plane tickets
-
టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన విమాన టికెట్లు ఫ్రీ
న్యూడిల్లీ: కోవిడ్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా టూరిజానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఆంక్షల సడలింపు, ప్రస్తుతం నెలకొన్న సాధారణ పరిస్థితుల నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు పలు దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ హాంకాంగ్ టూరిస్టులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5 లక్షల విమాన టిక్కెట్లను ఉచితంగా అందించాలని హాంకాంగ్ టూరిజం బోర్డు నిర్ణయించింది. సుమారు రూ. 2,083 కోట్లు (254.8 మిలియన్ డాలర్లు) విలువైన విమాన టికెట్లను ఉచితంగా ఆఫర్ చేయనుంది. ఇదీ చదవండి : చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు కోవిడ్-19 ఆంక్షలను తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, ఉచిత విమాన టిక్కెట్ల ప్రకటనల ప్రచారాలను రూపొందిస్తామని హాంకాంగ్ టూరిజం బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేన్ చెంగ్ మీడియాకు తెలిపారు. కేథే ఫసిఫిక్, కేథే డ్రాగన్, హాంకాంగ్ ఎయిర్‌లైన్స్, హాంకాంగ్ ఎక్స్‌ప్రెస్ లాంటి క్యారియర్ల ద్వారా ఈ టికెట్లను అందించనుంది. టిక్కెట్ల పంపిణీని హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్వహిస్తుందని హాంకాంగ్ టూరిజం బోర్డు ప్రతినిధి వెల్లడించారు. (Infosys: మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు, కోర్టులో ఇన్ఫోసిస్‌కు షాక్) కాగా కరోనా సమయంలో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేసింది. ముఖ్యంగా హాంకాంగ్ చేరిన మూడు రోజుల తర్వాత బహిరంగ ప్రదేశాలకు వారి కదలికలను పరిమితం చేసేలా రెండు వారాల హోటల్ క్వారంటైన్ తప్పని సరిచేసింది. సెప్టెంబరులో ఈ కరోనా ఆంక్షలు సడలించినప్పటికీ, పర్యాటకుల సంఖ్య తగినంత పుంజుకోకపోవడంతో హాంకాంగ్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమచారం. దీనికి తోడు ఉక్రెయిన్ యుద్ధం, రష్యా గగనతలం మూత కారణంగా హాంకాంగ్ నుండి లండన్‌లోని హీత్రూకి దాదాపు రెండు గంటల సమయం పడుతోందట. ఈ సమస్యల కారణంగా హాంకాంగ్‌లో తన కార్యకలాపాలను నిలిపివేస్తామని బ్రిటిష్ ఎయిర్‌లైన్ వర్జిన్ అట్లాంటిక్ బుధవారం తెలిపింది. అలాగే అనేక విమానయాన సంస్థలు విమానాలను నిలిపివేసాయి లేదా ఆ ప్రాంతంపై ప్రయాణించకుండా ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకున్నాయి. ఇటీవలి గణాంకాలు ప్రకారం ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల(2022, జనవరి- ఆగస్టు) మధ్య హాంకాంగ్‌కు కేవలం 183,600 మంది మాత్రమే సందర్శకులు వచ్చారు. మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలే. కానీ కరోనా ముందు (2019) నాటి 56 మిలియన్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే హోటల్ క్వారంటైన్ నిబంధనలను తొలగించిన అక్కడి ప్రభుత్వం ఇన్‌బౌండ్ ప్రయాణికులపై మిగిలిన ఆంక్షలను కూడా రద్దు చేయాలని భావిస్తోంది. ఫలితంగా రానున్న ఒకటి లేదా రెండు త్రైమాసికాలలో పర్యాటకులు తమ దేశానికి తిరిగి వస్తారని అంచనా వేస్తోంది. (ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త!) -
దేశం వీడి పారిపోతున్న రష్యన్లు.. లక్షలు వెచ్చించి విమాన టికెట్లు కొనుగోలు
మాస్కో: యుద్ధానికి సిద్ధం కావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల అధికారిక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మరునాటి నుంచే చాలా మంది రష్యన్లు దేశం వీడి పారిపోతున్నారు. కొద్ది రోజుల్లో దేశ సరిహద్దులు మూసివేస్తారని తెలిసి రూ.లక్షలు ఖర్చు చేసి మరీ విమాన టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సంపన్నులు ఎంత ఖర్చయినా లెక్క చేయకుండా ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. ఇదే అదనుగా భావించిన విమాన సంస్థలు టికెట్ల ధరలు, ప్రైవేటు జెట్ల ఛార్జీలను భారీగా పెంచాయి. ఆర్మేనియా, టర్కీ, అజర్బైజన్ వంటి దేశాలకు రష్యా పౌరులు వీసా లేకుండానే వెళ్లవచ్చు. దీంతో ఆయా దేశాలకు ఛార్జీలను ఏకంగా 20వేల పౌండ్ల(రూ.17.5లక్షలు) నుంచి 25వేల పౌండ్ల(రూ.22లక్షలు) మధ్య నిర్ణయించాయి విమానయాన సంస్థలు. 8 సీట్ల ప్రైవేటు జెట్ విమానానికి ఏకంగా రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ ఛార్జీలతో పోల్చితే ఇది చాలా రెట్లు అధికం. ఛార్జీలు ఇంత అధికంగా ఉన్నా రష్యన్లు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. యుద్ధంలో పాల్గొనకుండా హాయిగా బతికేందుకు డబ్బు గురించి ఆలోచించకుండా దేశం వీడి పారిపోతున్నారు. పుతిన్ ప్రకటన తర్వాత ఇప్పటికే 2.6లక్షల మంది రష్యన్లు దేశాన్ని వీడినట్లు కీవ్‌కు చెందిన వార్తా సంస్థ తెలిపింది. ఇంతకుముందు తమకు రోజుకు 50 మంది నుంచి మాత్రమే విజ్ఞప్తులు వచ్చేవని, కానీ ఇప్పుడు రోజుకు 5వేల మంది టికెట్ల కోసం ఫోన్లు చేస్తున్నారని ఓ జెట్ కంపెనీ డైరెక్టర్ తెలిపాడు. తమ జెట్లలో అత్యంత చౌకైన టికెట్ ధర రూ.2.6లక్షలు అని చెప్పాడు. డిమాండ్ విపరీతంగా ఉందని, ప్రస్తుత పరిస్థితి క్రేజీగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఐరోపా విమానయాన సంస్థలు ప్రస్తుతం సేవలు అందించడం లేదని, అందుకే డిమాండ్ ఇంతగా పెరిగిందని వివరించాడు. చదవండి: 'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత -
విమాన టికెట్ ధరలకు రెక్కలు
గన్నవరం: కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్లుగా దేశీయ విమాన సర్వీసులు పెరగకపోవడంతో టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్, బెంగళూరు విమాన చార్జీలయితే విపరీతంగా పెరిగిపోయాయి. 2020 ఫిబ్రవరి వరకు దేశంలోని వివిధ నగరాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి రోజుకు 36 రూట్లలో 72 సర్వీసులు తిరిగేవి. సుమారుగా 3,600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. కోవిడ్ పరిస్థితులతో రోజువారీ సర్వీసుల సంఖ్య 32కు, ప్రయాణికుల సంఖ్య 2,200కు పడిపోయింది. సెకండ్ వేవ్ సమయంలో ప్రయాణికుల్లేక స్పైస్‌జెట్, ట్రూజెట్ సంస్థలు తమ సర్వీసులను పూర్తిగా రద్దు చేసుకున్నాయి. ఎయిరిండియా, ఇండిగో సంస్థలు మాత్రమే ఇక్కడికి సర్వీసులు నడుపుతున్నాయి. ఎయిరిండియా సంస్థ న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నుంచి రోజుకు 6 నుంచి 8 సర్వీసులు తిప్పుతోంది. మిగిలిన 24 సర్వీసులూ ఇండిగో సంస్థే నడుపుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు సర్వీసులకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ రూట్లలో ఇండిగో ప్రతిరోజూ విజయవాడ–బెంగళూరు మధ్య 8, విజయవాడ–హైదరాబాద్ మధ్య మరో 8 సర్వీసులు నడుపుతోంది. ఈ రూట్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని ఆ సంస్థ సొమ్ము చేసుకుంటోంది. దీంతో ఈ రూట్లలో ప్రయాణం చేయాలంటే టికెట్‌కు రూ.10 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రూట్లలో ఇతర ఎయిర్‌లైన్స్ సర్వీసులు పెద్దగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని వారు పేర్కొంటున్నారు. దీనిపై ఎంపీ బాలశౌరి స్పందిస్తూ.. ఈ రూట్లలో ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా సర్వీసులు నడిపే విధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని చెప్పారు. సంప్రదింపులు జరుపుతున్నాం.. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమాన సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. – పీవీ రామారావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
ఇండిగో వింటర్ సేల్ : ఆఫర్లో 10 లక్షల టికెట్లు
సాక్షి,ముంబై: బడ్జెట్ క్యారియర్ ఇండిగో తక్కువ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. వింటర్ సేల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక విక్రయాల్లో రూ.899 (అన్నీ కలుపుకొని) లకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ప్రమోషనల్ ఆఫర్‌గా నిర్వహిస్తున్నఈ సేల్‌లో దాదాపు 10లక్షల సీట్లను ఆఫర్ చేస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్టు ఇండిగో వెల్లడించింది. అంతర్జాతీయంగా 3199 రూపాయలకు టికెట్లను అందిస్తోది. నవంబరు 21 నుంచి 25 వ తేదీలోపు బుక్ చేసుకున్న టికెట్ల మాత్రమేఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా డిసెంబరు 6, 2018 నుంచి ఏప్రిల్ 15, 2019 వరకు ప్రయాణించే అవకాశం. Our Sale will make you feel all warm and fuzzy inside, So kick start winters with fares starting ₹899. Book your flights today! https://t.co/sngmgCNgEH pic.twitter.com/EA0RbeMg1g — IndiGo (@IndiGo6E) November 21, 2018 -
విమాన టికెట్ ధరలపై డిస్కౌంట్
దీపావళి పండగ సందర్భంగా ఎయిర్ ఏషియా విమాన సంస్థ టికెట్ల ధరలపై ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికులకు టికెట్ ధరలపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఆదివారం ఎయిర్ ఏషియా యాజమాన్యం వెల్లడించింది. జూలై 18 నుంచి నవంబర్ 24 మధ్యకాలంలో ప్రయాణించేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రమోషన్ కాంపెయిన్ ఈ నెల 17 వరకు నిర్వహిస్తామని తెలిపారు. భారత్, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ విమాన సర్వీసులలో డిస్కౌంట్ ధరలు వర్తిస్తాయని ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో అమర్ అబ్రోల్ చెప్పారు. -
విమాన టికెట్ల ధరలపై డిస్కౌంట్
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా మరోసారి ఆఫర్లను ప్రకటించింది. దేశవాళీ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో టికెట్ల ధరలపై డిస్కౌంట్ ఆఫర్ చేసింది. అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది నుంచి మే 22 మధ్యకాలంలో ప్రయాణించడానికి డిస్కౌంట్ ధరలతో కూడిన విమాన టికెట్లను సోమవారం నుంచి ఈ నెల 13 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బెంగళూరు, విశాఖపట్నం, గువహటి, కోచి, ఇంపాల్, పనాజీ, ఢిల్లీ వంటి నగరాల మధ్య దేశవాళీ సర్వీసుల్లో కనీస ధర 1099 రూపాయల నుంచి టికెట్లను అందుబాటులో ఉంచారు. కోచి నుంచి చెన్నై లేదా హైదరాబాద్ మీదుగా మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు 2999 రూపాయల నుంచి టికెట్ ధరలను ఎయిర్ ఏషియా ఆఫర్ చేసింది. ఇక చెన్నై నుంచి బెంగళూరు మీదుగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు 3999 రూపాయల నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. -
