harithavanam
-
ఆకాశంలో సైకిల్ సవారీ
సాక్షి ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లోని హరితవనంను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సైకిల్ జిప్‌లైన్‌ను ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీ, నాగ్‌పూర్ నుంచి టెక్నికల్ ఇంజనీర్లను పిలిపించి దీన్ని తయారు చేయించారు. మంగళవారం నిర్వహించిన ట్రయల్ రన్లో రోషన్, కృష్ణ అనే మెకానిక్ దీన్ని నడిపించారు. -
హరితవనంతోనే బంగారు తెలంగాణ
పరకాల : హరితవనంతోనే బంగారు తెలంగాణకు బాటలు పడతాయని జిల్లా రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పోలీసు అమరవీరుల స్మారకార్థం మంగళవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో మొక్కలను నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు పాల్గొంటున్నాయన్నారు. నాటిన మొక్కలను చిన్న పిల్లల మాదిరిగా పెంచితే తర్వాత అవి పండ్లు ఇస్తాయన్నారు. మొక్కలను సంరక్షించడానికి ప్రభుత్వం నెలకు కొంత మొత్తాన్ని అందించడం జరుగుతుందన్నారు. 33 శాతం ఉన్న అడవుల శాతాన్ని 50 శాతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పరకాల డీఎస్పీ వైవీఎస్ సుధీంద్ర మాట్లాడుతూ పోలీసు అమరవీరుల స్మారకార్థం మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సబ్ డివిజన్లో లక్ష మొక్కలు నాటడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, తహసీల్దార్ పి.హరికృష్ణ, ములుగు ఫారెస్ట్ రేంజర్ పూర్ణిమ, ఎస్సైలు దీపక్, రవీందర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
హరితవనం.. పాఠశాల ఘనం
‘మొక్క’వోని దీక్షతో కంటికి రెప్పలా సంరక్షణ నిత్యం హెచ్ఎం పర్యవేక్షణ పాఠశాలలో గత ఏడాది వంద.. సెప్టెంబర్ 3న మొక్కల పుట్టిన రోజుకు సన్నద్ధం వెల్దుర్తి: మారుమూల గ్రామంలోని ఓ పాఠశాల అది.. హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషితో హరితమయమైంది.. వినోదానికి వేదికైంది.. వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని శేరి గ్రామంలోని పాఠశాల.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత సంవత్సరం విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. కంటికి రెప్పలా పెంచి పెద్దచేశారు. నేడు ఆ మొక్కలు పెరిగి పెద్ద అయ్యాయి. చెట్ల చల్లని నీడలో కూర్చొని విద్యార్థులు భోజనాలు చేస్తూ ఆనందంగా చిందులేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం అరికెల వెంకటేశ్ ఆధ్వర్యంలో గత ఏడాది సెప్టెంబర్ 3న హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో వంద మొక్కలను నాటారు. వాటిలో 93 మొక్కలు పెరిగి చెట్లుగా ఎదిగి విద్యార్థులకు చల్లని నీడను ఇస్తున్నాయి. ఈ నెలలో మరో 40 మొక్కలు నాటినట్టు హెచ్ఎం తెలిపారు. వాటిని సైతం కంటికి రెప్పలా కాపాడుతున్నామన్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది నాటిన మొక్కలకు సెప్టెంబర్ 3న పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు.