్గాల్లో రైళ్లు అవసరం జంట నగరాల నుంచి సుమారు 100 నుంచి 120 ప్రధాన రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. విశాఖ, తిరుపతి, బెంగళూరు, షిరిడీ, తిరువనంతపురం, అజ్మీర్‌లకు మరిన్ని కొత్త రైళ్లకు డిమాండ్ ఉంది. కాచిగూడ నుంచి బెంగళూర్‌కు 2 ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ రూట్లో మరో 2 రైళ్లకు డిమాండ్ ఉంది. నగరం నుంచి షిరిడీ వెళ్లే భక్తులకు ప్రస్తుతం మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. కాకినాడ నుంచి నేరుగా షిరిడీ వరకు సాయినగర్ ఎక్స్‌ప్రెస్ ఉంది. కానీ ఇది వారానికి రెండు రోజులే నడుస్తుంది. ఈ రూట్లో హైదరాబాద్ నుంచి మరో రైలు నడపాలనే డిమాండ్ ఉంది. {పస్తుతం అయ్యప్ప భక్తుల కోసం శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. నగరం నుంచి తిరువనంతపురానికి మరో ఎక్స్‌ప్రెస్ తప్పనిసరి. వరంగల్, మిరియాలగూడ, మణుగూర్ల నుంచి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. తెలంగాణలోని మిగతా జిల్లా కేంద్రాల నుంచి నగరానికి ఇంటర్సిటీ సర్వీసులతో రవాణా సదుపాయం మెరుగుపర్చవలసిన అవసరం ఉంది. -
కాజీపేట నుంచి చుక్.. చుక్
కొత్త రైళ్లు ప్రారంభం కాజీపేట-ముంబయి, ముంబయి-కాజీపేట బెల్లంపెల్లి, విజయవాడ మార్గంలో నాలుగు ట్రైన్లు కాజీపేట మీదుగా రాకపోకలు..మారిన పలు ఎక్స్‌ప్రెస్‌ల వేళలు కాజీపేట రూరల్ : నిజాం రైల్వే కాలంలో నిర్మించిన కాజీపేట జంక్షన్‌కు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక మొదటిసారిగా రైల్వే పరంగా ప్రాధాన్యం లభించింది. ఉత్తర, దక్షిణ భారతదేశానికి గేట్వేగా ఉంటున్న అతి ప్రధానమైన ఈ జంక్షన్ నుంచి దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. 2014-15 రైల్వే బడ్జెట్లో రైల్వేమంత్రి సదానందగౌడ ప్రకటించిన మేరకు కాజీపేట-ముంబయి వేళ్లే ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి రాకపోకలు సాగించనుంది. వరంగల్, కరీంనగర్ జిల్లావాసుల 30 ఏళ్ల డిమాండ్‌ను పరిశీలించిన రైల్వే శాఖ ఎట్టకేలకు కాజీపేట జంక్షన్ నుంచి నేరుగా ముంబయికి అప్ అండ్ డౌన్లో రెండు సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు కాజీపేట రైల్వే అధికారులు సోమవారం కాజీపేట నుంచి ప్రారంభం కానున్న రైలు, ఈ జంక్షన్ మీదుగా ప్రయాణించే రైళ్ల వేళల్లో మార్పులను వివరించారు. కాజీపేట-ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్ నుంచి లోకమాన్యతిలక్ టర్మినల్ (ఎల్టీటీ) వెళ్లే 11804 నంబర్ గల ముంబయి ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 11083 నంబర్ గల ముంబయి ఎక్స్‌ప్రెస్ ఎల్టీటీ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. ఈ రైలుకు అప్ అండ్ డౌన్లో జమ్మికుంట, పెద్దపెల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపెల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. విశాఖపట్నం-సికింద్రాబాద్ ఏసీ ఎక్స్‌ప్రెస్ 12783 నంబర్ గల విశాఖ పట్నం-సికింద్రాబాద్ వెళ్లే ఏసీ ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు ప్రతి సోమవారం ఉదయం 4.44 గంటలకు చేరుకుని 4.46 గంటలకు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో 12784 నంబర్ గల సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్లే ఏసీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం కాజీపేటకు రాత్రి 7.43 గంటలకు చేరుకుని 7.45 గంటలకు వెళ్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు మౌళాలి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడిపెల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. పలు రైళ్ల వేళల్లో మార్పులు కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మారాయి. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 18520 నంబర్ గల ఎల్టీటీ-విశాఖపట్నం వెళ్లే లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ కాజీ పేటకు ప్రతి రోజు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది. 17250 నంబర్ గల సికింద్రాబాద్-మచిలీపట్నం వెళ్లే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు కాజీపేటకు అర్ధరాత్రి 12.25 గంటలకు వస్తుంది. 12710 నంబర్ గల సికింద్రాబాద్-గూడూరు వెళ్లే సిం హపురి ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు ప్రతిరోజు అర్ధరాత్రి 12.55 గంటలకు చేరుకుంటుంది. 17026 నంబర్ గల సికింద్రాబాద్-మణుగూర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు కాజీపేటకు అర్ధరాత్రి 1.45 గంటలకు వస్తుంది. 12709 నంబర్ గల గూడూర్-సికింద్రాబాద్ వెళ్లే సింహపురి ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు ప్రతి రోజు తెల్లవారుజాము 6.05 గంటలకు చేరుకుంటుంది. -
కొత్త రైళ్లు వచ్చేనా?
సాక్షి, చెన్నై: యూపీఏ-1లో తమిళనాడుకు కలిసి వచ్చే అంశాలు అధికంగా ఉన్నాయి. యూపీఏ భాగస్వామి డీఎంకే రాష్ట్రంలో అధికారంలో ఉండడం అందులో ఒకటి. యూపీఏ -2లో పరిస్థితి తారుమారు అయింది. యూపీఏ హామీలు బుట్టదాఖలయ్యాయి. ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులకు మొక్కుబడిగా నిధుల్ని విదిల్చారు. రాష్ట్రంలో డీఎంకే పతనం అన్నాడీఎంకే అధికారంలోకి రావడంతో పరిస్థితి మరీ దారుణం అయింది. కొత్త రైల్వే ప్రాజెక్టుల మీద యూపీఏ -2 దృష్టి పెట్ట లేదు. అమల్లో ఉన్న ప్రాజెక్టులు మరింత నత్తనడకన సాగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో తాజాగా కేంద్రంలో అధికారం మారింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్‌ను ప్రకటించేందుకు సిద్ధం అయింది. అయితే, ఈ బడ్జెట్లో తమిళనాడు మీద ఏ మేరకు కేంద్రం దృష్టి సారించనుందోనన్న ఎదురు చూపులు పెరిగాయి. కేంద్రంతో సామరస్యంగా మెలిగేందుకు రాష్ర్టంలోని అన్నాడీఎంకే సర్కారు అడుగులు వేస్తున్న సమయంలో మోడీ సర్కారు ఏ మేరకు తమిళుల మీద ప్రేమ చూపనుందో మరి కాసేపట్లో తేలిపోతుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సదానంద గౌడ కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడంతో ఆ రాష్ట్రానికి వరాలు కురిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తమిళనాడులో అమల్లో ఉన్న ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారో, కొత్త రైళ్ల సేవలకు ఏ మేరకు శ్రీకారం చుడుతారోనని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ సైతం పావులు కదుపుతున్న నేపథ్యంలో, రాష్ట్రానికి అత్యధికంగా రైల్వే నిధులు తెప్పించుకునేందుకు కమలనాథులు కృషి చేశారా? లేదా అన్న విషయం కూడా తేటతెల్లం కాబోతున్నది. ఎదురు చూపులు: నిధుల కోసం ఎదురు చూస్తున్న అనేక రైల్వే ప్రాజెక్టులు తమిళనాడులో ఉన్నాయి. కొన్ని ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతుంటే, మరి కొన్ని నిధులు వచ్చినప్పుడల్లా, పరుగులు తీయడం, ఆ తర్వాత ఆగడం పరిపాటే. కొన్ని ప్రాజెక్టులు అయితే, కేవలం హామీకే పరిమితమయ్యాయి. ఇందులో కొన్ని చెన్నై - తిరుపతి మధ్య ప్రకటించిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పట్టాలు ఎక్కలేదు. చెన్నై సెంట్రల్ నుంచి దక్షిణ తమిళనాడు వైపుగా ప్రకటించిన ఐదు రైళ్ల ఊసే లేదు. నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్న చెంగల్పట్టు - విల్లుపురం రెండో మార్గం పనులకు మోక్షం లేదు. మదురై - కన్యాకుమారి రెండో మార్గం పనులు ఆగిపోయూయి. మదురై-బోడి నాయకనూర్, తెన్కాశి - పునలూర్, పొల్లాచ్చి-పళని రైల్వే మార్గాల పనులకు నిధులు వచ్చేనా, కొత్త రైళ్లు నడి చేనా అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. కొత్త ఆశలు...: దక్షిణాదికి నిత్యం చెన్నై నుంచి వెళ్లే రైళ్లు కిక్కిరిసి ఉంటాయి. దీంతో తమ ప్రాంతాల మీదుగా అంటే తమ ప్రాంతాల మీదుగా రైళ్ల సేవలకు శ్రీకారం చుట్టాలన్న విజ్ఞప్తులు రైల్వేశాఖ చెంత ఉన్నాయి. ఈ ప్రతిపాదనల్లో ఉన్న అంశాలు ఇవి దిండివనం - నగరి, గూడువాంజేరి - శ్రీ పెరంబదూరు కొత్త రైల్వే మార్గాలు ఏర్పాటు చేయూలి జోలార్ పేట - హోసూరు, అరక్కోణం - కాట్పాడి, రామేశ్వరం - ధనుస్కోడిలకు అదన ంగా కొత్త రైల్వే మార్గాలకు అనుమతించాలి తిరుచ్చి-నెల్లై ఇంటర్ సిటీ కన్యాకుమారికి పొడిగించాలి చెన్నై షిరిడీ వారాంతపు రైలు ఇక వారంలో మూడు రోజులు నడిపించాలి చెన్నై - నాగుర్ కోయిల్ మధ్య రోజు వారీగా రైలు సేవలు సాగాలి మదురై - దిండుగల్, కోయంబత్తూరు - తిరుప్పూర్, తిరుచ్చి - తంజావూరు మధ్య ఎలక్ట్రిక్ రైళ్ల సేవలకు శ్రీకారం చుట్టాలి. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా తాంబరం స్టేషన్‌ను మూడో టెర్మినల్‌గా ప్రకటించి, నిధులు కురిపించాలి. చెన్నై నుంచి కన్యాకుమారి, రామేశ్వరానికి పగటి పూట అన్ రిజర్వుడ్ బోగీలతో రైళ్లు నడపాలి చెన్నై - గోవా, చెన్నై - మూసూర్, చెన్నై - కాయంకుళం, చెన్నై - తిరువణ్ణామలై మధ్య కొత్త రైళ్ల సేవలకు శ్రీకారం చుట్టాలి అన్న డిమాండ్లు సదానంద బడ్జెట్ ముందు ఉన్నాయి. -
కొత్తరైళ్లు కూతపెట్టేనా?
ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై పడమటి మండలాల ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు జిల్లా వాసి కావడం, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు మదనపల్లె డివిజన్‌తో మంచి అనుబంధం ఉండడంతో ఈ దఫా బడ్జెట్లో కొత్తరైళ్లు కూతపెట్టడం ఖాయమని భావిస్తున్నారు. వీరి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి మరి. మదనపల్లె సిటీ : తిరుపతి-పాకాల-గుంతకల్లు మధ్య అన్ని రైల్వే స్టేషన్లూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటా యి. అయితే తిరుపతి-గుంతకల్లు మార్గంలో చాలినన్ని రైళ్లులేవు. నడుస్తున్న రైళ్లకు బోగీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. లగేజీ బోగీల్లో వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. 2010 జూన్‌లో తిరుపతి నుంచి సీటీఎం మీదుగా కొత్త బ్రాడ్‌గేజ్ మార్గాన్ని ప్రారంభించారు. ప్రసుత్తం ఈ మా ర్గంలో తిరుపతి-గుంతకల్లు మధ్య పగలు రెండు, రాత్రి రెండు ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. బుధ, గురువారాల్లో పద్మావతి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తోంది. అమరావతి ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు రోజు లు నడుస్తోంది. అయినా మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. సీటీఎం రైల్వేస్టేషన్ నుంచి రోజూ 800 మంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. గతంలో రోజూ తిరుపతి-హైదరాబాద్ మధ్య వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తిరుగుతుండేది. ఈ మార్గంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ పునరుద్దురిస్తామని, హైదరాబాద్-తిరుపతి మధ్య కొత్త రైలు ఖాద్రి ఎక్స్‌ప్రెస్ పేరిట నడుపుతామని పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు బ్రాడ్‌గేజ్ ప్రారంభ సమయంలో హామీలు గుప్పించారు. వీటిని చూసి స్థానిక ప్రజలు మురిసి పోయారు. ఆతరువాత ఆ ఊసే లేకుండా పోయింది. ఈ బడ్జెట్లో నడుస్తున్న రైళ్లకైనా అదనపు బోగీలు ఏర్పాటు చేస్తారోలేదోనని పలువురు ఎదురు చూస్తున్నారు. దారి మళ్లిస్తే 100 కి.మీ దూరం తగ్గుతుంది ముంబాయి నుంచి రేణిగుంట మీదుగా కన్యాకుమారి వెళుతున్న జయంతి ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు మీదుగా మళ్ల్లిస్తే కన్యాకుమారి-ముంబై మధ్య వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం చిత్తూరు నుంచి కడప మీదుగా సికింద్రాబాద్ వెళుతున్న వెంకట్రాది ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు మరికొన్ని రైళ్లను పాకాల-ధర్మవరం మీదు గా మళ్లించాలని అధికారులు ప్రతిపాదించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రతిపాదనను ఈ రైల్వే బడ్జెట్లోనైనా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. తాత్కాలిక బడ్జెట్లో ఏముంది! యూపీఏ ప్రభుత్వం ఇంటి దారి పట్టేముందు ఆదరాబాదరాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో పడమటి మండలాలకు మొండి చేయి చూపింది. కడప-బెంగళూరు రైల్వేలైను పనుల మాటేంటి? కడప-మదనపల్లె వయా బెంగళూరు రైల్వే లైను పనులు ప్రశ్నార్థకంగా మారాయి. కడప నుంచి లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, మదనపల్లె, పుంగనూరు, రామసముద్రం మీదుగా బెంగళూరుకు రైలుమార్గం ఏర్పాటు చేసేందుకు ఐదేళ్ల క్రితం రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వే సౌకర్యం కల్పించేలా సర్వే చేయించారు. 350కిలో మీటర్లు ఉన్న ఈ మార్గంలో రైలు నడిపితే కడప, బెంగళూరు మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతాయని భావించారు. సుమారు రూ.1080 కోట్ల అంచనాతో ఈ మార్గానికి శంకుస్థాపన చేశారు. అయితే ప్రతి ఏటా బడ్జెట్లో చాలినన్ని నిధులు మంజూరు చేయడంలేదు. 2010 బడ్జెట్లో రూ.40 కోట్లు, 2011లో రూ.56 కోట్లు, 2012లో రూ.60 కోట్లు కేటాయించారు. 2013లో మొండి చెయ్యి చూపారు. 2014 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో దీని ప్రస్తావనే రాలేదు. అరకొర నిధులతో సర్వే, మార్గంలోని రాళ్లు, చెట్లను తొలగించేందుకు సరిపోతోంది. ఈ రైల్వే లైను సర్వే పనులు వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి వరకు జరిగాయి. మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంది. -
కూతలా.. కోతలా!?
రైల్వే బడ్జెట్‌పై కోటి ఆశలు విజయవాడకు ప్రత్యేక కేటాయింపులు కావాలి ‘స్పెషల్’ రైళ్లు సకాలంలో నడిచేలా చూడాలి ప్లాట్‌ఫారాలపై నిలువ నీడ కల్పించండి ఏటా రైల్వే బడ్జెట్లో నిర్లక్ష్యానికి గురవుతున్న విజయవాడ డివిజన్‌కు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈసారైనా కేటాయింపులు ఘనంగా ఉంటాయని ప్రయాణికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో విజయవాడ కీలకం కావడంతో ఈ డివిజన్‌కు కురిపించే వరాలపై రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పటిలా ఈసారీ కోతలు పెడతారా.. లేక కొత్త రైళ్లను మంజూరు చేస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. కూతలా.. కోతలా!? సాక్షి, విజయవాడ : ప్రత్యేక రైల్వే డివిజన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త రాజధాని ఏర్పాటు కావచ్చన్న వార్తల నేపథ్యంలో విజయవాడ డివిజన్ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడినుంచి దేశం నలుమూలలకు కొత్త రైళ్లు వేయాలని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లను ఏ-కేటగిరీగా అభివృద్ధి చేయాలంటూ ఇప్పటికే మన ఎంపీలు రైల్వే మంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అనేక సౌకర్యాలు రైల్వే బడ్జెట్లో మంజూరు కావాలని ప్రయాణికులు, రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. విజయవాడ, మచిలీపట్నం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు కొత్త రైళ్లు ప్రారంభించాలి. విజయవాడ మీదుగా దూర ప్రాంతాలకు వెళుతున్న ప్రశాంతి, శేషాద్రి, యశ్వంత్‌పూర్, ఫలక్‌నుమా, నాగర్సోల్, మన్మాడ్, పాట్నా, కేరళ, జీటీ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో విజయవాడ ప్రయాణికుల కోసం స్లీపర్ క్లాస్‌లో 100 బెర్త్‌లు, ఏసీలో 50 బెర్త్‌లు ప్రత్యేకంగా కేటాయించాలి. ప్రయాణికుల రద్దీ ఉన్నప్పుడల్లా విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇవి సకాలంలో నడిచేందుకు, రైళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు సరిగా ఉండే విధంగా బడ్జెట్లో తగిన చర్యలు తీసుకోవాలి. విజయవాడ జంక్షన్లో 8, 9, 10 ప్లాట్‌ఫారాలపై పూర్తిగా షెడ్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండావానలకు ఇబ్బంది పడుతున్నారు. వీటి ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు మంజూరుచేయాలి. గుడివాడ, మచిలీపట్నం స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలి. విజయవాడ రైల్వే జంక్షన్‌ను అంతర్జాతీయ రైల్వేస్టేషన్ స్థాయికి పెంచాలి. విజయవాడ-మచిలీపట్నం మార్గం డబ్లింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలి. కోటిపల్లి-నర్సాపురం మార్గానికి నిధులు కేటాయించాలి. రైల్వేస్టేషన్లో నాణ్యమైన ఆహారం లభ్యమయ్యేలా చూడాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి. రైల్వే ప్రయాణికుల భద్రత బాధ్యతల్ని ఆర్పీఎఫ్కు అప్పగించాలి. రైల్వే ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేయాలి. తెనాలి-రేపల్లి-మచిలీపట్నం-విజయవాడ-గుంటూరులను కలుపుతూ సర్క్యులర్ ట్రైన్ ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి దూర ప్రాం తాలకు వెళ్లే రైళ్లలో ఒక పార్సిల్ వ్యాన్‌ను ఏర్పాటుచేసుకోవాలి. రైల్వే ఇంజిన్లు మరమ్మతుకు గురైతే తమిళనాడు వెళ్లాల్సి వస్తోంది. విజయవాడలోనే ఇంజిన్ మరమ్మతు ప్లాంట్ నెలకొల్పాలి. రైల్వే కోచ్‌లు మరమ్మతు చేసే లోకో షెడ్‌ను ఇక్కడే ఏర్పాటు చేయాలి. ఆశలు నెరవేరేనా.. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్ వచ్చే ముందు ఈ ప్రాంత ప్రయాణికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. యూపీఏ సర్కారు అరకొర నిధులే మంజూరుచేసింది తప్ప ఈ ప్రాంత అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదు. కనీసం ఎన్డీఏ ప్రభుత్వమైనా దక్షిణ మధ్య రైల్వేకు, విజయవాడ డివిజన్‌కు పెద్దపీట వేస్తుందో లేదో వేచిచూడాల్సిందే. -
బండెడు ఆశలు
రేపు ‘మోడీ' రైల్వే బడ్జెట్ * జిల్లాలోని రైల్వేస్టేషన్లలో సమస్యల హాల్ట్ * రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఏటా అన్యాయమే.. * ప్రతిపాదనలు పంపిన ఎంపీలు * తెలంగాణ రాష్ర్టంలోనైనా న్యాయం జరిగేనా? ఆదిలాబాద్ : మోడీ సర్కారు, రైల్వే శాఖ మంత్రి సదానందగౌడపై జిల్లా ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. రైల్వే బడ్జెట్లో జిల్లాకు ప్రయోజనం చేకూరుస్తారని ఆశిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చొరవతో జిల్లాకు విస్తృత రైల్వే కనెక్టివిటీ పెరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. పలు కొత్త రైల్వే మార్గాలు, కొత్త రైళ్లను ప్రారంభించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నారు. పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్షిప్(పీపీపీ) పద్ధతిలో కాకుండా కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులను భరించి జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిచేయాలని అంటున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, పెద్దపల్లి ఎం పీ బాల్క సుమన్ జిల్లాకు సంబంధించి పలు ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి కేంద్రానికి వెళ్లిన ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందా! లేదా అనేది మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో తేటతెల్లం అవుతుంది. పొడిగింపుపై ఆశలు * నాందేడ్-ముంబాయి మార్గంలో రోజూ పయనించే తపోవన్ ఎక్స్‌ప్రెస్ ఆదిలాబాద్ వరకు పొడిగించాలి. తద్వారా ఆదిలాబాద్ నుంచి ముంబాయికి మరో రైలు సదుపాయం కలుగుతుంది. * నాందేడ్-బెంగళూరు మార్గంలో వారానికి ఒకసారి వెళ్లే రైలును ఆదిలాబాద్‌కు పొడిగించాలి. * ఢిల్లీ-విశాఖ మధ్యలో నడిచే స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌ను మంచిర్యాలలో ఆపాలి. * జనతా, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లకు రామకృష్ణాపూర్లో హాల్టింగ్ కల్పించాలి. * నవజీవన ఎక్స్‌ప్రెస్, తమిళనాడు, కేరళ ఎక్స్‌ప్రెస్‌లకు మంచిర్యాలలో హాల్టింగ్ కల్పించాలి. కొత్త రైళ్ల అవసరం * ఆదిలాబాద్-హైదరాబాద్‌కు ఇంటర్సిటీ ట్రైన్ నడపాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. * ఆదిలాబాద్-నాగ్‌పూర్‌కు ఇంటర్సిటీ ట్రైన్ కల్పించాలి. * గత బడ్జెట్లో మంజూరైన హౌర-పూరి ఎక్స్‌ప్రెస్‌ను వారానికి రెండు రోజులు నడపాలని నిర్ణయించారు. ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీన్ని అకోల-అమరావతి మీదుగా నడపాలని యోచిస్తున్నారు. ఆదిలాబాద్ మీదుగా నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. * హౌరా-నాగ్‌పూర్-వర్దా జంక్షన్, ఆదిలాబాద్-ముత్కేడ్ జంక్షన్, నిజామాబాద్-హైదరాబాద్-విజయవాడ-పూరి మార్గంలో పయనిస్తే ఆదిలాబాద్‌కు అనేక జంక్షన్లతో కనెక్టివిటీ పెరగడం ద్వారా వ్యాపార, వాణిజ్య పరంగానే కాకుండా పర్యాటక, దేవాలయాలకు రైలు మార్గాలు కలుగుతాయి. * వారణాసి-మైసూర్ మార్గంలో బై వీక్లీ రైలును ఆదిలాబాద్ నుంచి నడపాలి. * బెంగళూరు-జోధాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను వయా ఆదిలాబాద్ మీదుగా నడపడం ద్వారా రాజస్థాన్‌కు రైలు మార్గం కలుగుతుంది. ఇది వ్యాపార, వాణిజ్య పరంగా ఉపయోగకరం. * బెల్లంపల్లి-కొత్తగూడెం మధ్యలో కొత్త ట్రైన్‌ను ప్రవేశపెట్టాలి. * కొత్త ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య నడపాలి. * కరీంనగర్-సిర్పూర్(టి) పుష్పుల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైల్వే డబ్లింగ్ * ఆదిలాబాద్-ముత్కేడ్-సికింద్రాబాద్ మధ్యలో రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. గతంలో ప్రతిపాదనలు పెట్టినా నిధులు మంజూరు కాలేదు. 452 కిలోమీటర్ల పరిధిలో డబుల్ లైన్ చేపట్టాల్సి ఉంది. ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే ట్రాక్‌ను ఆనుకొని 50 శాతం మంది ప్రజలు ఉన్నారు. * ప్రతిరోజూ రైళ్లు వచ్చీ పోయే సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద సుమారు 50 సార్లు గేటు వేస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 2005-06 బడ్జెట్లో రూ.238 కోట్లు ప్రతిపాదించినా మంజూరు చేయకపోవడంతో మోక్షం కలుగలేదు. ఇప్పుడు దాని బడ్జెట్ నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. మంచిర్యాల ఏసీసీ వద్ద, కాగజ్‌నగర్‌లో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సదుపాయాలు ఏవీ..? * మంచిర్యాల మీదుగా వెళ్లే భాగ్యనగర్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లను 24 కోచ్‌లకు పెంచాలని డిమాండ్ ఉంది. * ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ మోడల్ రైల్వే స్టేషన్ అయినప్పటికీ సరైన సదుపాయాలు లేవు. ఈ విషయంలో చర్యలు అత్యవసరం. * తాండూరు మండలం రేచిని స్టేషన్లో గేట్ నెంబర్ 66 వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ రైల్వేలోకి మార్చితే.. దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) పరిధిలోకి వచ్చే నాందేడ్ రైల్వే డి విజన్లోనే ఆదిలాబాద్ స్టేషన్ ఉంది. దీంతో పాటు ఉండం, తల మడుగు, కోసాయి స్టేషన్లు కూడా మన జిల్లాలోనివే. ఈ నాలుగు స్టేషన్లు మినహాయిస్తే నాందేడ్ డివిజన్లోని 262స్టేషన్లు మహా రాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతంలో ఉన్నాయి. ఈ డివిజన్‌పై అటు రైల్వే లైన్ల పరంగా కొత్త రైళ్ల విషయంలోనూ చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాందేడ్ డివిజన్‌ను మధ్య రైల్వే(సీఆర్)లోకి మార్చాలనే డిమాండ్ ఉంది. సెంట్రల్ రైల్వేలో విస్తృ త రైల్వే కనెక్టివిటీతో పాటు అన్ని ప్రాంతాలకు రైళ్లు అందుబాటులో ఉ న్న దృష్ట్యా ఇందులో కలిపితే నాందేడ్ డివిజన్ అభివృద్ధి చెందుతుందని రైల్వే బోర్డు నాయకులతో పాటు పలువురు అభిప్రాయ పడుతున్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లు * ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని గడ్చందూర్ రైల్వే లైన్ సర్వే కోసం 2011-12 బడ్జెట్లో రూ.17.70 లక్షలు కేటాయించారు. 62 కిలోమీటర్ల పరిధిలో ఈ లైను కోసం సర్వే చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆది లాబాద్ జిల్లాలో 32 కిలోమీటర్లు మన పరిధిలోకి రాగా, మిగితా కిలోమీటర్లు మహారాష్ట్ర పరిధిలోకి వస్తున్నాయి. సర్వే పూర్తయినా మలి బడ్జెట్లో రైల్వే లైన్ నిర్మాణ పనులకు మోక్షం కలగడం లేదు. * పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, పబ్లిక్ 30 శాతం నిధులు వెచ్చించి ఈ నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కొర్రి పెట్టింది. ఇటు సమైక్య రా ష్ట్రంలోనూ దీనిపై పట్టించుకోలేదు. