దేశీయ ఎయిర్ లైన్స్కు కేంద్రం షాక్?
న్యూఢిల్లీ : ట్రావెల్ సీజన్ లో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో దేశీయ ఎయిర్ లైన్లు అమాంతం పెంచే టిక్కెట్ ధరలపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. పెరిగే ధరలనుంచి ప్యాసెంజర్ల రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కొన్ని పరిస్థితుల్లో దేశీయ ధరలపై విధించిన పరిమిత ఆంక్షలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఏవియేషన్ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే తెలిపారు. పెరిగే ధరల నుంచి ప్యాసెంజర్లకు ఉపశమనం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. పెస్టివల్స్ లాంటి పీక్ సీజన్ లో, ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడూ ఎయిర్ లైన్లు ఎలాంటి అడ్డూ అదుపు లేకుండా ధరలు పెంచుతున్నాయని చౌబే అన్నారు. ఇటీవల చెన్నైకి కలిగిన భారీ వరద ముప్పుతో, సిటీకి దగ్గర్లో ఉన్న ఎయిర్ పోర్ట్ లో ధరలు పెరిగాయని తెలిపారు.
పెరిగే ధరలనుంచి వినియోగదారులను ఉపశమనం కల్పించడానికి కన్సూమర్ ఫ్రెండ్లీ విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.. దేశీయ ప్యాసెంజర్లు 15 కేజీల వరకూ కంటే అదనంగా తీసుకెళ్లే లగేజీపై ప్యాసెంజర్లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటోంది. అయితే 15 కేజీలకంటే ఒకటి రెండు కేజీలు అదనంగా తీసుకెళ్లే లగేజీకి సాధారణ ధరల్లో తగ్గింపు ఇవ్వాలని ఎయిర్ లైన్లకు చౌబీ సూచించారు.
అదేవిధంగా ల్యాప్ టాప్, లేడీస్ పర్స్ వంటి వాటిని 7కేజీల వరకూ ప్యాసెంజర్లకు తమతో పాటు లోపల తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చేవారు. ఈ వేయింట్ లిమిట్ ను కూడా తగ్గించి కేవలం ఒక్క బ్యాగ్ ను మాత్రమే తీసుకెళ్లేలా నిబంధనలను పరిశీలిస్తున్నామని చౌబే తెలిపారు. ప్యాసెంజర్ ఫ్రెండ్లీ విధానాలపై ప్రజల నుంచి స్పందన వచ్చిన అనంతరం పూర్తి నిబంధనలు తయారుచేసి, అమలుచేస్తామన్నారు. గత కొద్ది కాలంగా ధరల పెరుగుతున్నా పట్టించుకోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీరుపై ప్యాసెంజర్లు విసుగెత్తిపోయారు. దీంతో ఈ కొత్త నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది.