గోడను ఢీకొట్టిన మెట్రో రైలు | Driverless train of Delhi Metro's Magenta line derails, crashes into wall | Sakshi
Sakshi News home page

మెట్రో ట్రయిల్‌​ రన్‌లో ప్రమాదం

Published Tue, Dec 19 2017 6:32 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Driverless train of Delhi Metro's Magenta line derails, crashes into wall even before inauguration - Sakshi

సాక్షి, ఢిల్లీ: మెట్రో ట్రయిల్‌​ రన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం చోటు చేసుకుంది. కలింది కుంజ్‌ డిపో నుంచి మెట్రో రైలు ట్రయల్‌ రన్‌కు వెళ్తున్న సమయంలో వర్క్‌ షాపు షెడ్డులోని గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగినపుడు రైలు చాలా తక్కువ వేగంతో  ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు.

ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, బొటానికల్‌ - కల్‌కంజి మందిర్‌ మార్గంలో నడవనున్న ఈ సర్వీసును ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అత్యంత అధునాతన సదుపాయాలను ఈ మెట్రోలో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement