jupadu bungalow
-
ఉద్యోగాల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యం
- సీఎం చేతులమీదుగా ఫిబ్రవరిలో జైన్ పరిశ్రమకు శంకుస్థాపన తంగెడంచ(జూపాడుబంగ్లా): జూపాడుబంగ్లాలో స్థాపించనున్న పరిశ్రమల్లో నందికొట్కూరు నియోజకవర్గ నిరుద్యోగులకే ప్రాధాన్యం ఇస్తామని కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన తంగెడంచ ఫారంభూముల్లో స్థాపించనున్న జైన్ ఇరిగేషన్ పరిశ్రమ, గుజరాత్ అంబుజా రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పరిశ్రమలకు అనువైన రహదారి నిర్మాణ పనులను నెలాఖరులోగా పూర్తిచేయించాలని ఏపీఐఐసీ జడ్‌ఎం గోపాలకృష్ణకు సూచించారు. కమిటీ చైర్మన్‌గా తానే ఉన్నందునా పరిశ్రమల్లో నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల నిరుద్యోగుల తర్వాతే ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. తంగెడంచ గ్రామంలో సిమెంటు రహదారులు, డ్రైనేజీలను నిర్మించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న సుద్దవాగును పూడ్చేందుకు రైతులు చేసిన విజ్ఞప్తిని కలెక్టర్ అంగీకరించారు. గుజరాత్ అంబుజా పరిశ్రమకు 200 ఎకరాలు, జైన్ పరిశ్రమకు 634 ఎకరాలను కేటాయించామన్నారు. వీటిలో 8వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జైన్ ఇరిగేషన్ కంపెనీ సీఈఓ షమీర్‌శర్మ, తహసీల్దారు జాకీర్‌హుసేన్, ఆర్ఐ సుధీంద్ర, వీఆర్వో జగదీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జూపాడు బంగ్లా ఎత్తిపోతల ట్రయల్‌రన్
- రెండురోజుల్లో సాగునీరు అందిస్తాం - ఈఈ రెడ్డి శంకర్ వెల్లడి జూపాడుబంగ్లా: తాటిపాడు సమీపంలో నిర్మించిన జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం నుంచి రెండురోజుల్లో ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని ఈఈ రెడ్డిశంకర్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి ఎత్తిపోతల పథకం–2 విద్యుత్తు సబ్‌స్టేషన్, యంత్రాలపనితీరును పరిశీలించారు. డీఈ తిమ్మయ్య, ఏఈ రామకృష్ణ, షబ్బీర్ అధ్వర్యంలో మధ్యాహ్నం ట్రయల్‌రన్ నిర్వహించారు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఫుల్‌లోడ్‌తో అధికారులు ట్రయల్ నిర్వహించి చీకటిపడటంతో నిలిపివేసినట్లు తెలిపారు. ఫుల్‌లోడ్ ట్రయల్‌రన్ పూరైనవెంటనే ఎత్తిపోతల పథకం–2 కిందున్న 33 డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ల ద్వారా 2,750 ఎకరాలకు సాగునీటిని అందించనున్నట్లు ఈఈ వెల్లడించారు. ఎత్తిపోతల పథకం నిర్వహణ బాధ్యతలు రెండేళ్ల వరకు కాంట్రాక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. రైతులు విద్యుత్తు చార్జీలకోసం ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రెండేళ్లవరకు ఎలాంటి సమస్య తలెత్తినా కాంట్రాక్టర్‌తోనే చేయిస్తాని తెలిపారు. అనంతరం రైతులు నీటిసంఘాలుగా ఏర్పడి నీటిపన్నును వసూళ్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జూపాడుబంగ్లా–1 ఎత్తిపోతల పథకం పనులను సుజల కంపెనీవారు సకాలంలో పూర్తిచేయకపోవటంతో ఇతరులతో పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. త్వరలో పనులు పూర్తిచేయించి వారంలోగా జూపాడుబంగ్లా–1 ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని అందిస్తామని చెప్పారు. -
సాక్షి విలేకరిపై టీడీపీ కార్యకర్తల దాడి
కర్నూలు : ఓటమి భయంతో టీడీపీ దాడులకు పాల్పడుతోంది. తాజాగా తమకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారంటూ జూపాడుబంగ్లా సాక్షి విలేకరి నాగభూషణంపై టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో నాగభూషణం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా పలు చోట్ల వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిధిలోని వట్లూరు పంచాయితీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టిడిపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గతకొన్నిరోజులుగా ఇరుపార్టీల కార్యకర్తలకు గొడవలు జరుగుతున్నాయి. పంచాయితీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ పార్టీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు.