
సాక్షి ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లోని హరితవనంను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సైకిల్ జిప్‌లైన్‌ను ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీ, నాగ్‌పూర్ నుంచి టెక్నికల్ ఇంజనీర్‌లను పిలిపించి దీన్ని తయారు చేయించారు. మంగళవారం నిర్వహించిన ట్రయల్ రన్‌లో రోషన్, కృష్ణ అనే మెకానిక్ దీన్ని నడిపించారు.