మెట్రో పిల్లర్‌ దగ్గర కాల్పుల కలకలం | Fire between Police Gangsters at Delhi Metro Station | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 1:29 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

Fire between Police Gangsters at Delhi Metro Station - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. మంగళవారం ఉదయం ద్వారకా మెట్రో రైల్వే స్టేషన్‌ సమీపంలో పిల్లర్‌ నెంబర్‌-768 దగ్గర పోలీసులకు-క్రిమినల్స్‌ కు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. 

ఓ భవనంలో క్రిమినల్స్ దాగున్నారన్న సమాచారంతో పంజాబ్‌-ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. సోదాలు నిర్వహించేందుకు వెళ్లగా నేరస్థులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. చివరకు ఐదుగురు క్రిమినల్స్‌ను అరెస్ట్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారి నుంచి 12 పిస్టోల్స్‌, 100 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement