'విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేశాం' | price of plane tickets based on market , ashok gajapathi raju says | Sakshi
Sakshi News home page

'విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేశాం'

Published Mon, Nov 10 2014 1:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

'విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేశాం'

'విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేశాం'

ఢిల్లీ:విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేస్తున్నట్లు కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. కొత్త పౌర విమానయాన విధానంపై ఆయన మీడియాకు పలువిషయాలు వెల్లడించారు. ప్రభుత్వ ప్రవేశపెట్టబోయే కొత్త పౌర విమానయాన విధానంపై ప్రజల సూచనలు స్వీకరిస్తామని ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు తెలిపారు.భూసేకరణ తర్వాత విజయవాడ ఎయిర్ పోర్ట్ లో రన్ వే విస్తరణ ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

అయితే తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఎయిర్ పోర్ట్ లపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని ఆయన తెలిపారు. కొత్త పౌరవిమానయాన విధానంలో విమాన టికెట్ల ధరలను మార్కెట్ శక్తులకే వదిలేస్తున్నామని, దీనివల్ల అతిచౌకగా విమాన టికెట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement