ashok gajapathi raju
-
అశోక్ గజపతి రాజుపై మండిపడ్డారు వైఎస్సార్
-
ప్రజల వినోదాన్ని బలహీనతగా మారుస్తారా?
విజయనగరం అర్బన్: ప్రజల వినోదాన్ని బలహీనతగా మార్చుకొని ఇష్టానుసారం టికెట్ల ధరలు పెంచడం సమంజసం కాదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. టికెట్ ధర రూ.500కు పెంచితే జనంపై ఒత్తిడి పెంచినట్టు కాదా అని ప్రశ్నించారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా టికెట్ల ధరలపై విలేకరులు ప్రశ్నించగా.. సినిమా టిక్కెట్ల ధరలను అడ్డగోలుగా పెంచడం సరికాదని అన్నారు. అందరి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు. సినిమా టికెట్లపై ప్రభుత్వం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుందని, ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి తెలియజేయాలని థియేటర్ల నిర్వాహకులకు సూచించారు. బిస్కెట్లు, సబ్బులకు ఎమ్మార్పీ రేట్లు ఉన్నప్పుడు సినిమా టికెట్లకు ఉంటే తప్పు ఏమిటని నిలదీశారు. సమస్యకు పరిష్కారం ఉండే మార్గంలో వెళ్లడం మంచిదని అన్నారు. అశోక్ చెప్పినవి అసత్యాలు రామతీర్థం బోడికొండపై కోదండరామస్వామి ఆలయం నిర్మాణానికి పవిత్రమైన శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అసత్యాలు చెబుతున్నారని బొత్స చెప్పారు. నిబంధనల మేరకే ఆలయ శంకుస్థాపనను దేవదాయశాఖ చేపట్టిందన్నారు. కార్యక్రమం వివరాలను ముందుగా తెలియజేసేందుకు వెళ్లిన ఆ శాఖ సిబ్బందిని అశోక్ దుర్భాషలాడారని, ప్రొటోకాల్ ప్రకారం ధర్మకర్తగా ఆయన పేరు పెట్టిన శిలాఫలకాన్ని కూడా చిందరవందర చేశారని వివరించారు. గర్భగుడుల్లో శిలాఫలకాలు వేయకూడదని ఉన్నప్పుడు, చంద్రబాబు పాలనలో జరిగిన వాటి గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. బాధ్యత గల ధర్మకర్త అయితే ఆలయం అభివృద్ధికి కృషి చేస్తారని, ఆయన ఆ దిశగా ఏనాడూ పనిచేయలేదని విమర్శించారు. టీడీపీ పాలనలో ఒక్కపైసా వెచ్చించే ఆలోచన చేయని ధర్మకర్త ఆయనేనంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.4 కోట్లు ఖర్చు చేస్తుంటే, అభివృద్ధి జరగనీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విగ్రహాలను టీటీడీ ఉచితంగా ఇస్తున్న సమయంలో ప్రత్యేకించి విగ్రహాల కోసం మాత్రమే అని ఇచ్చిన రూ.లక్ష చెక్కును తిరిగి పంపాల్సి వచ్చిందన్నారు. దుర్బుద్ధితో మీడియా ముందే ఆయన ఇలా ప్రవర్తించారని మండిపడ్డారు. -
‘మాన్సాస్’ నుంచి నన్ను తప్పించండి
విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్‌పై సర్వాధికారాల కోసం కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆరాటపడుతున్నారా? ఈ విషయంలో అధికారులపై తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నారా?.. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిబద్ధతతో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన మాన్సాస్ ట్రస్ట్ ఈవో డి. వెంకటేశ్వరరావుకు కనీస సహకారం అందించకపోగా.. తాము చెప్పినట్లే నడుచుకోవాలంటూ ట్రస్ట్ చైర్మన్ వర్గాల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోంది. ఇది తట్టుకోలేని ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు గత నెల 31న రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా విధులు నిర్వహిస్తున్న తనను వ్యక్తిగత సమస్యల కారణంగా తిరిగి రెవెన్యూ విభాగానికి పంపించాలంటూ లేఖలో కోరారు. అప్పటి నుంచి ఈవో టార్గెట్? గత తొమ్మిది నెలలుగా ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు తిరిగి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ట్రస్ట్ సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యానికి ఈవోయే కారణమంటూ అశోక్‌గజపతిరాజు వర్గీయులు ఉద్యోగులందరినీ రెచ్చగొట్టారు. ఆయనపై భౌతికదాడి చేయించేందుకు సైతం సిద్ధమైనట్లు కూడా ఆరోపణలున్నాయి. కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ అధికారులు అడిగిన రికార్డులు అందిస్తాం ∙సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ఆస్తుల జాబితా నుంచి టీడీపీ ప్రభుత్వ హయాంలో 862.22 ఎకరాలు తప్పించడంపై విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతోందని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. వారు అడిగిన రికార్డులను దేవస్థానం తరఫున అందజేస్తామని చెప్పారు. సింహాచలం దేవస్థానం కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రికార్డుల నుంచి భూములు ఎలా తొలగింపునకు గురయ్యాయని అధికారులు అడిగారన్నారు. అలాగే ఆ భూములు ఏ పట్టా ప్రకారం దేవస్థానానికి దఖలు పడ్డాయన్న విషయంపై లిఖితపూర్వకంగా వివరాలు ఇవ్వాలని అధికారులు కోరారని తెలిపారు. అప్పటి ఈవో హయాంలో జరిగిన ఫిక్స్డ్ డిపాజిట్లు, కోర్టు కేసులు, తదితర వివరాలను కూడా విజిలెన్స్ అధికారులు అడిగారని చెప్పారు. ఇప్పటికే భూములకు సంబంధించిన రిపోర్టు సిద్ధంగా ఉందన్నారు. ఎఫ్డీలు, కోర్టు కేసుల నివేదికను తయారు చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం రిపోర్టు అందజేస్తామన్నారు. -
మాన్సాస్‌లో ఆడిట్ మంచిదే
సాక్షి, అమరావతి: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (మాన్సాస్) ట్రస్ట్ వ్యవహారాలపై ఆడిట్ నిర్వహించడంలో ఏమాత్రం తప్పులేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజలతో ముడిపడి ఉన్న ఇలాంటి ట్రస్ట్‌ల వ్యవహారాలపై ఆడిట్ నిర్వహించడం వల్ల మరింత బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని, మాన్సాస్‌లో ఆడిట్ జరిగి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆడిట్ నిర్వహిస్తే అభ్యంతరం ఏమిటని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజును న్యాయస్థానం ప్రశ్నించింది. పారదర్శకత కోసం ఆడిట్ మంచిదేనని, విజయనగరం జిల్లా ఆడిట్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆడిట్‌ను కొనసాగనివ్వాలని ఆదేశించింది. మాన్సాస్ ట్రస్ట్‌కు పాలక మండలిని ఏర్పాటు చేస్తూ గత ఏడాది మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 75 అమలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. జీవో 75ని రద్దు చేయాలంటూ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ మంగళవారం విచారణ జరిపారు. కమిటీల పని కమిటీలదే... ప్రభుత్వ కౌంటర్ లేకుండా జీవో 75 విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవోపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రస్ట్ కార్యకలాపాల విషయాల్లో ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీలను వాటి పని వాటిని చేసుకోనివ్వాలని స్పష్టం చేసింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోరాదని ట్రస్ట్ ఈవోను హైకోర్టు ఆదేశించింది. విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపు విషయంలో జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. ఆయా బ్యాంకుల్లో ట్రస్ట్ ఖాతాలను స్తంభింపచేస్తూ బ్యాంకులకు ఈవో పంపిన ఆదేశాల అమలును నిలుపుదల చేసింది. రోజువారీ నిర్వహణ నిమిత్తం ట్రస్ట్ విద్యా సంస్థల తరఫున వచ్చే చెక్కులను ఆమోదించాలని బ్యాంకులను హైకోర్టు ఆదేశించింది. పాలక మండలి సమావేశం నిర్వహించాల్సిందిగా చైర్మన్‌ను కోరుతూ ఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును కూడా హైకోర్టు నిలిపివేసింది. ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ట్రస్ట్ ఈవో, ఈవో డి.వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాల్సిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 23కి వాయిదా వేసింది. 2004లో చివరిసారిగా ఆడిట్.. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా సంచయిత నియామకాన్ని, ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యుల నియామక జీవోలను హైకోర్టు రద్దు చేసినందున పాలక మండలి మనుగడలో లేనట్లేనని అశోక్ గజపతిరాజు తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపించారు. చట్ట నిబంధనల మేరకే ఈవో నడుచుకుంటున్నారని, ట్రస్ట్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ పాలక మండలి ఆధ్వర్యంలోనే తీసుకోవాల్సి ఉంటుందని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు చట్టం అనుమతించదన్నారు. 2004లో చివరిసారిగా ఆడిట్ నిర్వహించారని, అప్పటి నుంచి మళ్లీ ఆడిట్ చేయలేదని అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి, ఈవో తరఫు న్యాయవాది ఎ.మాధవరెడ్డి న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. -
‘మాన్సాస్’ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా!
చీపురుపల్లి: మాన్సాస్ ట్రస్టు ముసుగులో ప్రజల ఆస్తులను దశాబ్దాల తరబడి అనుభవిస్తుండటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు బహిరంగచర్చకు రావాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సవాల్ విసిరారు. చీపురుపల్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్టు ఆస్తుల రికార్డులతో అశోక్‌గజపతిరాజు ప్రజావేదికకు రావాలని, అక్రమాలపై పూర్తి ఆధారాలతో తాము వస్తామని చెప్పారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంవల్ల ప్రజలకు నష్టం జరగదని, అశోక్‌గజప తిరాజు అక్రమాలకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ట్రస్టు భూముల్ని విక్రయించడానికి, తాకట్టు పెట్టడానికి చట్టం అనుమతించకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బ్రిటిష్ పరిపాలన అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి జమిందారీ, రాజ వ్యవస్థలకు భూములు వచ్చాయన్నారు. ఆ భూములు ప్రజలకే చెందాలన్న ఆశయంతో 1948లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్, 1956లో టీనాం భూముల చట్టం ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అయినప్పటికీ రాజ వంశీయుల వద్దే వేలాది ఎకరాల భూములు ఉండిపోవడంతో 1972లో ఇందిరా గాంధీ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు ప్రజలకు చెందాలని ఆదేశాలిచ్చారన్నారు. ఈ చట్టం ప్రకారం రాజ వంశీయులు 3 వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందన్నారు. అదే సమయంలో విజయనగరం రాజ వంశీయులు 8,850 ఎకరాల భూములు వారి వద్ద ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారని గుర్తుచేశారు. అందులో నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 3 వేల ఎకరాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ భూములు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే 1973లో మాన్సాస్ ట్రస్టును స్థాపించారని ఆరోపించారు. అయినప్పటికీ రాజవంశీయులు దురుద్దేశంతో మాన్సాస్‌కు చెందిన 38వ నంబర్ రికార్డును ట్యాంపరింగ్ చేసి, 43వ నంబర్ రికార్డు సృష్టించి మాన్సాస్ వద్ద 14,450 ఎకరాలు ఉన్నట్టుగా తప్పుదోవ పట్టించారన్నారు. మెడికల్ కళాశాల పేరుతో మాన్సాస్ ట్రస్టు నుంచి 200 ఎకరాలు విక్రయించారని, ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్‌పై విచారణ నిర్వహిస్తోందని ఎంపీ బెల్లాన పేర్కొన్నారు. -
‘మాన్సాస్’లో మరో మాయ
