‘చాంపియన్ హ్యాపీ క్లబ్ దందా’
కృష్ణా నదిలో అనధికారికంగా బోట్ల నిర్వహణ
రూ.4 కోట్లకు పైగా ఆర్జన
ప్రభుత్వంతో చిన్న కనెక్షన్ ఉంటే చాలు... పెద్ద ఎత్తున కలెక్షన్లు చేయవచ్చని నిరూపిస్తోంది చాంపియన్ హ్యాపీ క్లబ్. ప్రభుత్వానికి ప్రైవేటుపై ఉన్న మోజును ఆ క్లబ్ ఆసరాగా చేసుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. అన్నట్లుగా టూరిజంలో రూ.100 కోట్లు పెడతామని పది నెలల క్రితం ఒప్పందం చేసుకుంది. ద్వీపం చుట్టూ పాగా వేసింది. ట్రయల్ రన్ పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండానే కృష్ణా నదిలో బోట్లు నడుపుతోంది. ఈవెంట్లు నిర్వహిస్తోంది. నెలకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అక్రమంగా ఆర్జిస్తోంది.
తాడేపల్లి (తాడేపల్లి రూరల్) :
విజయవాడ, తాడేపల్లి పరిధిలోని భవాని ద్వీపాన్ని ఆసరాగా చేసుకుని పర్యాటక రంగంలో ‘చాంపియన్ హ్యాపీ క్లబ్’ దం దా సాగిస్తోంది. ఎంవోయూలకు సంబంధించిన లీజు అగ్రిమెంట్లు, రెవె న్యూ వా టాలు కుదరకముందే ఈ వెంట్లు ఏ ర్పాటు చేస్తోంది. ట్రయల్ రన్ పేరుతో ప ది నెలలుగా దగా చేస్తోంది. పర్యాటక శా ఖకు వాటా చెల్లించకుండా తప్పించుకుం టోంది. ప్రైవేటు ఒప్పందాల పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ఈ క్లబ్ వ్యవహారాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోతోంది.
ఒప్పందం మాత్రమే..
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంలో ప్రైవేటు ఒప్పందాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో పలు ప్రైవేటు కంపెనీలతో రూ.4,500 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులకు భూమి కేటాయింపు, రెవెన్యూ భాగస్వామ్యాలు, ఆదాయాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వాటాలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. దీంతో ఏ ఒక్క ప్రాజెక్టూ ముందుకు వెళ్లడం లేదు. పర్యాటక రంగంలో పీపీపీ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో చాంపియన్ హ్యాపీ క్లబ్ కూడా ఒకటి. ఈ క్లబ్ రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడతామని పది నెలల క్రితం భాగస్వామ్య ఒప్పందంలో పేర్కొంది. అయితే ప్రభుత్వంతో లీజు అగ్రిమెంట్, ఆదాయంలో రెవెన్యూ వాటాలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు. ఈ ఒప్పందాలు ఓ కొలిక్కి రాకుండానే భవానీ ద్వీపం వద్ద అనువైన ప్రాంతంలో వాటర్ ఈవెంట్లను ఏర్పాటు చేసింది. మొత్తం 15 రకాల వాటర్ ఈవెంట్లతో పర్యాటకులను ఆకట్టుకుంటూ రోజూ పెద్ద ఎత్తున కలెక్షన్ చేస్తోంది.
వాటాలు తేలకుండానే ఏర్పాట్లు..
భవానీ ద్వీపం పరిసరాల్లో వాటర్ స్పోర్ట్స్, ఆధునిక బోట్లు, ఫ్లోటెల్ హట్స్ వంటివి ఏర్పాటు చేయనున్నట్టు చాంపియన్ హ్యాపీ క్లబ్ పేర్కొంది. ఇందుకోసం రూ.7 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. స్పీడ్ బోట్లు, జొర్బొబాల్, ఫెడలింగ్ బోట్, వాటర్ సైక్లింగ్, హ్యాండ్‌బాల్ గేమ్ కోర్టు, రెయిన్ డ్యాన్స్ వంటి వాటిని ఏర్పాటు చేసింది. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కొక్కరి వద్ద రూ.300 నుండి రూ.500 వరకూ వసూలు చేస్తోంది. రూ.60 లక్షలతో మీనా బోట్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి రెండు కోట్ల రూపాయలతో 200 మంది విందు చేసుకునే విధంగా ఓ బోటు కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే పర్యాటక శాఖకు చెందిన స్పీడ్ బోట్ జట్‌స్కీ పర్యాటకులకు అందుబాటులో లేకుండా చేశారు. దీంతో పర్యాటకుల నుంచి అన్‌సీజన్‌లో చాంపియన్ హ్యాపీ క్లబ్ వారు నెలకు రూ.40 లక్షలు, సీజన్‌లో రూ.50 లక్షలు వరకూ ఆదాయం పొందినట్టు తెలిసింది. ప్రభుత్వానికి ఎలాంటి చెల్లింపులు చేయకుండానే పది నెలల్లో రూ.4 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించినట్టు సమాచారం. ప్రైవేటు సంస్థ పెట్టిన పెట్టుబడిలో ఇప్పటికే సగానికి పైగా సమకూరిందని నిపుణుల అంచనా.
పర్యాటక శాఖకు గండి
ప్రైవేటు కంపెనీ రాకతో ప్రభుత్వ పర్యాటక శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. పర్యాటక శాఖకు బోటింగ్ ఈవెంట్ల ద్వారా వచ్చే ఆదాయం నెలకు రూ.14 లక్షల నుంచి రూ.5 లక్షలకు పడిపోయినట్టు తెలిసింది. పర్యాటక శాఖ ప్రస్తుతం భవానీ ద్వీపానికి పర్యాటకులను చేరవేయడానికి మాత్రమే పరిమితమైంది. ఆ శాఖకు చెందిన బోట్లలో క్యాండిల్ నైట్ డిన్నర్‌లు, ఈవినింగ్ పార్టీలు తగ్గిపోయాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువున నీటి నిల్వలను ఆసరా చేసుకునే ‘చాంపియన్’ ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఈవెంట్ల నిర్వహణపై జలవనరుల శాఖ, పర్యాటక శాఖలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. కానీ ఎనిమిది నెలలుగా తనకు వచ్చిన ఆదాయంలో ఏ శాఖకూ రూపాయి చెల్లించకుండా, ట్రయర్ రన్ పేరుతోనే పెద్ద మొత్తం వసూలు చేసింది.
రోజువారీ వాటాలు !
చాంపియన్ హ్యాపీ క్లబ్ దందాను నిలవరించకుండా ఉండేందుకు పర్యాటక, జలవనరుల శాఖలోని అధికారులకు రోజువారీ వాటాలు పంపుతున్నట్టు సమాచారం. రానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని లోటస్ ఫుడ్ సిటీ వద్ద ఓ కార్యాలయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమ దందా సాగించేందుకు ‘చాంపియన్’ యజమానులు రంగం సిద్ధం చేస్తున్నారు.
అనుమతులు ఇవ్వలేదు
‘కృష్ణా నదిలో ప్రైవేటు బోట్ల నిర్వహణకు అనుమతులు లేవు. చాం పియన్ హ్యాపీ క్లబ్ వ్యవహారంపై చర్య లు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాం. ప్రకాశం బ్యారేజీ వద్ద ఏ ర్పా టు చేస్తున్న కార్యాలయం విషయం గు రిం చి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.’
– గంగరాజు, పర్యాటక శాఖ డీవీఎం