716 రూపాయలకే విమానం టికెట్ | SpiceJet offering airfares starting at Rs 716 | Sakshi
Sakshi News home page

716 రూపాయలకే విమానం టికెట్

Published Mon, Dec 28 2015 6:42 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

716 రూపాయలకే విమానం టికెట్

716 రూపాయలకే విమానం టికెట్

చెన్నై: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవాళీ విమానయాన సంస్థ స్పైస్ జెట్ టికెట్ ధరలపై ఆఫర్లను ప్రకటించింది. కనీస టికెట్ ధరను 716 రూపాయలుగా నిర్ణయించింది. అయితే ఈ ధరకు పన్నులు అదనం. సోమవారం స్పైస్ జెట్ తగ్గించిన టికెట్ల ధరలతో 'హ్యాపీ న్యూ ఇయర్ సేల్'ను ప్రారంభించింది.

సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్.. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటుంది. ఆలోగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు బుక్ చేసుకున్నవారు ప్రయాణించడానికి జనవరి 15 నుంచి ఏప్రిల్ 12 వరకు కాలపరిమితి ఉంటుంది. దేశంలో ప్రధాన నగరాల మధ్య స్పైస్ జెట్ విమాన సర్వీసులకు ఈ ఆఫర్లను వర్తింపజేశారు. టికెట్లు కావాల్సిన వారు స్పైస్ జెట్ వెబ్ సైట్, మొబైల్ యాప్, కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement