8న పుష్కర ట్రయల్ రన్
· అడుగడుగునా సీసీ కెమెరాలు
· మూడు పుష్కరనగర్‌లు, అన్నదాన కేంద్రాలు
· రద్దీకనుగుణంగా దోర్నాల వద్దే వాహనాల నిలుపుదల
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో పుష్కర పనులు చివరి దశకు చేరుకున్నాయని జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. బుధవారం సాయంత్రం పాతాళగంగ కొత్త పుష్కరఘాట్ (భ్రమరాంబాఘాట్), మల్లికార్జున పుష్కరఘాట్ల వద్ద జరుగుతున్న పనులను ఈవో నారాయణ భరత్‌గుప్తతో కలిసి పరిశీలించారు.
అలాగే రింగ్‌రోడ్డు, పార్కింగ్ ప్రదేశాలు, పుష్కరనగర్‌ల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి సంతప్తిని వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఘాట్ల వద్ద రూపురేఖలన్నీ మారిపోతాయని.. 6వ తేదీలోగా అన్ని పనులు పూరై ్త 8న ట్రై ల్ రన్‌కు సిద్ధం కావాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. 500 మంది భక్తులు ఒకేసారి దుస్తులు మార్చుకునేందుకు వీలుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులరద్దీ ఎక్కువగా ఉంటే దోర్నాల వద్దే వాహనాలను నిలుపుదల చేసి అక్కడి నుంచి శ్రీశైలానికి చేరుకోవడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. భద్రతాపరంగా అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, బందోబస్తు విషయంలో పూర్తిస్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాతాగంగకు వెళ్లే ఘాట్‌రోడ్డులో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, కాలినడకన చేరుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీశైలంలోని అర్‌అండ్‌బీశాఖ వసతిగహాన్ని ఆర్‌డీఓకు అప్పగించాలని ఇంజనీర్లకు ఆదేశించారు. అనంతరం ఈవో నారాయణ భరత్‌గుప్త మాట్లాడుతూ.. భక్తులరద్దీని దష్టిలో పెట్టుకుని క్యూలు, స్వామిఅమ్మవార్ల దర్శనం, ప్రసాదం కౌంటర్లు అవసరమైన మేరకు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాల సమయంలో స్వామివార్ల స్పర్శదర్శనం, అభిషేకాలను రద్దు చేశామని, సామాన్య భక్తులకు స్వామిఅమ్మవార్ల దర్శనం, పిండ ప్రదానాలకు ఏర్పాటు, మూడు పుష్కర నగరాలు, 3 అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంత మంది భక్తులు క్షేత్రానికి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌కు ఈవో తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్‌డిఓ రఘుబాబు, అర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ విజయుడు, దేవస్థానం ఈఈ రామిరెడ్డి తదితరులు ఉన్నారు.