నేటి నుంచి 167 బస్తీల్లో ట్రయల్‌రన్ షురూ
సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి 167 బస్తీలకు ఉచిత నీటి సరఫరా అందించే కార్యక్రమాన్ని మరోవారం రోజులపాటు వాయిదా వేయాలని జలమండలి నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాత మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. బుధవారం నుంచి వారం రోజులపాటు 167 బస్తీల్లో రోజూ నీళ్లిచ్చేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో రోజూ నీళ్లిచ్చే కార్యక్రమాన్ని మున్సిపల్ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు.
స్పెషల్ ఆఫీసర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు క్షేత్ర స్థాయిలో ట్రయల్ రన్ ఏవిధంగా అమలవుతుందో రోజువారీగా పర్యవేక్షించాలని ఆదేశిం చారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ పీఎస్ సూర్యనా రాయణ, ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ జి.రామేశ్వర్‌రావు, పీ అండ్ ఏ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.