fares
-
స్టేషన్ల అభివృద్ధి పేరిట.. రైల్వే ఛార్జీలు పెంచనున్నారా..?
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్దరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పనుల కోసం రైల్వే ఛార్జీల ధరలు పెంచుతారనే ఊహాగానాలు పట్టాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ల నీవకరణకు కావాల్సిన నిధుల కోసం టికెట్టు ధరలు పెంచుతారనే అనుమానాలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రైల్వే ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు కావాల్సిన రూ.25 వేల కోట్లను బడ్జెట్ నుంచే కాటాయించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రాజెక్టు పేరుతో ఛార్జీలను పెంచడం జరగదని వెల్లడించారు. రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచస్థాయి స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. స్టేషన్ల అభివృద్ధిలో ఏ రాష్ట్రంలో వివక్ష చూపలేదని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు ఫలితాలను ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
రైలు ప్రయాణికులకు ఊరట.. ఏసీ రైళ్లలో తగ్గనున్న ఛార్జీలు..
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సహా 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల ఛార్జీలను 25 శాతం మేర తగ్గించనున్నట్లు రైల్వే బోర్డు శనివారం తెలిపింది. అనుభూతి, విస్తాడోమ్ కోచ్‌లు సహా ఏసీ సౌకర్యం ఉండే అన్ని రైళ్లకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇతర వాహన ప్రయాణ ఛార్జీలను బట్టి కూడా రాయితీని నిర్ణయిస్తామని పేర్కొంది. వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలపై డిస్కౌంట్ పథకాలను ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించిందని కూడా వివరించింది. ‘ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు రాయితీ ఉంటుంది. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జ్, జీఎస్టీ మొదలైన తదితర ఛార్జీలు అదనం. ఆక్యుపెన్సీ ఆధారంగా ఏదైనా లేదా అన్ని తరగతులలో డిస్కౌంట్ అందించవచ్చు’అని రైల్వే బోర్డు పేర్కొంది. ‘గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కొన్ని సెక్షన్లలోని రైళ్లలో విభాగాల వారీగా రాయితీ ఉంటుంది. డిస్కౌంట్ పథకం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు చార్జీల వాపస్ ఉండదు’అని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండే, కొన్ని తరగతులకు ఫ్లెక్సీ ఫేర్ అమల్లో ఉన్న కొన్ని రైళ్లకు ఈ రాయితీ పథకం వర్తించదు. పండగలు, సెలవు రోజుల్లో ప్రత్యేకంగా నడిపే రైళ్లల్లో రాయితీ ఉండదు. రాయితీ స్కీమ్ వందేభారత్ రైళ్లకు కూడా వర్తిస్తుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని దింపారు -
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్: ఆ టికెట్ చార్జీల తగ్గింపు
రైల్వే శాఖ ప్రయాణికులు భారీ ఊరట కల్పించింది. ఏసీ చెయిర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రైల్వే టికెట్లను తగ్గించింది. ఈ తగింపు పథకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. అనుభూతి , విస్టాడోమ్ కోచ్‌లతో సహా ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో w తగ్గింపు వర్తించనుంది. వందేభారత్‌తో సహా అన్ని రైళ్లలోని ఏసీ చైర్కార్లు, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలు, అనుభూత్, విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నవాటిపై ఆక్యుపెన్సీని బట్టి 25 శాతం వరకు తగ్గిస్తామని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ విషయంలో గత 30 రోజులలో 50శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ (ఎండ్-టు-ఎండ్ లేదా కొన్ని నిర్దేశిత కాళ్లు/సెక్షన్లలో) ఉన్న రైలును పరిగణనలోకి తీసుకుంటామని రైల్వే తెలిపింది. అయితే, ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తగ్గించిన ఛార్జీల వాపసు లభించదు. -
కరోనా : విమాన, హోటల్ చార్జీలు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచదేశాల్లో వేగంగా విస్తరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. దీంతోపాటు కరోనా వైరస్ ఆందోళనలు అనేక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాల ద్వారా ఈ మహమ్మారి మరింత విజృంభించే అవకాశం ఉందున్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే అనేక దేశాలు విమాన ప్రయాణాలను నిషేధించాయి. వీసాలను నిలిపివేసాయి. తాజా పరిణామాలతో విదేశీ పర్యాటక రాకపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఉన్న పరిస్థితి మరింత దారుణంగా పరిణమిస్తోంది. దీంతో విమాన చార్జీలు దాదాపు 70 శాతం క్షీణించాయి. అలాగే హోటల్ రేట్లు సగటున 40 శాతం పడిపోయాయి. కోవిడ్ -19 (కరోనా వైరస్) కారణంగా విమాన చార్జీలు ఇర్‌ఫేర్‌లు సగటున 40 శాతం, హోటల్ రేట్లు 18 శాతం తగ్గాయని ట్రావెల్ ప్లానింగ్ వెబ్సైట్ యాత్రా.కామ్ తెలిపింది. మార్చి 11 నాటికి ఢిల్లీ-ముంబై మార్గంలో ఛార్జీలు దాదాపు 70 శాతం తగ్గాయి.ముంబై-బెంగళూరు మార్గంలో ఛార్జీలు 45 శాతానికి పైగా తగ్గాయి. అయితే మార్చి 11 న ఢిల్లీ-గోవా ఛార్జీలు 8 శాతం పెరగడం గమనార్హం. ఇంతవరకూ గోవాలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాదు విదేశీ ప్రయాణాలను చాలామంది రద్దు చేసుకున్నారని తెలిపింది. దీని శాతం 35శాతంగా ఉందన్నారు. దేశీయంగా కూడా ప్రయాణాలపై అప్రతమత్తంగా వ్యవహరిస్తున్న ప్రయాణికులు, తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారనీ, ఇలాంటి కాన్సిలేషన్ అభ్యర్థనలు చాలానే వస్తున్నాయని యాత్రా.కామ్ తెలిపింది. అలాగే తమ వినియోగదారులు క్యాన్సిలేషన్ ద్వారా నగుదును వాపసు పొందేలా యాత్రా.కామ్ ట్రిప్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా ప్రారంభించినట్టు తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనుకునే యాత్రా.కామ్ వినియోగదారులు, వారి ప్రయాణ తేదీల వాయిదా లేదా ప్రత్యామ్నాయ తేదీలకు బుక్ చేయమని సలహా ఇస్తున్నామని సంస్థ కో ఫౌండర్, సీవోవో, (కార్పొరేట్ ట్రావెల్ అండ్ ఇండస్ట్రీ రిలేషన్స్ హెడ్ ) సబీనా చోప్రా వెల్లడించారు. కాగా గురువారం నాటికి భారతదేశంలో మొత్తం 73 కేసులు పాజిటివ్‌గా తేలాయి. అటు విదేశీ ప్రయాణాలను విరమించుకోవాలంటూ కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. దౌత్య, అధికారిక, ఐక్యరాజస్యసమితి/ అంతర్జాతీయ సంస్థ ఉపాధి, ప్రాజెక్ట్ వీసాలు మినహా ప్రస్తుతమున్న అన్ని వీసాలు 2020 ఏప్రిల్ 15 వరకు నిలిపి వేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసరంగా బయటకు వెళ్లాలనుకునే ఏ విదేశీ జాతీయుడైనా సమీప భారతీయ మిషన్‌ను సంప్రదించవచ్చని మార్చి 11న విడుదల చేసిన ఒక ప్రకటలో వెల్లడించింది. -
ఇండిగో మూడు రోజుల సమ్మర్ సేల్
న్యూఢిల్లీ: తక్కువ ధరల క్యారియర్ ఇండిగో ఎయిర్ లైన్స్ సోమవారం తక్కువ ధరల్లో విమాన టికెట్లను ప్రకటించింది. తన నెట్వర్క్ అంతటా మూడు రోజుల సమ్మర్ స్పెషల్ సేల్‌ను ప్రవేశపెట్టింది. మే 8, 9, 10 తేదీల్లో డిస్కౌంట్ ధరల్లో ఇండిగో విమాన టికెట్లు అందుబాటులో ఉంటాయి. అన్నీ కలుపుకొని రూ. 899 ధరల్లో వివిధ మార్గాల్లో ఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. నేటినుంచి ఎంపిక చేసిన మార్గాల్లో మూడు రోజుల పాటు వేసవి విక్రయాలను ప్రారంభించినట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై-గోవా, అహ్మదాబాద్-ముంబై, చెన్నై-పోర్ట్ బ్లెయిర్, గౌహతి-హైదరాబాద్, ముంబై-గువహతి, జమ్ము-అమృత్సర్, ఢిల్లీ-ఉదయపూర్, కోల్‌కతా-అగర్తల సహా ఇతర మార్గాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో టికెట్లను కేటాయించ నున్నామని ఇండిగో తెలిపింది. అలాగే ఈ స్పెషల్ సేల్ లో కొన్న టికెట్లకు రిఫండ్ ఉండదని స్పష్టం చేసింది. ఇండిగో ఎయిర్పోస్ ఎ320 విమానాల ద్వారా 46 గమ్యస్థానాలకు 932 రోజువారీ విమానాలు నడుపుతోంది. -
రూ.611కే గోఎయిర్ టిక్కెట్
విమానయాన సంస్థలు అందించే సీజన్ టిక్కెట్లు కొనడం చేజారినవని బాదపడుతున్నారా..? అయితే ఎలాంటి దిగులు అవసరం లేదట. వాదియా గ్రూప్‌కు చెందిన లో-కాస్ట్ విమానయాన సంస్థ గోఎయిర్ ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, రూ.611కే విమాన టిక్కెట్‌ను అందించనున్నట్టు పేర్కొంది. నవంబర్ 4 తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో ప్రయాణికులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని తెలిపింది. 2017 జనవరి 11 నుంచి 2017 ఏప్రిల్ 11వరకున్న ట్రావెల్ కాలంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని గోఎయిర్ ప్రకటించింది. రూ.611 ప్రారంభ టిక్కెట్ ధరలో కేవలం బేస్ ఛార్జీలు, ప్యూయెల్ సర్ఛార్జీలు మాత్రమే కలిసి ఉండనున్నాయి. ప్రస్తుతం అందుబాటులోఉన్న నియమాల ప్రకారం పన్నులు, టిక్కెట్ ధరకు ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. డిస్కౌంట్లు మాత్రమే కాక, ఇతర డిస్కౌంట్లను కూడా ప్రయాణికులు పొందవచ్చు. ప్రతి 11వ కస్టమర్, ఉచిత టిక్కెట్‌ను, 111వ కస్టమర్ అన్ని లెమన్ ట్రీ హోటల్ స్టేలో 40 శాతం డిస్కౌంట్‌ను, 1,111వ కస్టమర్ తిరుగు ప్రయాణ టెక్కెట్స్తో పాటు, రెండు రాత్రులు హోటల్స్‌లో గడిపే అవకాశాలను గెలుపొందవచ్చు. అయితే కొన్ని ట్రావెల్ సెక్టార్లలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు అవి.. ముంబాయి-పోర్ట్ బ్లెయిర్- ముంబాయి బెంగళూరు-పోర్ట్ బ్లెయిర్-బెంగళూర్ చెన్నై-పోర్ట్ బ్లెయిర్-చెన్నై ఢిల్లీ-లెహ్-ఢిల్లీ ముంబాయి-లెహ్-ముంబాయి కోల్కత్తా-పోర్ట్ బ్లెయిర్-కోల్కత్తా ఢిల్లీ-పోర్ట్ బ్లెయిర్-ఢిల్లీ -
జెట్ ఎయిర్వేస్ దీపావళి ఆఫర్
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా విమానయాన సంస్థల దీపావళి బొనాంజా కొనసాగుతోంది. తాజాగా జెట్ ఎయిర్ వేస్ కొత్త తగ్గింపు ధరలను ప్రకటించింది. రూ. 921 (అన్నీ చార్జీలు కలుపుకొని) నుంచి ప్రారంభమయ్యే విమాన టికెట్ ధరలను బుధవారం ప్రకటించింది. ఈ ఆఫర్ నిర్దిష్ట మార్గాలలో ఆరు రోజుల పాటు అమలుచేయనున్నట్టు తెలిపింది. అక్టోబర్ 25 నుండి 30 వరకు అమలు చేయనున్న ఈ సిక్స్ డేస్ సేల్ ఒకవైపు ధరలకు, డైరెక్ట్ విమానాలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ బుకింగ్ తరువాత 15 రోజుల్లోపు జెట్ ఎయిర్వేస్ యొక్క నెట్వర్క్ లో నిర్దిష్ట దేశీయ రూట్లలో ప్రయాణించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో నేడు తెలియచేసింది. దీపావళి నేపథ్యంలోఈ ఆఫర్ ప్రకటించామని, బుకింగ్ తర్వాత మాత్రమే 15 రోజుల్లో నవంబర్ 9 న గానీ, లేదా తర్వాత గానీ ప్రయా ప్రయాణం చేయొచ్చని జెట్ ఎయిర్ వేస్ చీఫ్ కమర్షియల్స్ ఆఫీసర్ జయరాజ్ షణ్ముగం తెలిపారు. దీంతోపాటు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మరో రూ. 200 డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. 117 విమానాలతో సేవలు అందిస్తున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థ ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలోఈఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. -
ఏ ఘాటుకు ఎంత చార్జి?
కర్నూలు(రాజ్‌విహార్): కృష్ణా పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుష్కర స్నానం చేసి పునీతులు అయ్యేందుకు కుటుంబ సభ్యులందరూ సిద్ధమవుతుంటారు. నదీ స్నానం చేసేందుకు ఏ ఘాటుకు వెళ్దాం.. ఎలా వెళ్దాం.. ఎంత దూరం ఉంటుంది.. ఆర్టీసీ చార్జీలు ఎంత ఉంటాయి.. పిల్లలకు బస్సుల్లో ఎంత తీసుకుంటారు.. సమీపంలోని ఊరి నుంచి ఫలాన ఘాటుకు వెళ్లోస్తే చార్జీలు ఎంతవుతాయి.. అని భక్తులు లెక్కలు వేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీల వివరాలు ఇస్తున్నాం.. చార్జీల వివరాలు.. నుంచి వరకు కిలో మీటర్లు పెద్దల చార్జీ పిల్లల చార్జీ కర్నూలు శ్రీశైలం 195 రూ.225 రూ.115 కర్నూలు సంగమేశ్వరం 104 రూ.110 రూ.60 కర్నూలు బీచుపల్లి 51 రూ.60 రూ.35 ఆత్మకూరు సంగమేశ్వరం 45 రూ.50 రూ.25 నందికొట్కూరు సంగమేశ్వరం 72 రూ.65 రూ.34 నంద్యాల బస్టాండ్ లింగాలగటు 176 రూ.210 రూ.110 నందికొట్కూరు నెహ్రూనగర్ 15 రూ.15 రూ.12 సంగమేశ్వరం శ్రీశైలం 168 రూ.148 రూ.75 నంద్యాల శ్రీశైలం 176 రూ.155 రూ.78 మంత్రాలయం శ్రీశైలం 286 రూ.306 రూ.156 ఆళ్లగడ్డ శ్రీశైలం 221 రూ.250 రూ.130 కోవెలకుంట్ల శ్రీశైలం 218 రూ.250 రూ.130 బనగానపల్లె శ్రీశైలం 223 రూ.250 రూ.130 ఎమ్మిగనూరు శ్రీశైలం 262 రూ.285 రూ.145 ఆదోని శ్రీశైలం 292 రూ.310 రూ.160 ఆత్మకూరు శ్రీశైలం 123 రూ.160 రూ.85 కర్నూలు విజయవాడ 342 రూ.300 రూ.152 నంద్యాల విజయవాడ 327 రూ.286 రూ.145 శ్రీశైలం విజయవాడ 272 రూ.238 రూ.120 గమనిక: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులను మాత్రమే నడుపుతోంది. ఆయా బస్సుల్లో కిలో మీటరుకు 0.87పైసల చొప్పున వసూలు చేస్తారు. ఈ చార్జీలపై ఆర్టీసీ డెవెలప్మెంట్ సెస్సు, రిజర్వేషన్ చార్జీ, ప్యాసింజరు ఇన్ఫర్మేషన్ చార్జీ, ఘాట్ రూట్లలో ఒక కిలో మీటరుకు వసూలు చేసే రూ.1.74ను కూడా కలిపి టికెట్ ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన చార్జీల్లో కొద్దిగా తేడా ఉండవచ్చు. -
విస్తారా ధరలు కూడా తగ్గాయ్.. !
న్యూఢిల్లీ : వివిధ డిస్కౌంట్ స్కీమ్స్ తో విమానసంస్థలు ప్రయాణికుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ వంటి సంస్థలు ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా విస్తారా సైతం తన ప్రయాణికుల టిక్కెట్ ధరలకు డిస్కౌంట్ ను ప్రకటించింది. జూలై, సెప్టెంబర్ మధ్యలో ప్రయాణించేవారికి టిక్కెట్ ధరలపై 25 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను ఇవ్వనున్నట్టు తెలిపింది. మరో సంస్థ జెట్ ఎయిర్ వేస్ తన 20 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను పొడిగించింది. దేశీయ మార్గాల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణాలకే ఈ ఆఫర్ వర్తిస్తుందని, జూన్ 8 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు జాయింట్ వెంచర్ అయిన విస్తారా.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్ ను తీసుకొస్తోంది. జూన్ 10 వరకు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చని విస్తారా తెలిపింది. ఆఫర్ ధరల కింద రూ.1,099కి ఎకానమీ క్లాస్, రూ.2,284కు ప్రీమియం ఎకానమీ, రూ.5,775కు బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు ప్రారంభం కాబోతున్నాయని విస్తారా ప్రకటించింది. ఈ స్కీమ్ కింద ఢిల్లీ నుంచి ముంబై మార్గ ఎకానమీ క్లాస్ ఎయిర్ టిక్కెట్లకు రూ.1,920 ధర ఆఫర్ చేస్తున్నామని, రెగ్యులర్ గా అయితే ఈ మార్గంలో ధర రూ.2,743గా ఉంటుందని తెలిపింది. ఢిల్లీ-బెంగళూరు మార్గంలో కూడా రెగ్యులర్ గా ఉన్న రూ.3,093 ధరను, డిస్కౌంట్ ఆఫర్ కింద రూ.2,165కు తగ్గించేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రమోషన్ ఆఫర్ టిక్కెట్ బుక్ చేసుకున్న అందరికీ వర్తిస్తుందని వెల్లడించింది. విస్తారా వెబ్ సైట్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికైతే అదనంగా 5శాతం డిస్కౌంట్ ఆఫర్ ను పొందుతారని తెలిపింది. -
దేశీయ ఎయిర్ లైన్స్‌కు కేంద్రం షాక్?
న్యూఢిల్లీ : ట్రావెల్ సీజన్ లో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో దేశీయ ఎయిర్ లైన్లు అమాంతం పెంచే టిక్కెట్ ధరలపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. పెరిగే ధరలనుంచి ప్యాసెంజర్ల రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కొన్ని పరిస్థితుల్లో దేశీయ ధరలపై విధించిన పరిమిత ఆంక్షలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఏవియేషన్ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే తెలిపారు. పెరిగే ధరల నుంచి ప్యాసెంజర్లకు ఉపశమనం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. పెస్టివల్స్ లాంటి పీక్ సీజన్ లో, ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడూ ఎయిర్ లైన్లు ఎలాంటి అడ్డూ అదుపు లేకుండా ధరలు పెంచుతున్నాయని చౌబే అన్నారు. ఇటీవల చెన్నైకి కలిగిన భారీ వరద ముప్పుతో, సిటీకి దగ్గర్లో ఉన్న ఎయిర్ పోర్ట్ లో ధరలు పెరిగాయని తెలిపారు. పెరిగే ధరలనుంచి వినియోగదారులను ఉపశమనం కల్పించడానికి కన్సూమర్ ఫ్రెండ్లీ విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.. దేశీయ ప్యాసెంజర్లు 15 కేజీల వరకూ కంటే అదనంగా తీసుకెళ్లే లగేజీపై ప్యాసెంజర్లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటోంది. అయితే 15 కేజీలకంటే ఒకటి రెండు కేజీలు అదనంగా తీసుకెళ్లే లగేజీకి సాధారణ ధరల్లో తగ్గింపు ఇవ్వాలని ఎయిర్ లైన్లకు చౌబీ సూచించారు. అదేవిధంగా ల్యాప్ టాప్, లేడీస్ పర్స్ వంటి వాటిని 7కేజీల వరకూ ప్యాసెంజర్లకు తమతో పాటు లోపల తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చేవారు. ఈ వేయింట్ లిమిట్ ను కూడా తగ్గించి కేవలం ఒక్క బ్యాగ్ ను మాత్రమే తీసుకెళ్లేలా నిబంధనలను పరిశీలిస్తున్నామని చౌబే తెలిపారు. ప్యాసెంజర్ ఫ్రెండ్లీ విధానాలపై ప్రజల నుంచి స్పందన వచ్చిన అనంతరం పూర్తి నిబంధనలు తయారుచేసి, అమలుచేస్తామన్నారు. గత కొద్ది కాలంగా ధరల పెరుగుతున్నా పట్టించుకోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీరుపై ప్యాసెంజర్లు విసుగెత్తిపోయారు. దీంతో ఈ కొత్త నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది. -
కొత్త రైళ్లలో బాదుడే..
న్యూఢిల్లీ: రైల్వే చార్జీల పెంపుపై బడ్జెట్ సమావేశంలో నోరైనా మెదపని ప్రభుత్వం తాజాగా రానున్న కొత్త రైళ్లలో సౌకర్యాలను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. హుమ్ సఫర్, తేజాస్, ఉత్ర్కిష్ట్ డబుల్ డెక్కర్, ఉదయ్ వంటి ఈ సంవత్సరం ప్రారంభం కానున్న పలు రైళ్లలో 15 నుంచి 30 శాతం రేట్లను పెంచే ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. 2016-17 బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ రైళ్లన్ని ఏ ప్రతిపాదిత ప్రాంతాల్లో నడపాలనే దాని మీద ఇంకా కసరత్తు నడుస్తోంది. భారతీయ రైల్వేలు ఇప్పటికే సువిధ పేరుతో సమయాన్ని అనుసరించి ధరల మార్పిడితో రైళ్లను నడుపుతున్నాయి. ఎక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో సువిధ రైళ్లను నడపడం వల్ల రైల్వే శాఖ భారీగా లాభాలను అర్జిస్తోంది. హమ్‌సఫర్ రైళ్లలో అన్నీ 3 టైర్ ఏసీ బోగీలు ఉంటాయి. తేజస్ రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కొత్తగా డిజైన్ చేసిన ఉదయ్ డబుల్ డెక్కర్ రైళ్లు 40 శాతం ఎక్కువ మందిని గమ్యస్థానాలకు చేరుస్తాయి. రైల్వేలు తాజాగా పరిచయం చేసిన మహామన ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండటం వల్ల రేట్లు కూడా పెంచారని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
ఈసారి మోత లేకుండానే రైలు కూత?
న్యూఢిల్లీ: త్వరలోనే రైల్వే బడ్జెట్ కూత పెట్టనుంది. అయితే, కానీ ఆ కూత సామాన్యుల గుండెల్లో భయం పుట్టించకపోవచ్చు. ఎందుకంటే ఈసారి రైల్వే ప్రయాణీకుల ఛార్జీలు పెంచడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ బడ్జెట్లో ప్రయాణీకులపై ఎలాంటి బరువులు పెట్టకుండానే రైల్వే బడ్జెట్‌ను పరుగులుపెట్టించేందుకు కేంద్రం ఇప్పటికే అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పది శాతం టికెట్ చార్జీలను పెంచాలని తొలుత భావించిందని, దీనిద్వారా కేవలం రూ.4,500 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరనుండగా.. అది కాస్త ఈ బడ్జెట్‌పై ఉండే సానూకూల దృక్ఫథాన్ని దూరం చేస్తుందని, ప్రజలకు ప్రభుత్వం కోపం వస్తుందని కేంద్రం గ్రహించినట్లు కీలక వర్గాల సమాచారం. అయితే, ఈ మొత్తం ఆదాయాన్ని వేరే ఇతర కార్యకలాపాల ద్వారా, ప్రకటనల ద్వారా రాబట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు రైల్వే ప్రయాణీకులపై ఛార్జీల భారాన్ని మోపింది. గత ఏడాది నవంబర్ లోనే రెండోసారి ఛార్జీలు పెంచింది. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఈసారి వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. -
716 రూపాయలకే విమానం టికెట్
చెన్నై: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవాళీ విమానయాన సంస్థ స్పైస్ జెట్ టికెట్ ధరలపై ఆఫర్లను ప్రకటించింది. కనీస టికెట్ ధరను 716 రూపాయలుగా నిర్ణయించింది. అయితే ఈ ధరకు పన్నులు అదనం. సోమవారం స్పైస్ జెట్ తగ్గించిన టికెట్ల ధరలతో 'హ్యాపీ న్యూ ఇయర్ సేల్'ను ప్రారంభించింది. సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్.. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటుంది. ఆలోగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు బుక్ చేసుకున్నవారు ప్రయాణించడానికి జనవరి 15 నుంచి ఏప్రిల్ 12 వరకు కాలపరిమితి ఉంటుంది. దేశంలో ప్రధాన నగరాల మధ్య స్పైస్ జెట్ విమాన సర్వీసులకు ఈ ఆఫర్లను వర్తింపజేశారు. టికెట్లు కావాల్సిన వారు స్పైస్ జెట్ వెబ్ సైట్, మొబైల్ యాప్, కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకోవచ్చు. -
'పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించాలి'
అనంతపురం: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులు సతమతమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పై మండిపడ్డారు. తాజాగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో సామాన్యులపై మోయలేని భారం పడిందని చాంద్ బాషా అన్నారు. -
ఆర్టీసీ చార్జీల పెంపు తప్పదు
-
త్వరలో ఆర్టీసీ చార్జీల వడ్డన!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణను బూచిగా చూపి బస్సు ప్రయాణికుల జేబులు గుల్ల చేసేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. ఈ క్రమంలో బస్సు చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే, చార్జీలను 15 శాతం పెంచాలన్న ఆర్టీసీ యాజమాన్య ప్రతిపాదనలపై మాత్రం మంత్రివర్గం తర్జనభర్జన పడింది. పల్లె వెలుగు, సిటీ బస్సులను మినహా మిగిలిన బస్సులపై చార్జీల భారం వేయాలని అనుకున్నా.. నిర్ణయాన్ని కొద్దిరోజులపాటు వాయిదా వేశారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు సోమవారం కేబినెట్ మీటింగ్‌లోనే ప్రభుత్వానికి అందించారు. ఈ ప్రతిపాదనలకు యధాతథంగా ఆమోదం తెలిపితే ప్రయాణికులపై రూ.600 కోట్ల మేరకు భారం పడే అవకాశముంది. -
చార్జీలు రెండింతలు
సాక్షి, ముంబై: వేసవి సెలవులకు స్వగ్రామాలకు వెళ్లిన ముంబైకర్లు నగరానికి తిరుగుముఖం పట్టడం ప్రైవేటు బస్సు యజమానులకు వరంగా మారింది. రద్దీ బాగా పెరిగిపోతుండడంతో ఇదే అదనుగా భావించిన వీరంతా ఒక్కసారిగా చార్జీలు పెంచేశారు. రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ దొరక ్కపోతుండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించక తప్పడం లేదు. ఏప్రిల్ నెలలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన సమయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. పాఠశాలలు జూన్ 16 నుంచి ప్రారంభం కానుండడంతో స్వగ్రామాలకు వెళ్లినవారంతా తిరుగుముఖం పట్టారు. ముంబై-క ణకావ్లీ మధ్య రద్దీ లేని సమయంలో చార్జీ కింద రూ.350-400 వసూలుచేసిన ప్రైవేటు బస్సు యజమానులు ఇప్పుడు రూ.750-800 వరకు వసూలు చేస్తున్నారు. ముంబై- ఔరంగాబాద్ మధ్య రద్దీ లేని సమయంలో ఏసీకి రూ.900-1000 వరకు వసూలు చేయగా ఇప్పుడు రూ.1200-1300 వరకు వసూలు చేస్తున్నారు. ఇక నగరం నుంచి నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల దిశగా బస్సులను నడిపే ఆపరేటర్లు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ముంబై-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్ మినహా నిజామాబాద్ నుంచి ముంైబె కి నేరుగా వచ్చే రైళ్లు లేవు. దీంతో దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలుకు విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక సీజన్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వెయిటింగ్ లిస్టు సంఖ్య 400కి చేరుకుంటున్నప్పటికీ టికెట్లను కొనుగోలు చేయడానికి సైతం వెనకాడడం లేదు. అందులో ఎక్కేందుకు స్థలం దొరికితే చాలని ప్రయాణికులు అనుకుంటారు. ఇక చేసేదేమీలేక మరికొందరు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు బస్సు యజమానులు అందినంత దోచుకుంటున్నారు రద్దీలేని సమయాల్లో చార్జీ కింద రూ.600-700, అదే జూన్ తరువాత అయితే రూ.900-950 వరకు వసూలు చేస్తున్నారు. -
బాప్రే.. బస్సు!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఉద్యమాలు.. విపత్తులు.. డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో జీవనం దుర్భరంగా మారిన సగటు జీవిపై ఆర్టీసీ తన వంతు భారం మోపింది. ప్రజా రవాణా వ్యవస్థను మోయాల్సింది సగటు ప్రయాణికుడేనని తేల్చి చెప్పింది. సగటున పది శాతం పెంపుదలతో అన్ని రకాల బస్సుల చార్జీలను పెంచేసింది. ఆర్టీసీ ప్రయాణికులపై ప్రభుత్వం భారం మోపింది. పాసింజర్ నుంచి ఏసీ బస్సు వరకూ చార్జీలను పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇటీవలే రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడంతో చార్జీలు పెరగవని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా ప్రయాణికులపై భారం మోపారు. విశాఖపట్నం నాన్‌స్టాప్ లగ్జిరీ బస్సుచార్జి ప్రస్తుం 95 రూపాయలు ఉండగా రూ. 105కు పెరిగింది. ఎక్స్‌ప్రెస్ రూ. 85 నుంచి రూ. 94, ఇంద్ర ఏసీ రూ. 135 నుంచి 150 రూపాయలకు పెరిగింది. పాలకొండకు పల్లెవెలుగు బస్సుకు రూ.27 ఉండగా అది 29 రూపాయలకు, రూ. 31 ఉన్న ఎక్స్‌ప్రెస్ చార్జి 35 రూపాయలకు పెరిగింది. విజయనగరం ఎక్స్‌ప్రెస్ రూ. 55 నుంచి 60 రూపాయలకు, పల్లె వెలుగు రూ. 42 నుంచి 45 రూపాయలకుపెరిగింది. రాజాంకు ఇది వరలో ఎక్స్‌ప్రెస్‌కు రూ. 35 ఉండగా 40 రూపాయలకు, పల్లె వెలుగు రూ. 28లు ఉండగా 30 రూపాయలకు పెరిగింది. ఆమదాలవలసకు ప్రస్తుతం ఉన్న 11 రూపాయల చార్జి రూ.12కు, శ్రీకూర్మానికి రూ. 9 నుంచి పది రూపాయలకు, కళింగపట్నానికి రూ. 14 ఉండగా 15 రూపాయలకు పెరిగింది. ఇదిలా ఉంటే కనీస చార్జిని ఏమాత్రం పెంచని ప్రభుత్వం పల్లె వెలుగు బస్సుకు కిలోమీటర్‌కు 4 పైసలు, ఎక్స్‌ప్రెస్‌కు 7 పైసలు, డీలక్స్ బస్సుకు కిలోమీటర్‌కు 9 పైసలు, సూపర్ లగ్జరీకి 11 పైసలు, ఇంద్ర ఏసీ బస్సుకు 12 పైసలు, గరుడ ఏసీ 15 పైసల చొప్పున పెంచారు.