న్యూఢిల్లీ: రైల్వే చార్జీల పెంపుపై బడ్జెట్ సమావేశంలో నోరైనా మెదపని ప్రభుత్వం తాజాగా రానున్న కొత్త రైళ్లలో సౌకర్యాలను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. హుమ్ సఫర్, తేజాస్, ఉత్ర్కిష్ట్ డబుల్ డెక్కర్, ఉదయ్ వంటి ఈ సంవత్సరం ప్రారంభం కానున్న పలు రైళ్లలో 15 నుంచి 30 శాతం రేట్లను పెంచే ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. 2016-17 బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ రైళ్లన్ని ఏ ప్రతిపాదిత ప్రాంతాల్లో నడపాలనే దాని మీద ఇంకా కసరత్తు నడుస్తోంది.
భారతీయ రైల్వేలు ఇప్పటికే సువిధ పేరుతో సమయాన్ని అనుసరించి ధరల మార్పిడితో రైళ్లను నడుపుతున్నాయి. ఎక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో సువిధ రైళ్లను నడపడం వల్ల రైల్వే శాఖ భారీగా లాభాలను అర్జిస్తోంది. హమ్సఫర్ రైళ్లలో అన్నీ 3 టైర్ ఏసీ బోగీలు ఉంటాయి. తేజస్ రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కొత్తగా డిజైన్ చేసిన ఉదయ్ డబుల్ డెక్కర్ రైళ్లు 40 శాతం ఎక్కువ మందిని గమ్యస్థానాలకు చేరుస్తాయి.
రైల్వేలు తాజాగా పరిచయం చేసిన మహామన ఎక్స్ప్రెస్, గతిమాన్ ఎక్స్ప్రెస్లలో ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండటం వల్ల రేట్లు కూడా పెంచారని రైల్వే అధికారులు చెబుతున్నారు.
కొత్త రైళ్లలో బాదుడే..
Published Thu, Apr 14 2016 5:32 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement