ట్రైల్‌ రన్‌ వేస్తానని కారుతో పరారీ | Car theft | Sakshi
Sakshi News home page

ట్రైల్‌ రన్‌ వేస్తానని కారుతో పరారీ

Published Tue, Jul 26 2016 6:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

Car theft

పెదకాకాని: ట్రైల్‌ రన్‌ వేస్తానని కారుతో పరారీ అయిన సంఘటన ఆటోనగర్‌లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే గుంటూరు అమరావతి రోడ్డులో నివశిస్తున్న అన్నంగి విష్ణువర్ధన్‌ తన వెర్నా ప్లెడిక్‌ కారును రూ.8.80 లక్షలకు అమ్ముతానని మూడు రోజుల క్రితం ఒఎల్‌ఎక్స్‌లో పెట్టాడు. ఆదివారం రమేష్‌ పేరుతో ఓ వ్యక్తి కాల్‌ చేసి కారు కావాలి ఎక్కడికి రమ్మంటారు అని అడిగి సోమవారం గుంటూరు వచ్చాడు.

బస్టాండ్‌లో బాడిగకు అంబాషిడర్‌ కారును మాట్లాడుకుని అమరావతి రోడ్డులో ఉంటున్న విష్ణువర్ధన్‌ను కలిశారు. మెకానిక్‌కు చూపించాలని అందరూ కలసి ఆటోనగర్‌ హ్యుండయ్‌ షోరూం వద్దకు వచ్చారు. టెక్నీషియన్‌తో కారు తోలించి ట్రైల్‌ రన్‌ వేస్తానని మేం ఇద్దరమే ట్రైల్‌కు వెళ్ళి వస్తామని చెప్పి షోరూం టెక్నీషియన్‌తో పెదకాకాని వైపు వెళ్ళాడు. టెక్నీషియన్‌ను మార్గమద్యంలో దింపి ఇక్కడే ఉండమని చెప్పి ఆ వ్యక్తి కారుతో ఉడాయించాడు. కొంత సేపు చూసిన తరువాత కూడా రాకపోవడం, టెక్నీషియన్‌ షోరూంకు చేరుకోవడంతో తాము మోసపోయామని భావించిన విష్ణువర్ధన్‌ పెదకాకాని పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement