trail run
-
త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్స్
న్యూఢిల్లీ: త్వరలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఆగస్ట్ 15వ తేదీ నాటికి వీటి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఇవి మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ఇవి త్వరలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుని పట్టాలెక్కే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు అంటున్నాయి. వీటితోపాటుగా, తక్కువ దూరంలో ఉండే నగరాల మధ్య ప్రయాణాల కోసం వందే మెట్రో లేదా వందే భారత్ మెట్రోగా పిలిచే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే మొదలవనుందని చెబుతున్నారు. -
ట్రాక్ పునరుద్ధరణ తర్వాత వందే భారత్ రైలు ట్రయిల్ రన్
-
జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ఎయిర్ ల్యాండింగ్ ట్రయల్ రన్ సక్సెస్
-
ట్రాఫిక్ ట్రయల్ రన్ తో వాహనదారులకు కొత్త చిక్కులు
-
జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ట్రయల్ రన్.. అయోమయంలో వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసుల ప్రయోగాత్మక ఆంక్షల నడుమ వాహనాలు ఆగుతూ... సా..గుతూ కనిపించాయి. సీవీఆర్ జంక్షన్, రోడ్ నెం. 45 జంక్షన్లో రైట్ టర్న్‌ను తొలగించడంతో తొలి రోజు ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో చుట్టూ తిరుగుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 బాలకృష్ణ నివాసం చౌరస్తాతో పాటు జర్నలిస్టు కాలనీ, సీవీఆర్, బీవీబీపీ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని మార్గాల్లో ట్రయల్ రన్ కింద మళ్లింపులు చేపట్టి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇద్దరు ట్రాఫిక్ ఏసీపీలు, ఇద్దరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎనిమిది మంది ఎస్ఐలు కలిసి మొత్తం 32 మంది ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ మళ్లింపును పర్యవేక్షించారు. ► మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు ప్రారంభించారు. చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక గజిబజిగా ముందుకు సాగుతుండగా ట్రాఫిక్ పోలీసులు వారికి దారి చూపారు. ► అయితే పలుచోట్ల ట్రాఫిక్ చాంతాండాంత దూరానికి నిలిచిపోవడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు. మొదటి రోజు వాహనాలు వివిధ మార్గాల నుంచి మళ్లించడంతో చుట్టూ తిరుగుతూ వాహనదారులు గమ్యస్థానాలకు వెళ్లారు. ► నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ రంగనాథ్, ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి పలుచోట్ల యూటర్న్లు, రైట్ టర్న్‌లను పరిశీలించారు. రాంగ్ రూట్లో ఆర్టీసీ బస్సు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 ప్రధాన రోడ్డులో పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ వెళ్లే టర్నింగ్ వద్ద పిల్లర్ నెంబర్ సి–1659 నుంచి హెచ్‌సీయూ డిపోకు చెందిన సిటీ బస్సు శుక్రవారం ఉదయం రాంగ్రూట్లో వస్తూ కనిపించింది. సాధారణంగా ఆటో వాలాలు, ద్విచక్ర వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లడం కనిపిస్తుంది. ఏకంగా సిటీ బస్సు రాంగ్రూట్లో వస్తుండటంతో స్థానికులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఓ స్కూటరిస్ట్ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సర్వీసు రోడ్డులో నిండుగా... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45ల కేబుల్ బ్రిడ్జి నిర్మించి దానికి అనుసంధానంగా ఫ్లై ఓవర్ నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు సర్వీసు రోడ్డులో వాహనాలు ఏ రోజు కూడా నిండుగా కనిపించలేదు. కానీ తొలిసారి శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయా జంక్షన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించి మళ్లింపులు చేపట్టడంతో సర్వీసు రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోయాయి. మరో వైపు రోడ్ నెం.45లోని ఫ్లై ఓవర్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వాహనాలు తక్కువగా వెళ్లడం గమనార్హం. (క్లిక్ చేయండి: 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు) జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి బాలయ్య ఇంటి దగ్గర రైట్ టర్న్ తీసేసిన ట్రాఫిక్ పోలీసులు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద కూడా యూ టర్న్ లేదు. సిగ్నల్ ఫ్రీ అంటే మమ్మల్ని సిటీ అంతా తిప్పడం కాదు సర్ అట్టర్ ఫ్లాప్ ప్రయోగం. Please Look into this. @HYDTP. @HiHyderabad #Hyderabad @KTRTRS — Vidya Sagar Gunti (@GVidya_Sagar) November 25, 2022 నగర వాసులు ఏమంటున్నారు.. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ట్రయన్ రన్‌పై నగర వాసులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించమంటే తమను ఊరంతా తిప్పుతున్నారని అంటున్నారు. So! The city traffic police woke up one day and said - everything is fine, let’s mess up? Was that the thought behind all these diversions/ no U-turns in Jubilee Hills? Such chaos! #Hyderabad #HyderabadTraffic #WhatOnly🤯 pic.twitter.com/WpDIaB0u7Y — Revathi (@revathitweets) November 26, 2022 -
కొండలను దాటి.. గుట్టలు ఎక్కి.. పరుగో పరుగు.. 5.41 గంటల్లోనే 50 కి.మీ. పూర్తి!
