
సర్జిపుల్‌లో నిండిన నీరు
పెద్దకొత్తపల్లి: కేఎల్‌ఐ పథకంలో రెండవ లిప్టు జొన్నలబొగుడ మోటార్ల ట్రయల్ రన్‌కోసం ప్రాజెక్టు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. గత 15ఏళ్ల నుంచి రిజర్వాయర్ పనులు కొనసాగుతుండటంతో ఎంతో కాలంగా రైతులు ఎదురుచూస్తున్న సాగునీరు అందించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల్లో మొదటి మోటారును రన్ చేయించి రిజర్వాయర్‌లోకి 2.8టీఎంసీల నీటిని నింపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
సర్జిపుల్ సంపు వద్ద పనులు పూర్తి కావడం వల్ల సింగోటం రిజర్వాయర్ ద్వారా నీటిని పంపులోకి వదిలారు. మోటారు రన్ అయిన వెంటనే రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు కృషి చేస్తున్నారు. విద్యుత్ పనులు పూరై్తనట్లు అధికారులు తెలిపారు. మోటారు రన్ కాకపోవడంతో రెండు రోజుల నుంచి అక్కడే మకాం వేసి సాంకేతిక లోపాలను సరి చేస్తున్నారు. జొన్నలబొగుడ నుంచి గుడిపల్లి రిజర్వాయర్ ద్వారా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు కాలవలో ఉన్నచెట్లను తొలగిస్తున్నారు. ఈ నెల చివరి వరకు మోటార్లను పరి చేయించి సాగునీరు నింపుతామని సీఈ ఖగేందర్ తెలిపారు.