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గతేడాది న్యూఢిల్లీలో జరిగిన రైల్వే నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌లో నిధులు వెచ్చించేందుకు సిద్ధపడిం ది. అక్కడ నిర్మాణ పనులకు టెండర్లు కూడా జరిగాయి. * ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పీపీ పీ పద్ధతిన కాకుండా కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి ఈ నిర్మాణం చేపట్టాలని అధికార, ప్రతిపక్ష నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గడ్‌చాందూర్‌కు రైల్వేలైన్ పూర్తయిన పక్షంలో ఆదిలాబాద్ రైల్వే ప్రయాణికులకు విస్తృత రైల్వే కనెక్టివిటీ ఏర్పడుతుంది. గడ్‌చాందూర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బల్లార్ష జంక్షన్ ఉండడంతో ఉత్తర, దక్షిణ భారతదేశాలకు అనేక రైలు సదుపాయాలు ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. * ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి 1572 కిలోమీటర్ల పరిధిలో కాచిగూడ మీదుగా వెళ్తోంది. గడ్చాందూర్ లైన్ పూర్తయితే ఆదిలాబాద్ మీదుగా న్యూఢిల్లీ వెళ్లేందుకు 242 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ ట్రాక్ నిర్మాణం ఇటు ఆదిలాబాద్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుండగా రైల్వేకు లాభం కూడా మిగుల్చుతుంది. * ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు రైల్వే లైన్ సర్వే కోసం 2010-11లో రూ.47.55 లక్షలు మంజూరయ్యాయి. 2013లో సర్వే పూర్తయ్యింది. ఆదిలాబాద్, తలమడుగు, నిర్మల్, ఆర్మూ ర్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ మీదుగా పటాన్‌చెరుకు 371 కిలోమీటర్లలో ఈ లైన్‌ను గుర్తించారు. అయితే సాంకేతిక సమస్యలు, మరేమోగానీ దీనివైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతి బడ్జెట్లో దీని ఊసే ఉండడం లేదు. * ఆదిలాబాద్-ఉట్నూర్-మంచిర్యాల రైల్వే లైన్ కోసం 2013-14 బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఈ బడ్జెట్లోనైనా నిధులు మంజూరు చేసి సర్వే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు రైల్వేలైన్ ఏర్పడితే ఉట్నూర్ ప్రాంత గిరిజనులకు కూడా రవాణా సదుపాయాలు పెరుగుతాయి. * ఆదిలాబాద్-నిర్మల్-ఆర్మూర్ రైల్వేలైన్దీ ఇదే పరిస్థితి. దీని సర్వే పూర్తి చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇది జరిగితే హైదరాబాద్‌కు మహారాష్ట్ర మీదుగా తిరిగి వెళ్లాల్సిన దుస్థితి తప్పుతుంది. * వశిం, మహోర్,ఆదిలాబాద్,ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి. * మంచిర్యాల-చెన్నూరు మధ్యలో కొత్త రైల్వే లైన్ నిర్మించాలని డిమాండ్ ఉంది. -
ముందుగా కదిలితేనే
ఏళ్లు గడుస్తున్నా.. ఇందూరుకు మాత్రం కొత్తరైళ్లు రావడం లేదు. ఎన్నో బడ్జెట్లు దాటిపోయినై.. కానీ మన జిల్లాలో రైలు కూత పెట్టడం లేదు. పెద్దపల్లి-నిజామాబా ద్ రైల్వేలైన్ కథ.. ఒక్కటి చాలు మన జిల్లాకు రైల్వేశాఖ చేస్తున్న న్యాయం గురించి చెప్పొచ్చు. కొత్త రాష్ట్రంలోనైనా కొత్త రైళ్లు రావాలని జిల్లాజనం కోరుతున్నారు. రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు ప్రాధాన్యం - లేదంటే.. మళ్లీ నిధుల్లో కోతే -మొక్కుబడిగా స్పందిస్తే లాభం లేదు - ఈసారైనా రైల్వేలైన్లు పూర్తవ్వాలె.. - కొత్త రాష్ట్రంలో ‘కూత’ పెట్టాలె.. - ఎంపీలు కవిత, బీబీపాటిల్‌పై జిల్లావాసుల ఆశలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్త రాష్ట్రంలోనైనా రైలుకూత వినిపించాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు. ఎన్నోఏళ్లుగా కలగానే మిగిలిన రైల్వేలైన్లు పూర్తికావాలని ఆశిస్తున్నారు. కేంద్రంలో కూడా నరేంద్రమోడీ సారథ్యంలో కొత్తసర్కారు కొలువుతీరింది. కనుక ఈసారి రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు వరాలు కురవాలంటే మన ఎంపీలు ఇప్పటి నుంచే ఆ దిశగా దృష్టిసారించాలి. గతంలో సకాలంలో స్పందించక పోవడం.. మొక్కుబడిగా ప్రతిపాదనలు పంపడంతో జిల్లా చాలా నష్టపోయింది. రైల్వేబడ్జెట్లలో అంతంత మాత్రమే నిధులు మంజూరయ్యాయి. వచ్చేనెల 7నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత ప్రభుత్వం ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ జూలై 31 పూర్తికానుంది. ఈ నేపథ్యంలో జూలై 8న మోడీ సర్కారు రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వచ్చేనెల 9న ఆర్థిక సర్వే, 10న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు ఈ బడ్జెట్ చాలా కీలకం కానుంది. ప్రధానంగా రైల్వేబడ్జెట్‌పై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు ఆ శాఖ మంత్రి సందానందగౌడ ప్రకటించారు. గతంలో అనేకమార్లు రైల్వేబడ్జెట్‌లు ప్రవేశపెట్టినా జిల్లాకు నిధుల కేటాయింపు తక్కువే. ఇంకా పూర్తికావల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. కేంద్రంపై ఒత్తిడి తేవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా కేంద్రం రైల్వేబడ్జెట్ ప్రవేశపెడుతున్నందున్న మన ఎంపీలు జిల్లా అవసరాలపై దృష్టి సారించాల్సి ఉంది. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, భీంరావ్ బస్వంత్‌రావు పాటిల్‌లతో పాటు ఢిల్లీలోని మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి కేంద్రంపై ఇప్పటి నుంచే ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైల్వేబడ్జెట్ విషయంలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా మన వాటాకు కోతలు పడే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు ఇలాంటి అనుభవమే జిల్లాకు ఎదురైంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిధుల కోతకు ఈసారైనా తెరపడి.. నిధుల మోత మోగాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేలా ఎంపీల ప్రతిపాదనలు ఉండాలని సూచిస్తున్నారు. ప్రతిసారీ ప్రతిపాదనలు బుట్టదాఖలే..! రైల్వే బడ్జెట్ ప్రవేశపట్టిన ప్రతీసారి ఆశతో ఎదురుచూసే జిల్లావాసులకు నిరాశే మిగులుతోంది. ఇంతకు ముందున్న జిల్లా ఎంపీలు మధుయాష్కీ, సురేశ్ శెట్కార్ పలు ప్రతిపాదనలను చేసినా అవి బుట్టదాఖలయ్యాయి. 2013-14 బడ్జెట్లో వీరు చేసిన ప్రతిపాదనల్లో ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయటానికి గ్రీన్‌సిగ్నల్ లభించినప్పటికీ ఆ బడ్జెట్లో తగినన్ని నిధులను మాత్రం కేటాయించలేదు. ఆ రైల్వేలైన్ ప్రతిపాదనల వరకే పరిమితమైంది. బోధన్-బీదర్ లైన్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్లైన్లను పూర్తిగా మరిచిపోయి.. జిల్లావాసులను నిరాశకు గురి చేశారు. సరుకు రవాణా భారం తగ్గించకపోగా మరింత పెంచి, ఆదర్శ స్టేషన్ల అభివద్ధికి పైసా కూడా విదిల్చలేదు. నిజామాబాద్, కామారెడ్డి రైల్వేస్టేషన్లను ఆదర్శ రైల్వేస్టేషన్లుగా ప్రకటించి ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆధునికీకరించిన దాఖలాలు లేవు. కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రతిపాదనలకు ప్రతీసారి మొండిచెయ్యే చూపుతున్నారు. పాతలైన్ల పూర్తి.. కొత్త రైళ్లపై దృష్టి 2013-14 రైల్వే బడ్జెట్ జిల్లాకు కొంత మోదం.. మరికొంత ఖేదం మిగల్చగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లా ఊసే లేదు. పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వేలైను మోర్తాడ్ వరకే వచ్చింది. ఈ పనులు 2014 మార్చి వరకు పూర్తి చేస్తామని ప్రకటించినా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనకు మోక్షం కలగడం లేదు. 2013-14 బడ్జెట్లో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసర, ముథ్కేడ్, ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ మంజూరు చేసినా అరకొర నిధులతోనే సరిపుచ్చారు. నిజామాబాద్-ముంబయి వరకు వేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికీ ఆశాజనకంగా లేవు. జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అభివద్ధికి ప్రధానమైన ఈ కొత్త రైల్వేలైన్ల పనులకు ఈసారైనా తుదిరూపు తీసుకు రావాల్సిన అవసరం ఉంది. బోధన్-మిర్జాపల్లి ప్యాసింజర్ మూడు బోగీలతోనే ముక్కి.. ముక్కి.. నడుస్తోంది. దీని బోగీల సంఖ్య పెంచాలని చాలాకాలంగా జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, రైల్వేఓవర్ బ్రిడ్జీలు, ఫుట్ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం, రైల్వే అభివృద్ధి కోసం తక్షణమే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా ఎంపీలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొత్తగా ఎంపికైన పార్లమెంట్ సభ్యులు కవిత, బీబీపాటిల్‌లు తాజా ప్రతిపాదనలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వచ్చేనెలలోనే రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలంటున్నారు. -
సంబరాల నడుమ కొత్త రైళ్ల పరుగులు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఆధునాతన బోగీలతో కొత్త రైళ్లు పట్టాలెక్కాయి. మంగళవారం ఉదయం సరిగ్గా 7.45 గంటలకు ఒకటి, 8 గంటలకు మరో రైలు పరుగులు తీశాయి. విశాఖ-జోధ్‌పూర్, విశాఖ-గాంధీధాం ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. పాత-కొత్త బోగీలను కలపాలని ముందు భావించినా జోన్ సాధన సమితి సభ్యులు ఆందోళన చేస్తారేమోనని తక్కువ బోగీలతోనైనా ప్రారంభించారు. కేవలం13 బోగీలతోనే సర్దుబాటు చేశారు. కొత్త రైళ్ల ప్రారంభం పై గుజరాత్ సమాజ్ సభ్యులు హర్షం ప్రకటించి ప్రయాణికులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కాగా కొత్త రైళ్లలో ప్రయాణికులు స్వల్పంగానే ఉన్నారు. విశాఖ-జోధ్‌పూర్‌లో 365 మంది.. విశాఖ-గాంధీధాంలో 146 మంది మాత్రమే పయనమయ్యారు. వీరంతా అప్పటికప్పుడే బయల్దేరిన వారు కావడంతో రైల్లోనే రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. కొత్త రైళ్ల ప్రారంభం సందర్భంగా కొందరు జైనులు, మార్వాడీలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కొత్త రైలు లేక గుజరాత్ వెళ్లేందుకు నానా పాట్లు పడేవారు. చెన్నై వెళ్లి అక్కడి నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కోసం ప్రదక్షిణలు చేసేవారు. రెండు మూడు రోజుల పాటు నిరీక్షించినా ఆ రైల్లో చోటు లభ్యమయ్యేది కాదు. ఇప్పుడా బాధ తప్పిందని సురేష్ జైన్ అనే వ్యక్తి ఆనందం వ్యక్తం చేశారు. సమోసాలు తింటూ కులాసాగా ప్రయాణం... విశాఖపట్నం-జోధ్‌పూర్ రైలు సమోసాలకు ప్రసిద్ధి గాంచిన ఊరు మీదుగా ప్రయాణిస్తుంది. భిలాస్‌పూర్‌కు అతి సమీపంలో వున్న పెండ్రారోడ్ స్టేషన్ అంటేనే నోరూరించే సమోసాలకు పుట్టినిల్లుగా చెప్పుకుంటారు. అందుకే ఈ రైల్లో కొందరు జోధ్‌పూర్ వాసులు సమోసాలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. -
జీవితకాలం లేటు!
జిల్లాలో రైల్వేల ప్రగతికి గ్రహణం పట్టింది. కొత్త రైలు మార్గాల ప్రతిపాదనలను దశాబ్దాలుగా రైల్వేమంత్రిత్వ శాఖ కాగితాలకే పరిమితం చేస్తోంది. ప్రతీసారి రైల్వేబడ్జెట్‌కు ముందు జిల్లా అవసరాలకు సంబంధించి చేస్తున్న విన్నపాలు అరణ్యరోదనగానే మిగులుతున్నాయి. జిల్లాలో ఉన్న ప్రధాన రైల్వేస్టేషన్లలో సౌకర్యాలపైనా అధికారులు శ్రద్ధ చూపడం లేదు. భారీ ఆదాయాలను సమకూరుస్తున్న స్టేషన్లలోనూ ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోంది. నాలుగు కొత్త రైలుమార్గాల కోసం జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు దశాబ్దాలుగా ప్రతిపాదిస్తున్నా మోక్షం లభించడం లేదు. మంత్రులు, ఎంపీలు మారుతున్నా జిల్లా దశ మాత్రం మారడం లేదు. పనులు ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా పెద్దపల్లి నుంచి రైలు మార్గం నిజామాబాద్‌కు చేరుకోలేకపోయింది. జిల్లా పట్ల రైల్వేశాఖ ప్రదర్శిస్తున్న వివక్షకు ఇది నిదర్శనం. సాక్షి, కరీంనగర్ : జిల్లా నుంచి నాలు గు కొత్త రైలుమార్గాలు వే యాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్, కరీంనగర్ నుంచి హైదరాబాద్, కరీంనగర్ నుంచి హసన్‌పర్తి, రామగుండం నుంచి మణుగూరు లైన్ల కోసం ప్రతీ బడ్జెట్‌కు ముందు ప్రజాప్రతినిధులు విన్నవిస్తున్నారు. కొత్తపల్లి- మనోహరాబాద్ లైను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించినప్పటి నుంచి ప్రతిపాదిస్తున్నా ఫలితం లేదు. కరీంనగర్ నుంచి హైదరాబాద్, హసన్‌పర్తి లైన్ల కోసం ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనలు ఇచ్చారు. రామగుండం, మణుగూరు లైను కోసం వివేక్ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ రైలు మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, వివేక్ ప్రయత్నాలు చేస్తున్నా వేగం అందుకోలేదు. కొత్తగా ప్రతిపాదించిన నాలుగు రైలు మార్గాలు కూడా రైల్వేశాఖకు గణనీయమైన ఆదాయం సమకూర్చి పెట్టేవే. అయినా ఈ మార్గాల వైపు రైల్వేశాఖ దృష్టి సారించడం లేదు. మణుగూరు రైలుమార్గానికి 1982లోనే రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పటి నుంచి ఈ లైను గురించి పట్టించుకున్నవారే లేరు. ఎంపీ వివేక్ 2010లో ఈ ప్రతిపాదనను రైల్వేమంత్రి దృష్టికి తేగా సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. జిల్లా కేంద్రానికి ఉన్న ఏకైక రైలు మార్గం పనులు రెండు దశాబ్దాలుగా పూర్తి కావడం లేదు. 1992లో ప్రధాని పీవీ నర్సింహారావు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి - నిజామాబాద్ రైలు మార్గం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెద్దపల్లి నుంచి కరీంనగర్-జగిత్యాల వరకు పనులు పూర్తయినా అక్కడ నుంచి ముందుకు సాగడం లేదు. 1992లో రూ.400 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు ప్రారంభించారు. ఏటా అరకొర నిధులు కేటాయించడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. మొత్తం 178 కిలోమీటర్ల ఈ మార్గం జిల్లాలో 122 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 56 కిలోమీటర్ల పొడవుంది. ఏళ్లకేళ్లుగా జాప్యం జరగడంతో అంచనా వ్యయం రెట్టింపయింది. ఇప్పటికే రూ.560 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.385 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు లైను పూర్తయింది. ప్రయోగాత్మకంగా 2012 మార్చిలోనే రైలు నడిపారు. భూసేకరణలో ఇబ్బందులతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇంకా 20 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ లైను పూర్తి చేస్తామని ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనే చెప్పినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. రైల్వేబడ్జెట్‌కు సంబంధించి రైల్వేబోర్డు కసరత్తును నాలుగునెలల ముందే ప్రారంభిస్తుంది. నిజామాబాద్ రైలు మార్గం పూర్తితోపాటు ప్రతిపాదనల్లో ఉన్న రైలు మార్గాలపైనా ప్రజాప్రతినిధులు ఇప్పుడే నిర్దిష్ట ప్రతిపాదనలతో రైల్వే మంత్రిత్వశాఖ మీద ఒత్తిడి తేవాల్సిన అవసరముంది. గట్టిగా ప్రయత్నిస్తే తప్ప ఈసారి కూడా జిల్లాకు మొండిచేయే మిగులుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.