విశాఖ స్పోర్ట్స్: ఎటూ చూసినా ఎత్తైన పచ్చని కొండలు.. ఆ కొండల మధ్య పాల సముద్రాన్ని తలపించే దట్టమైన పొగమంచు అందాలు.. జాలువారే జలపాతాలు.. అలాంటి ప్రకృతి సోయగాల నడుమ పరుగు పోటీ అంటేనే ఆ మజా వేరు. కొండలు.. గుట్టలు దాటుకుంటూ.. నడవటానికి సరిగా లేని కొండవాలుపై పడుతూ..లేస్తూ.. నిర్ణీత సమయంలో లక్ష్యం చేరేందుకు ప్రకృతితో కలిసి పరుగు పెట్టారు సాహసికులు. ఇందుకు వేదికైంది వంజంగి హిల్స్. విశాఖ ఏజెన్సీల్లోని పర్వత పంక్తుల్లో వంజంగి హిల్స్ ప్రత్యేకతే వేరు. లంబసింగి పర్వతపంక్తిలో బాగా చలి వాతావరణం ఉంటే.. వంజంగి మాత్రం కాస్త వేడి వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. అలాంటి చోట సుమారు 115 మంది సాహసికులు ఇటీవల నిర్వహించిన 50 కిలోమీటర్ల ట్రయల్ రన్లో పాల్గొని.. ప్రకృతిని ఆస్వాదించారు. ఇందులో మహిళలు ఉండటం విశేషం. విభిన్నంగా సాగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి అనుభూతి.. అనుభవాలు.. వారి మాటల్లోనే.. Visakhapatnam: వంజంగి హిల్స్‌లోని రన్నర్స్ విలేజ్‌లో ప్రారంభమైన ట్రయల్‌రన్ తిరిగి అక్కడికే చేరుకోవడంతో ముగిసింది. ట్రయిల్‌రన్‌ను 11 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. ప్రతి లెగ్ నిర్ణీత సమయంలో చేరుకోవాలి. 50 కిలోమీటర్ల ట్రయల్ రన్లో 50 మంది, 25 కిలోమీటర్ల పరుగులో దాదాపు 65 మంది పోటీపడ్డారు. బొడ్డపుట్టు, పోతురాజుమెట్ట, సోలములు, కళ్లాలబయలు, గొందూరు, గుర్రంపణుకుల్లోని కొన్ని గ్రామాలను కలుపుతూ 50 కిలోమీటర్ల ట్రయల్‌రన్ నిర్వహించారు. క్యాంపింగ్ స్పాట్లలో సేద తీరుతూ.. ఉత్సాహవంతులు కొండ గుట్టలు ఎక్కి దిగుతూ పరుగుపెట్టారు. సాధారణ మారథాన్‌లో లాగా ఇక్కడ చక్కటి ట్రాక్ ఏర్పాట్లు ఉండవు. ఒక చోట కొండవాలులోనే పరుగెత్తితే.. మరో చోట పడిపోయే స్లోప్స్‌లో బాలెన్స్ చేస్తూ ముందుకు సాగారు. ప్రకృతితో మమేకం ట్రయల్ రన్ అంతా సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలోనే సాగింది. చివరి 10 కిలోమీటర్లు అక్కడ నివసించే గిరిజన తెగలతో ముచ్చట్లు, వారి ఆచార అలవాట్లను పరిచయం చేసుకుంటూ సాహసికులు మందుకు సాగారు. కొందరు సాహసికులు ఉత్తర భారత దేశం నుంచి వచ్చిన వారు కావడంతో వారికి భాషతో ఇబ్బంది అయినా.. గిరిజనులతో హావభావాలు ప్రదర్శిస్తూ, పలకరిస్తూ సాగిపోవడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. సముద్రమట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తు వరకు ఉండే ఇక్కడ పరుగుతో నడక కూడా ఒక భాగమే. ఎందుకంటే అక్కడ కేవలం నడిచేందుకే మార్గం ఉంటుంది. ఇక్కడ కొందరు గాయాల పాలైనా.. గమ్యాన్ని చేరుకునే క్రమంలో వెనుకడుగు వేయలేదు. సమయానికి రాకుంటే... తొలి చెకింగ్ పాయింట్ 17.5 కిలోమీటర్ల వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని మూడున్నర గంటలలోపే చేరుకోవాలి. అలా చేరుకోని వారిని అక్కడే ఆపేశారు. అక్కడి నుంచి మరో ఆరు కిలోమీటర్ల మేర జంగీ పాయింట్. బంగారుపేట వద్ద మరో పాయింట్. ఇది పది కిలోమీటర్ల సాగుతుంది. ఇదంతా అటవీప్రాంతం. ఈ మారథాన్‌లో కొందరు ట్రయల్ డిబెట్‌గా 10 కిలోమీటర్ల మేరకే పోటీ పడగా మరికొందరు హిల్ చాలెంజ్ 25 కిలోమీటర్ల మేర పోటీపడ్డారు. ఇక సాహసికులు ఫ్లాగ్షిప్ కేటగిరీలో 50 కిలోమీటర్లు పూర్తి చేసి విశాఖ ట్రయల్ రన్ సంఘం నుంచి బహుమతులు అందుకున్నారు. రూటే విభిన్నం తొలిసారి ఈ ట్రయల్ రన్లో పాల్గొన్నాను. జమ్ము కశ్మీర్ నా స్వస్థలం. హాఫ్ మారథాన్‌లో శిక్షణనిస్తుంటా. కానీ నాకు ఈ పరుగు చాలా కొత్త. అసలు ఈ ట్రయల్‌రన్ రూటే చాలా విభిన్నంగా ఉంది. ఇది అంతా ఈజీ కాదు. దారివెంట గిరిజనుల జీవన విధానం ఎంతో ఆకట్టుకుంది. ఒకసారికే మేమింత కష్టపడితే.. వీరంతా ప్రతిరోజూ కొండలెక్కి దిగుతూ ఎంత శ్రమపడతారో! ఇక్కడ సహజసిద్ధంగా పారే నీటిని చేతులతో తాకకుండా తాగాం. ఇక్కడి ప్రజలు పూర్తిగా ప్రకృతితో మమేకమై ఉన్నారు. –కీర్తి, మహిళా విభాగం విజేత ఎంతో శ్రమించాం అల్ ట్రైబ్ పాడేరు పేరిట ఈ ట్రయల్ రన్ నిర్వహించాం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల సాహసికులు పోటీపడ్డారు. రూట్ మ్యాప్ తయారు, అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడానికి నెలల వ్యవధి పట్టింది. ఇంతలో ఎన్నికలు వచ్చి కొంత ఆలస్యమైంది. పలు మార్లు రూట్లో ట్రయల్స్ నిర్వహించుకున్నాం. వీటీఆర్ఏ పేరిట చివరికి మూడు కేటగిరీల్లో పోటీ నిర్వహించి విజయవంతం చేసుకోగలిగాం. ఐటీఆర్ఏ పోటీలకు సమాయత్తమవుతున్నాం. – యోగేష్, ట్రయల్ రన్ నిర్వాహకుడు గాయాలు తగిలినా.. గమ్యాన్ని చేరాను హైదరాబాద్ నుంచి ఆరుగురం ఈ ట్రయల్ రన్లో పాల్గొన్నాం. నలుగురు 25 కిలోమీటర్లు, ఒక్కరు 10 కిలోమీటర్లు, నేను 50 కిలోమీటర్ల పోటీలో పాల్గొన్నాను. నాకు గతంలో మారథాన్‌లో పాల్గొనే అనుభవం ఉంది. అదంతా రోడ్డు. ఇక్కడ అందుకు భిన్నంగా ఉంది. అయినప్పటికీ రెండో స్థానంలో నిలిచాను. అటవీ ప్రాంతంలో మూడుసార్లు పడిపోయాను. ఒకసారి మోకాలికి గాయం అయింది. అయినా పట్టుదలతో గమ్యానికి చేరుకోగలిగాను. తొలి లెగ్ 17.5 కిలోమీటర్లను నిర్ణీత సమయానికి అర నిముషం ముందే పూర్తి చేశాను. ఇక్కడ వెనకబడితే వెనక్కి వచ్చేయడమే. ఇక రెండో లెగ్‌లో నాలుగు నిమిషాల ముందే లక్ష్యానికి చేరుకున్నా. మూడో లెగ్‌లో రోడ్ వస్తుంది. అక్కడకు అరగంట ముందే చేరాను. 46 కిలోమీటర్ల నుంచి ముగింపు లెగ్. ఇది బాగా ఎత్తు పల్లాలతో ఉంటుంది. ఇక్కడే పడిపోయాను. – ఆదిత్య దేవి, ద్వితీయస్థానం, మహిళా విభాగం రెండు సెకన్ల వ్యవధిలో... తొలుత నేను కాంపిటీషన్ స్ప్రింట్స్‌లో పాల్గొనేవాడిని. ఆ తర్వాత లాంగ్ రన్స్‌లో వందకు పైగా కిలోమీటర్లలో తలపడ్డాను. అయితే అందుకు భిన్నమైనది ఈ ట్రయల్‌రన్. అసలు ఈ పరుగు గురించి అవగాహన లేకుండానే పోటీపడ్డాను. 25 కిలోమీటర్ల ఈవెంట్లో తలపడగా ద్వితీయస్థానంలో నిలిచాను. 10 కిలోమీటర్లలోపే సత్తువ అయిపోతుంది. హిల్ రౌండ్ చాలా చాలెంజింగ్. తొలి లెగ్‌లో క్వాలిఫై అయి చివరికి 3.22 నిమిషాల్లోనే పూర్తిచేయగలిగాను. రెండు సెకన్ల వ్యవధిలోనే తొలిస్థానం కోల్పోయాను. ఈ టాస్క్‌ను పడి లేస్తూనే నిర్ణీత సమయంలో పూర్తి చేయగలగడం ప్రత్యేక అనుభూతిని కలిగించింది. – హరీష్మంత్రి, లాంగ్ రన్నర్ ప్రణాళికతో విజేతనయ్యా.. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నా. దేశంలోని పలు చోట్ల నిర్వహించిన ట్రయల్స్ రన్స్‌లో పాల్గొన్నాను. ఇక్కడ జరిగిన ఈ ట్రయల్‌రన్ వాటికి భిన్నం. ఎందుకంటే ఇది రెండు ఈవెంట్ల మేళవింపు. టెక్నికల్ రౌండ్‌కు ప్రణాళిక ఉన్నా.. హిల్ రౌండ్లో చాలా అప్రమత్తతో ముందడుగు వేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ముందు రూట్‌ను స్టడీ చేశాను. కొన్ని చోట్ల చాలా వేగంగా, మరికొన్ని చాలా నిదానంగా ముందుకు కదులుతూ గమ్యాన్ని చేరాను. దానికి తగ్గట్టుగానే ప్రణాళికతో 5.41 గంటల్లోనే 50 కిలోమీటర్లు పూర్తి చేయగలిగాను. ద్వితీయ స్థానంలో నిలిచిన వారి కంటే 50 నిమిషాల ముందే చేరుకోగలిగాను. తొలి లెగ్‌లోనే 350 కేలరీలు అయిపోయాయి. దారి వెంట ప్రొటీన్ ఫుడ్ తింటూనే అలసట లేకుండా ముందుకుసాగాను. దారి మధ్యలో స్థానిక గిరిజనులు ఎంతో అభిమానం చూపారు. చప్పట్లు కొడుతూ చాలా ప్రోత్సహించారు. –సుమన్ మిశ్రా, 50 కి.మీ విజేత -
రేపు ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’ ప్రారంభం
వికారాబాద్: దేశంలోనే తొలిసారి డ్రోన్ల ద్వారా మందులు, టీకాలు సరఫరా చేసే కార్యక్రమానికి వికారాబాద్ వేదిక కానుంది. దేశంలోనే తొలిసారి చేపడుతున్న ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’కార్యక్రమాన్ని శనివారం కేంద్ర మంత్రి జోతిరాదిత్య, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ట్రయల్ రన్‌ను డ్రోన్ల తయారీ కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ నిఖిల పరిశీలించారు. నూతన కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రవాణా వ్యవస్థ సరిగ్గాలేని ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందన్నారు. భవిష్యత్తులో టీకాలు, యాంటీవీనమ్ వంటి మందులు సకాలంలో ఆస్పత్రులకు చేరవేసేలా డ్రోన్లు ఎంతగానో సహాయపడతాయని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా అవయవాలను కూడా చేరవేసే అవకాశం ఉందని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు తదితర విషయాలు పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రయల్ రన్లో టీకాలు ఆకాశ మార్గాన వెళ్లే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో అంతే ఉంటుందా? ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? అనే విషయాలను గమనిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతీలాల్, అదనపు ఎస్పీ రషీద్, ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ తుకారామ్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాక్సిన్ డెలివరీలో సంచలనం! దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..
Medicine From The Sky Project: కరోనా వ్యాక్సిన్ డెలివరీలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించేందుకు రెడీ అయ్యింది. మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగంగా చేసేందుకు వీలుగా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించనుంది. ఈ ప్రయోగం తెలంగాణలో సఫలమైతే దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా రోజుల లక్షల సంఖ్యలో వ్యాక్సినేషన్ జరుగుతున్నా అందులో సగానికి పైగా నగర, పట్టణ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ గ్రామాల ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సినేషన్ అందని ద్రాక్షగానే మిగిలింది. కేవలం వ్యాక్సిన్లను అత్యంత చల్లని ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసే అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో లేదు. దీంతో పట్టణ, నగర ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణలో చేపట్టనున్నారు. గంట వ్యవధిలో జిల్లా కేంద్రాల్లో ఉండే ఔషధ నిల్వల కేంద్రం నుంచి మారుమాల ప్రాంతంలో ఉండే గ్రామాలకు గంటల వ్యవధిలోనే వ్యాక్సిన్లను తరలించేలా మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భూమి నుంచి 500ల నుంచి 700 మీటర్ల ఎత్తులో ప్రయాణించే డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను చేరవేయనున్నారు. స్టాక్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్‌కి కేవలం గంట వ్యవధిలో చేరాలా చూస్తారు. దీని వల్ల తక్కువ సమయంలోనే డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు గమ్య స్థానాలకు చేరుకుంటాయి. ఉష్ణోగ్రత సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్లు పాడవకుండా ఉంటాయి. సెప్టెంబరు 9 నుంచి మెడిసిన్స్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ట్రయల్స్ రన్ని 2021 సెప్టెంబరు 9 నుంచి ప్రారంభించనున్నారు. తక్కువ ఎత్తులో కంటికి కనిపించేలా డ్రోన్ల సాయంతో వ్యాక్సిన్లను ఎంపిక చేసిన గమ్యస్థానానికి నిర్దేశిత సమయంలోగా చేరేలా చూస్తారు. ఆ తర్వాత మూడు సార్లు కంటికి కనిపించనంత ఎత్తులో అత్యంత వేగంగా వ్యాక్సిన్లను గమ్య స్థానాలకు చేరుస్తారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు మూడో వారం వరకు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయితే మెడిసన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టే అవకాశం ఉంది. తొలుత వికారాబాద్ మెడిసిన్స్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు చేపట్టేందుకు హైదారాబాద్‌కి సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లాను ఎంచుకున్నారు. ఈ జిల్లాలో ఉన్న 16 పీహెచ్‌సీలకు తొలిసారిగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు. మూడు దశల్లో జరిగే ట్రయల్ రన్లో లోటు పాట్లు గుర్తించి వాటిని సవరించుకుంటారు. కేంద్రం అనుమతి డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకుని అత్యవసర సమయాల్లో మెడిసన్లు, వ్యాక్సిన్లు, రక్తం తదితర అత్యవసర వైద్య సేవలు అందివ్వాలని తెలంగాణ ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది కేంద్ర ఏవియేషన్ నుంచి అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వంతో ఎనిమిది సంస్థలు సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయి. -
‘విక్రాంత్’ వచ్చేస్తోంది
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్ (ఐఏసీ) సేవలందించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం నిర్వహించిన సీట్రయల్స్ విజయవంతం కావడంతో.. విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ నిలిచింది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. అన్ని హంగులూ పూర్తి చేసుకొని 2022 మార్చినాటికల్లా తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్ సేవలందించనుంది. సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్.. యుద్ధ విమాన వాహక యుద్ధ నౌకల విషయంలో వెనకబడి ఉందన్న గీతని చెరిపేసేలా ఐఏసీ విక్రాంత్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌక ఇది. 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సన్నద్ధమైంది. విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌక డిజైన్ మొదలు పెట్టగా.. కొచ్చి షిప్‌యార్డులో 2009లోనే కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ఏడాది క్రితం బేసిన్ ట్రయల్స్ పూర్తి చేశారు. తొలిసారిగా సముద్ర విహారం ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటిసారిగా విక్రాంత్ సీట్రయల్ నిర్వహణ కోసం బుధవారం సముద్రంలోకి తీసుకొచ్చారు. 2 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. సముద్రంలో మొదటి ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, అంతర్గత కమ్యూనికేషన్ పరికరాలను ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు. చరిత్రాత్మక ఘటనగా భారత నావికాదళం అభివర్ణన న్యూఢిల్లీ: భారత్‌లో నిర్మించిన తొలి యుద్దవిమాన వాహక నౌక (ఇండిజినస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్–ఐఏసీ) విక్రాంత్.. సామర్థ్య పరీక్షలు మొదలయ్యాయి. సముద్రంలో ఐఏసీ విక్రాంత్ ట్రయల్స్ ప్రారంభమవడం చరిత్రాత్మకమని భారత నేవీ బుధవారం వ్యాఖ్యానించింది. సొంతంగా యుద్ధవిమాన వాహక నౌకను డిజైన్ చేసి, నౌకను నిర్మించి, సైన్యంలోకి తీసుకునే సత్తా ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచిందని నేవీ ప్రకటించింది. భారీ యుద్ధనౌకకు 50 ఏళ్ల క్రితం 1971లో పాకిస్తాన్‌తో పోరులో అద్భుత సేవలందించిన విక్రాంత్ నౌక పేరునే పెట్టారు. ఈ నౌక అన్ని స్థాయిల్లో సామర్థ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్నాక వచ్చే ఏడాదిలో భారత నావికాదళంలో చేరనుంది. భారత్‌లో నిర్మించిన అతి పెద్ద, అనేక ప్రత్యేకతలున్న యుద్ధనౌక ఇదేనని నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మథ్వాల్ చెప్పారు. యుద్ధవిమానాల మోహరింపులో ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే అవసరాలను తీరుస్తోంది. కీలక బాధ్యతలు నిర్వర్తించనున్న విక్రాంత్ రక్షణపరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఏసీ విక్రాంత్. విక్రాంత్ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలవనుంది. విక్రాంత్ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. – వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుద్దూర్ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి -
అంతర్వేది నూతన రథం ట్రయల్ రన్
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన రథం ట్రయల్ రన్‌ను అధికారులు ఆదివారం నిర్వహించారు. రథం బ్రేకులు, జాకీలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తక్కువ సమయంలో నూతన రథాన్ని తయారు చేయించామని తెలిపారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు’ దేవుళ్లు, ఆలయాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై విచారణను సీబిఐకి అప్పగించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే దేవాలయాల పై ప్రతిపక్షాలు దుష్ట రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్ -
నరసన్న రథం రెడీ
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ.. ప్రకటించిన గడువు కంటే ముందుగానే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయించింది. 2021లో జరగబోయే స్వామివారి కల్యాణోత్సవం నాటికి కొత్త రథాన్ని సిద్ధం చేస్తామని భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. అందుకు అనుగుణంగా రెండున్నర నెలల్లోనే రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. రథానికి రంగులు వేసే పని ఒక్కటే మిగిలి వుంది. నరసన్న కల్యాణోత్సవ సమయానికి రథం లేదనే మాట రానివ్వకూడదని ప్రభుత్వం దీని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండున్నర నెలల్లోపే.. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం జూన్ 8 అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దగ్ధమైన విషయం విదితమే. దీనిని ఆసరా చేసుకుని కొన్ని రాజకీయ శక్తులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడితో ఆగిపోకుండా భక్తుల మనోభావాలను పరిరక్షించే లక్ష్యంతో ఘటన చోటుచేసుకున్న రెండో రోజే ప్రత్యేకత కలిగిన కొత్త రథం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విలువైన కలప, ఇతర సామగ్రిని ఆగమేఘాలపై సేకరించి అక్టోబర్ 21న రథం నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపు రెండున్నర నెలల్లోపే పూర్తి చేయించారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న జరిగే రథోత్సవం నాటికి పూర్తి చేయాలని సంకల్పించగా.. అంతకంటే ముందుగానే పూర్తి చేయడం ద్వారా తమ మనోభావాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం రథానికి సోమవారం ట్రయల్ రన్ నిర్వహించగా విజయవంతమైంది. సంప్రదాయం ప్రకారం అంతర్వేది పల్లిపాలేనికి చెందిన మత్స్యకారులే రథాన్ని ప్రయోగాత్మకంగా లాగారు. రథానికి వారే పసుపు, కుంకుమ అద్ది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఏడంతస్తులు.. 43 అడుగుల ఎత్తు.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 43 అడుగుల ఎత్తున.. 7 అంతస్తులతో రథ నిర్మాణం పూర్తయ్యింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రథానికి బ్రేకులు, జాకీ కూడా ఏర్పాటు చేశారు. జాకీ ఏర్పాటు చేయడం వల్ల రథం సులభంగా మలుపు తిరిగేందుకు వీలవుతుంది. బ్రేకుల ఏర్పాటుతో ప్రమాద రహితంగా ఉంటుంది. మొత్తంగా రథం నిర్మాణం కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. పాత రథానికి బర్మా టేకు వాడగా.. నూతన రథ నిర్మాణంలో 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకును వినియోగించారు. ఇంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం ఇదే తొలిసారి నేను తయారు చేసిన వాటిలో 81వ రథం ఇది. దీనికి 70 రోజులు పట్టింది. నా 21 ఏళ్ల రథాల తయారీ జీవిత ప్రస్థానంలో ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇంత వేగంగా రథాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి. – సింహాద్రి గణపతిశాస్త్రి, రథం తయారీదారు చాలా బాగుందయ్యా! ఇంత తక్కువ వ్యవధిలో రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో ప్రభుత్వ కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మరో 150 ఏళ్ల వరకూ ఈ రథానికి ఢోకా లేదు. – మల్లాడి వెంకటరెడ్డి, మత్స్యకారుడు, అంతర్వేది పల్లిపాలెం -
అంతర్వేది : నూతన రథం ట్రయల్ రన్
సాక్షి, సఖినేటిపల్లి: తూర్పుగోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం పూర్తయింది. ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మించడంతో పాటు చక్రాలు కూడా ఏర్పాటు చేశారు. మూడు నెలల రికార్డు సమయంలో అధికారులు ప్రధాన నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంత్రి వేణు గోపాల కృష్ణ ,జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కూడా రథాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు నేడు రథం ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా నిర్మితమవుతున్న రథాన్ని తాళ్ళుతో లాగుతూ బయటకు తీసుకు వెళ్లారు. రధం సునాయాసంగా కదలడంతో ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. పాత రథానికి భిన్నంగా కొత్త రథంలో బ్రేక్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రధం కింద జాకీలు అమర్చి అవసరమైన చోట సునాయసంగా వెనక్కి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. నాలుగు నెలల క్రితం రథం దగ్ధమైన విషయం సంగతి విదితమే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త రథం నిర్మాణం, రథశాల మరమ్మతులకు తక్షణం రూ.95 లక్షలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో పాత రథం నమూనాలోనే రథం 21 అడుగుల పొడవు,16 అడుగుల వెడల్పు, 41 అడుగుల ఎత్తున, ఆరు చక్రాలతో కొత్త రథం డిజైన్ దేవదాయ శాఖ ఖరారు చేసింది. నూతనరథం తయారీకి సుమారు 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకును వినియోగించారు. కొత్త రథం తయారీ పనులకు సెప్టెంబర్ 27న జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ పనులను దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు 90 రోజుల్లో పూర్తి చేశారు. పెయింటింగ్ మినహా ఇతరపనులన్నీ పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినమైన శుక్రవారం రథానికి శిఖరం కూడా అమర్చారు. -
కొత్త రన్‌వేపై ఇక రయ్.. రయ్!
సాక్షి, అమరావతి: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్‌వే ట్రయల్ రన్‌కు సిద్ధమవుతోంది. రూ.125 కోట్ల వ్యయంతో 1,074 మీటర్ల మేర రన్‌వే నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికే 2,286 మీటర్ల పొడవున్న పాత రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్ తీసుకుంటున్నాయి. విమానాశ్రయానికి పెరుగుతున్న విమానాల తాకిడిని దృష్టిలో ఉంచుకుని కొత్త రన్‌వే నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో విమానాశ్రయంలో మొత్తం రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరింది. దీనిపై ట్రయల్ రన్‌కు అనుమతిలిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి కొత్త రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతమయ్యాక ఈ రన్‌వే దేశీయ, అంతర్జాతీయ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు అనువైనదిగా గుర్తింపు వస్తుంది. (దేశీయ ప్రయాణాలకు ఊపు) -
తీరనున్న బెజవాడ వాసుల చిరకాల స్వప్నం
సాక్షి, అమరావతి: బెజవాడ వాసుల చిరకాల స్వప్నం తీరనుంది. నగరంలో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఫ్లైఓవర్ ‘లోడ్ టెస్ట్’ నిమిత్తం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కుమ్మరిపాలెం నుంచి వినాయక గుడి వరకు వాహన రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. విజయవాడ వైపు వచ్చే భారీ వాహనాలు/ ఇతర వాహనాలు ఇబ్రహీంపట్నం-గొల్లపూడి-సితార సెంటర్-కబేలా-సీవీఆర్ ఫ్లై ఓవర్- ఇన్నర్ రింగ్‌రోడ్డు-పైపుల రోడ్ జంక్షన్- రామవరపడు రింగ్‌రోడ్డు మీదగా జాతీయ రహదారి 65కి మీదగా వెళ్లాలని నగర అదనపు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కృష్ణలంక పోలీస్‌స్టేషన్- పోలీస్ కంట్రోల్ రూమ్- పంజా సెంటర్- చిట్టినగర్- సొరంగం- గొల్లపూడి - ఇబ్రహీంపట్నం మీదగా వెళ్లాలని పేర్కొన్నారు. 15వ తేదీ సాయంత్రం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం 98 శాతం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 20 తర్వాత ట్రయల్ రన్ నిర్వహించాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. అంతకు ముందుగా ‘లోడ్ టెస్ట్’ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం నుంచి 48 గంటల పాటు లోడ్ టెస్ట్‌ను కొనసాగించనున్నారు. 24 లారీల్లో ఇసుక/ కాంక్రీటును నింపుతారు. ఒక్కో లారీపై 28.5 టన్నుల చొప్పున మొత్తం 684 టన్నుల బరువును వంతెనపై స్పాన్ల మధ్య ఉంచుతారు. 48 గంటల తర్వాత ఏమైనా లోపాలు కనిపిస్తే సరిచేస్తారు. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాక ఈనెల 20 తర్వాత ట్రయల్ రన్లో భాగంగా వాహనాలను అనుమతిస్తామని ఆర్ అండ్ బీ (క్వాలిటీ కంట్రోల్) సూపరింటెండింగ్ ఇంజినీర్ జాన్ మోషే తెలిపారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
శ్రీవారి ట్రైల్ రన్ విజయవంతం
-
తిరుమలలో మూడు రోజులపాటు ట్రైల్ రన్
-
బియ్యం డోర్ డెలివరీకి 8న ట్రయల్‌రన్
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయనున్న నేపథ్యంలో సోమవారం మొబైల్ యూనిట్ల ట్రయల్‌రన్ చేయనున్నారు. అధికారంలోకి వస్తే నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు హామీ ఇచ్చారు. (మైనార్టీల జీవితాల్లో ఆర్థిక వెలుగు) ఈ హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు బియ్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేకంగా మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే తయారు చేసిన కొన్ని యూనిట్లను ఈ నెల 8న ట్రయల్ రన్ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 13,370 మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చేందుకు టెండర్లను పిలుస్తామని తెలిపారు. నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ విధానం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. (ఏపీ ప్రభుత్వ పథకాలకు జాతీయస్థాయి ప్రశంసలు) మొబైల్ యూనిట్ వల్ల ప్రయోజనం... ► ఇందులోనే ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ఉంటుంది. ► మొబైల్ యూనిట్ల ద్వారా ఇంటికివెళ్లి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తారు. ► లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్ ఓపెన్ చేసి రేషన్ ఇస్తారు. ► బియ్యం తీసుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యాగులను ముందే ఇవ్వనున్నారు. -
తిరుమలలో ట్రయల్ రన్
-
ఆకాశంలో సైకిల్ సవారీ
సాక్షి ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లోని హరితవనంను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సైకిల్ జిప్‌లైన్‌ను ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీ, నాగ్‌పూర్ నుంచి టెక్నికల్ ఇంజనీర్లను పిలిపించి దీన్ని తయారు చేయించారు. మంగళవారం నిర్వహించిన ట్రయల్ రన్లో రోషన్, కృష్ణ అనే మెకానిక్ దీన్ని నడిపించారు. -
'ఆగస్టు 15 నుంచి ట్రయల్ రన్'
సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి) : బ్రాంచ్ రైల్వే లైన్లో డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని వేగవంతం చేసి, ఆగస్టు 15 నాటికి ట్రాక్‌పై ట్రయల్ రన్ నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం పి.శ్రీనివాస్ చెప్పారు. మోటూరు నుంచి ఆకివీడు వరకూ డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆకివీడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూలై 15 నుంచి ఆగస్టు 1వ తేదీలోగా డబ్లింగ్, విద్యుద్ధీకరణ, ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకూ ఆకివీడు స్టేషన్ పరిధిలో కొన్ని లైన్ల లింకులను కలుపుతామన్నారు. దీంతో మోటూరు–ఆకివీడు మధ్య డబ్లింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. కొత్తలైన్‌పై ప్రయోగాత్మకంగా గూడ్స్ రైళ్ళను నడుపుతామని చెప్పారు. బ్రాంచి రైల్వే లైన్ల డబ్లింగ్, విద్యుద్ధీకరణ, స్టేషన్ల అభివృద్ధికి ఆర్వీఎన్ఎల్ సంస్థ నిధులు విడుదల చేస్తుందన్నారు. గత బడ్జెట్లోనే ప్రభుత్వం రూ.1500 కోట్లు నిధులు కేటాయించిందని వెల్లడించారు. 2022కు బ్రాంచ్ లైన్ల డబ్లింగ్ పూర్తి 2022 నాటికి విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–భీమవరం, భీమవరం–నిడదవోలు బ్రాంచి రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని పూర్తి చేస్తామని డీఆర్ఎం చెప్పారు. ఈ ప్రాంతంలో పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అదనపు లైన్ల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్లు తదితర వాటిని నిర్మిస్తామన్నారు. డ్రెయిన్ నిర్మాణానికి ఆదేశం ఆకివీడులో రైల్వే కొలిమిలలో ముంపు నివారణకు పక్కా డ్రెయిన్లు నిర్మించాలని సంబంధిత ఏఈని డీఆర్ఎం ఆదేశించారు. రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా కొలిమిలున్నాయని, వర్షం నీటితో ఇవి ముంపునకు గురై దోమలు, ఈగలు, పందుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు డీఆర్ఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన స్పందించి వర్షం ముంపు నీటిని బయటకు మళ్లించేందుకు పక్కా డ్రెయిన్ నిర్మించాలని సూచించారు. డీఆర్ఎం వెంట సీనియర్ డీఓఎం వి.ఆంజనేయులు, ఆర్వీఎన్ఎల్ చీఫ్ ప్లానింగ్ మేనేజర్ మున్నా కుమార్, వరుణ్ బాబు, స్టేషన్ మాస్టర్ వి.మాణిక్యం ఉన్నారు. -
కాళేశ్వరం ట్రయల్ రన్ షురూ
-
కాళేశ్వరం రెండో పంపు డ్రై రన్ విజయవంతం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండో మోటార్ పంపు డ్రై రన్ సైతం విజయవంతం అయింది. ఇప్పటికే ఓ పంపు డ్రై రన్ విజయవంతం కాగా.. మరో పంపు సైతం విజయవంతమైందని నీటి పారుదల శాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి ప్రకటించారు. రెండో మోటార్ స్పీడ్‌ను క్రమంగా పెంచుతూ పూర్తి స్థాయిలో పనిచేసేలా ఈ స్పీడ్ ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. మోటార్ ఆర్పీఎం (రివల్యూషన్ పర్ మినిట్) సామర్థ్యం 214.5 ఆర్‌పీఎంలు కాగా అది 10 నిమిషాల్లోనే నిర్ణీత స్పీడ్‌ను అందుకుందని వివరించారు. ఈ డ్రై రన్‌ను ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ వెంకట రాములు, ఈఈ శ్రీధర్‌తో పాటు బీహెచ్ఈఎల్, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు పర్యవేక్షించారు. ఈ పంపు డ్రై రన్ విజయంతం కావడంపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, ట్రాన్స్‌కో, మేఘా, బీహెచ్ఈల్ ప్రతినిధులను అభినందించారు. ప్యాకేజీ–8లో రెండో పంపు సైతం సిద్ధం కావడంతో ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6లోని మోటార్ల డ్రై రన్, ప్యాకేజీల–7లో మిగిలిన టన్నెల్ నిర్మాణ పనులు ముగించడం కీలకంగా మారాయి. ప్యాకేజీ–6లో మోటార్లు సిద్ధంగా ఉన్నా, వాటికి విద్యుత్‌ను అందించే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ఇంకా సిద్ధం కావాల్సి ఉంది. అది పూర్తయితే ఈ వారం, పది రోజుల్లోనే డ్రై రన్ జరిగే అవకాశం ఉం ది. ఇక ప్యాకేజీ–7లో టన్నెల్ పనులు చివరి దశకు చేరుకుంటుండగా, లైనింగ్ పనులు మిగిలి ఉంటా యి. ఈ పనులు పూర్తయితే వచ్చే నెల నుంచే ఎల్లంపల్లి నుంచి నీటిని మేడారం రిజర్వాయర్‌కు అటునుంచి మిడ్‌మానేరుకు తరలించే అవకాశంఉంది. -
పంద్రాగస్టుకు మెట్రో పరుగు..!
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు మరో రూట్లో పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న ఎల్బీనగర్–అమీర్‌పేట్(17 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక అమీర్‌పేట్–హైటెక్‌సిటీ రూట్లో అక్టోబర్‌లో.. ఎంజీబీఎస్–జేబీఎస్ రూట్లో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తుండగా.. నిత్యం సుమారు 75 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. తప్పిన ఆర్వోబీ చిక్కులు.. మెట్రో రైళ్ల రాకపోకల కోసం 8 రైల్వే ఓవర్ బ్రిడ్జీల(ద.మ.రైల్వే పట్టాలపైన ఏర్పాటు చేసినవి) నిర్మాణం పూర్తవడంతో మూడు మార్గాల్లో మెట్రో పరుగుకు లైన్ క్లియర్ అయ్యింది. అత్యంత కీలకమైన బోయిగూడా ఆర్వోబీ నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. ఈ ఆర్వోబీ నిర్మాణంతో జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో పనులకు మార్గం సుగమమైంది. బోయిగూడా ఆర్వోబీని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ భారీ స్టీలు వంతెనను అనేక వ్యయప్రయాసలకోర్చి నిర్మించామన్నారు. ఈ ప్రాంతంలో మెట్రో రైలు ట్రాక్ అత్యంత ఒంపు తిరిగిందని.. దీంతో 64 అడుగుల వెడల్పు.. 221 అడుగుల పొడవున ఈ బ్రిడ్జీని ఏర్పాటు చేశామన్నారు. ఈ వంతెన రహదారికి 40 అడుగుల ఎత్తున ఉందని, బాక్సు ఆకృతిలో దీనిని నిర్మించడం ద్వారా ఈ రూట్లో మెట్రో పరుగుకు అవకాశం కల్పించామన్నారు. ఈ స్టీలు వంతెనను ఘజియాబాద్‌లో తయారు చేశామని, ముక్కలుగా స్టీలు ప్లేట్లను తీసుకొచ్చి దశలవారీగా వారధిని 51 వేల హైస్ట్రెంత్ ఫ్రిక్షన్‌గ్రిప్ బోల్టులతో నిర్మించామన్నారు. ముందుగా వారధిని నిర్మించి.. హైడ్రాలిక్ జాక్‌లు, గైడింగ్ రోలర్ల సహాయంతో ముందుకు తీసుకెళ్లి నిర్ణీత ప్రదేశంలో వంతెనను అమర్చామని, దీంతో వంతెన నిర్మాణ సమయంలో ట్రాఫిక్ రద్దీని నివారించగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా వారధి కోసం పనిచేసిన ఇంజనీర్లను ఆయన అభినందించారు. బోయిగూడా వంతెన సాకారమైందిలా.. అత్యంత రద్దీ ప్రాంతం కావడంతో ప్రత్యేక పరిస్థితులు, వినూత్న డిజైన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఉక్కు ప్లేట్లను అధిక కచ్చితత్వంతో ఒకదానితో మరోటి జత చేశారు. ఇందుకోసం ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసే నైపుణ్యంగల సిబ్బందిని నియమించారు. వంతెన నిర్మాణానికి పరిమిత స్థలంలో అధిక సామర్థ్యం ఉన్న క్రేన్లను చాకచక్యంగా ముందుకు కదిల్చారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఏర్పాటు చేసిన ఆరు వరుసల ద.మ.రైల్వే పట్టాలపైన ఈ ఉక్కు వంతెనను నిర్మించారు. ద.మ.రైల్వే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ వైర్లు అత్యంత సమీపంలో ఉన్నా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వంతెన నిర్మాణం పూర్తి చేశారు. బోయిగూడా వంతెన విశేషాలివే.. స్టీలు వారధి పొడవు : 221 అడుగులు స్టీలు వారధి వెడల్పు : 64 అడుగులు వంతెన పిల్లర్ల ఎత్తు : 1,417 అడుగులు ద.మ.రైల్వే పట్టాల పైనుంచి బ్రిడ్జీ ఎత్తు : 30 అడుగులు వంతెనను కదిల్చేందుకు వాడిన జాక్‌ల బరువు : ఒక్కోటి వంద టన్నులు వర్టికల్ లిప్టింగ్ జాక్ బరువు : 300500 టన్నులు మొత్తం వారధి బరువు : 960 మెట్రిక్ టన్నులు -
మెట్రో వేళల్లో మార్పులు
సాక్షి, సిటీబ్యూరో: ఈనెల 16 నుంచి(సోమవారం) మెట్రో రైలు పని వేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఎల్‌అండ్‌టీహెచ్‌ఎంఆర్‌ఎల్ సంస్థ నూతన సమయపట్టిక ప్రకటించింది. ఎల్బీనగర్–అమీర్‌పేట్, అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌రన్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయంతీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటికే నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న రైళ్ల పనివేళలు స్వల్పంగా మారనున్నాయి. ఇకపై సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తొలిరైలు 6.30 గంటలకు బయలుదేరనుంది. ఇక ఆదివారం రోజున ఉదయం 6 గంటలకు మొదలయ్యే తొలి రైలు ఉదయం 7గంటలకు బయలుదేరనుంది. ట్రయల్‌రన్ నేపథ్యంలో మెట్రో రైళ్ల పనివేళలను అరగంటపాటు కుదించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా రాత్రి 10 గంటల వరకు యథావిధిగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. కాగా ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో ఆగస్టు తొలివారంలో, అమీర్‌పేట్–హైటెక్‌సిటీమార్గంలో ఈ ఏడాది అక్టోబరులో మెట్రో రైళ్లు సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎంఆర్ ఏర్పాట్లు చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే నిత్యం 75 వేల మంది ప్రయాణికులు నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ (30 కి.మీ)మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. -
కృష్ణానదిలో రవాణా పంట్ ట్రైల్‌రన్
ఇబ్రహీంపట్నం: రాజధాని నిర్మాణానికి ముడి సరకులు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన జలరవాణా పంట్‌కు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహించారు. సుమారు 700 టన్నుల బరువు మోయగల సామర్థ్యమున్న పంట్‌పై 40 టన్నుల బరువుండే ఆరు భారీ వాహనాలను ఎక్కించి ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి లింగాయపాలెం రేవు వరకు నడిపారు. 240 టన్నులకే నదిలో అక్కడక్కడ భూగర్భం తగలడంతో నదిలో డ్రెడ్జింగ్ చేపట్టాలని నిర్వాహకులు గుర్తించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇనుము, సిమెంట్, కంకర, ఇతర సామగ్రిని అమరావతి ప్రాంతానికి తరలించాలంటే విజయవాడ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. దుర్గ గుడి ప్లైఓవర్ నిర్మాణంతో రాత్రివేళల్లో మాత్రమే రవాణా వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెర్రీలో ఏర్పాటు చేసిన పంట్తో ఒకేసారి 15 నుంచి 20 భారీ వాహనాలు గుంటూరు జిల్లా వైపు వెళ్లేందుకు మార్గం సుగుమం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విజయవాడకు రాకుండానే గుంటూరు జిల్లా చేరుకోవచ్చు. స్థానికుల అభ్యంతరం జాతీయ రహదారి నుంచి ఫెర్రీకి భారీ వాహనాలు వెళ్తుండడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీకి వెళ్లే రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. అక్కడినుంచి పట్టిసీమ కాలువ వెంట ఉన్న రహదారి ఇప్పటికే నాణ్యత కోల్పోయిందని, అందువల్ల భారీ వాహనాలను ఎలా అనుమతిస్తారని స్థానికులు మండిపడుతున్నారు.