జూపాడు బంగ్లా ఎత్తిపోతల ట్రయల్‌రన్
తాటిపాడు సమీపంలో నిర్మించిన జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం నుంచి రెండురోజుల్లో ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని ఈఈ రెడ్డిశంకర్ తెలిపారు.
- రెండురోజుల్లో సాగునీరు అందిస్తాం
- ఈఈ రెడ్డి శంకర్ వెల్లడి
జూపాడుబంగ్లా: తాటిపాడు సమీపంలో నిర్మించిన జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం నుంచి రెండురోజుల్లో ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని ఈఈ రెడ్డిశంకర్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి ఎత్తిపోతల పథకం–2 విద్యుత్తు సబ్‌స్టేషన్, యంత్రాలపనితీరును పరిశీలించారు. డీఈ తిమ్మయ్య, ఏఈ రామకృష్ణ, షబ్బీర్ అధ్వర్యంలో మధ్యాహ్నం ట్రయల్‌రన్ నిర్వహించారు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఫుల్‌లోడ్‌తో అధికారులు ట్రయల్ నిర్వహించి చీకటిపడటంతో నిలిపివేసినట్లు తెలిపారు. ఫుల్‌లోడ్ ట్రయల్‌రన్ పూరైనవెంటనే ఎత్తిపోతల పథకం–2 కిందున్న 33 డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ల ద్వారా 2,750 ఎకరాలకు సాగునీటిని అందించనున్నట్లు ఈఈ వెల్లడించారు. ఎత్తిపోతల పథకం నిర్వహణ బాధ్యతలు రెండేళ్ల వరకు కాంట్రాక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. రైతులు విద్యుత్తు చార్జీలకోసం ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రెండేళ్లవరకు ఎలాంటి సమస్య తలెత్తినా కాంట్రాక్టర్‌తోనే చేయిస్తాని తెలిపారు. అనంతరం రైతులు నీటిసంఘాలుగా ఏర్పడి నీటిపన్నును వసూళ్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జూపాడుబంగ్లా–1 ఎత్తిపోతల పథకం పనులను సుజల కంపెనీవారు సకాలంలో పూర్తిచేయకపోవటంతో ఇతరులతో పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. త్వరలో పనులు పూర్తిచేయించి వారంలోగా జూపాడుబంగ్లా–1 ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని అందిస్తామని చెప్పారు.