716 రూపాయలకే విమానం టికెట్
చెన్నై: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవాళీ విమానయాన సంస్థ స్పైస్ జెట్ టికెట్ ధరలపై ఆఫర్లను ప్రకటించింది. కనీస టికెట్ ధరను 716 రూపాయలుగా నిర్ణయించింది. అయితే ఈ ధరకు పన్నులు అదనం. సోమవారం స్పైస్ జెట్ తగ్గించిన టికెట్ల ధరలతో 'హ్యాపీ న్యూ ఇయర్ సేల్'ను ప్రారంభించింది. సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్.. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటుంది. ఆలోగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు బుక్ చేసుకున్నవారు ప్రయాణించడానికి జనవరి 15 నుంచి ఏప్రిల్ 12 వరకు కాలపరిమితి ఉంటుంది. దేశంలో ప్రధాన నగరాల మధ్య స్పైస్ జెట్ విమాన సర్వీసులకు ఈ ఆఫర్లను వర్తింపజేశారు. టికెట్లు కావాల్సిన వారు స్పైస్ జెట్ వెబ్ సైట్, మొబైల్ యాప్, కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకోవచ్చు. -
నకిలీ వీసా, విమాన టికెట్ల ముఠాపై కేసు నమోదు
భీమారం(వరంగల్ జిల్లా): నకిలీ వీసా, విమాన టికెట్లు సృష్టించిన ఓ ముఠాపై మంగళవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు..నగర పరిధిలోని పలివేల్పులకు చెందిన కె.సచిన్‌గౌడ్, సురేష్‌గౌడ్ ఏడాదిన్నర క్రితం స్థానికంగా ఓ బ్రోకర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కెనడాతో పాటు ఇతర ప్రాంతాలకు పంపిస్తామని కరపత్రాలతో ప్రచారం చేయడమే కాకుండా బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈక్రమంలో వారికి నయీంనగర్ ప్రాంతానికి చెందిన పి.సుమన్, ప్రవీణ్‌కుమార్ పరిచయమయ్యారు. కెనడాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల గురించి వారు తెలుసుకున్నారు. తమను కూడా కెనడాకు పంపించాలని కోరగా... వారు ఒక్కొక్కరికి రూ.6.50లక్షలు చెల్లించమని చెప్పారు. అందుకు ఉద్యోగం, వీసా... విమాన టికెట్లు ఇప్పించే బాధ్యత పూర్తిగా తమదేనన్నారు.డబ్బులు తీసుకున్న తర్వాత వీసా, విమాన టికెట్ల కోసం కాలయాపన చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. బాధితుల నుంచి తప్పించుకోవడం కోసం సచిన్, సురేష్‌గౌడ్‌లు కొత్త ఎత్తు వేశారు. నకిలీ వీసా, విమాన టికెట్లు సృష్టించారు. టికెట్లు, వీసాపై అనుమానంతో బాధితులు వాటిపై విచారించారు. ఇచ్చిన వీసా, టిక్కెట్లు నకిలీవిగా తేలడంతో కాకతీయ యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అలీ తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు. -
'విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేశాం'
ఢిల్లీ:విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేస్తున్నట్లు కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. కొత్త పౌర విమానయాన విధానంపై ఆయన మీడియాకు పలువిషయాలు వెల్లడించారు. ప్రభుత్వ ప్రవేశపెట్టబోయే కొత్త పౌర విమానయాన విధానంపై ప్రజల సూచనలు స్వీకరిస్తామని ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు తెలిపారు.భూసేకరణ తర్వాత విజయవాడ ఎయిర్ పోర్ట్ లో రన్ వే విస్తరణ ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఎయిర్ పోర్ట్ లపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని ఆయన తెలిపారు. కొత్త పౌరవిమానయాన విధానంలో విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేస్తున్నామని, దీనివల్ల అతిచౌకగా విమాన టికెట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.