
న్యూఢిల్లీ: త్వరలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఆగస్ట్ 15వ తేదీ నాటికి వీటి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఇవి మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు.
ఇవి త్వరలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుని పట్టాలెక్కే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు అంటున్నాయి. వీటితోపాటుగా, తక్కువ దూరంలో ఉండే నగరాల మధ్య ప్రయాణాల కోసం వందే మెట్రో లేదా వందే భారత్ మెట్రోగా పిలిచే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే మొదలవనుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment