నేడు ‘జూపాడుబంగ్లా’ ట్రయల్‌రన్
జూపాడుబంగ్లా : తాటిపాడు సమీపంలో నిర్మించిన జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం ట్రయల్‌రన్‌ను సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు డీఈ తిమ్మయ్య ఆదివారం విలేకరులకు తెలిపారు. మూడు రోజుల క్రితం అధికారులు విద్యుత్తును సరఫరా చేశారన్నారు. ఎత్తిపోతల పథకం వద్దనున్న యంత్రాలను, విద్యుత్తు సరఫరాను పరిశీలించి ట్రయల్‌రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రయల్ రన్ ముగిసిన తర్వాత రైతుల పొలాలకు సాగునీటిని సరఫరాచేసే అవకాశాలున్నాయని డీఈ వెల్లడించారు.