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో వివిధ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో ఉంచేందుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తున్న రోజులవి. 2016 ఏప్రిల్ 11వ తేదీ.. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ధర్మపురి రెవెన్యూ గ్రామ పరిధిలో గల 474.44 ఎకరాల భూములు మాన్సాస్ ట్రస్టుకు చెందనవిగా పేర్కొంటూ అప్పటి ట్రస్టు ఈవో ఆ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం జిల్లా అసిస్టెంట్ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ ద్వారా ఆ భూములకు ఎటువంటి ప్రైవేట్ రిజిస్ట్రేషన్లు జరగడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేర్చాలంటూ లేఖ రాశారు. ఇది జరిగిన ఏడాదికే.. 2017 ఏప్రిల్ 19వ తేదీన ధర్మపురి రెవెన్యూ గ్రామంలో మాన్సాస్ ట్రస్టు భూములుగా నిర్ధారించిన 474.44 ఎకరాల భూములలో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్‌కు అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ లేఖ రాశారు. అవి ట్రస్టు భూములని పేర్కొన్నప్పుడు, అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తిరిగి లేఖ రాసినప్పుడు దేవదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నది ఒక్కరే. మొత్తంగా ఏదో మాయ చేసినట్టుగా.. ట్రస్టు ఆస్తుల జాబితా నుంచి బాగా ఖరీదైన 145.78 ఎకరాల భూములు ఎగిరిపోయాయి. మాన్సాస్ ట్రస్టుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 14,418 ఎకరాల భూములుండగా.. 2015–16, 2018–19లలో 150 ఎకరాలను మెడికల్ కళాశాల–ఆస్పత్రి పేరుతో విక్రయించేసిన బాగోతం ఇప్పటికే వెలుగు చూసిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా కొత్తవలస, చిప్పాడ, బాకురపాలెం, డాబా గార్డెన్స్, సంతపేటలో ఉడా ద్వారా ఆ 150 ఎకరాలను విక్రయించగా రూ.120 కోట్లు వచ్చిందని ట్రస్టు లెక్క చూపించింది. సింహచలం శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం, మాన్సాస్ ట్రస్టు భూములకు సంబంధించి టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు పాత రికార్డులు పరిశీలన చేయగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చట్టాలను, కోర్టు ఉత్తర్వులను, దేవదాయ శాఖ నిబంధనలను తోసిరాజని అధికారం దన్నుతో ఈ కుంభకోణానికి తెరలేపినట్టు రికార్డుల పరిశీలనలో తేలింది. ఆ కమిటీ తీర్మానం ప్రకారమే.. అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కుటుంబరావు సభ్యుడిగా ఉన్న ముగ్గురు సభ్యులతో కూడిన ట్రస్టు బోర్డు 2017 ఫిబ్రవరిలో ధర్మపురి రెవెన్యూ పరిధిలో ట్రస్టు పేరిట ఉండే 145.78 ఎకరాలు ట్రస్టువి కావంటూ ట్రస్టు ఈవో అప్పటి దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయడం, ఆ వెనువెంటనే ఆ భూములకు రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ నిరభ్యంతర సర్టిఫికెట్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ట్రస్టు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాకే.. 2014 జూన్–2019 మే మధ్య రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ సమయంలోనే మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఈ భూ మాయ చోటుచేసుకోవడం విశేషం. అంతకుముందు మాన్సాస్ ట్రస్టు చైర్మనుగా ఉన్న ఆనంద గజపతిరాజు 2016 మార్చిలో మరణించారు. దీంతో టీడీపీ తరఫున ఎంపీగా కొనసాగుతున్న అశోక్‌గజపతిరాజును ట్రస్టు చైర్మనుగా నియమిస్తూ 2016 ఏప్రిల్ 7న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన కుటుంబరావును ట్రస్టు నిర్వహణ కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ అదే 2016 ఏప్రిల్ 7వ తేదీన ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. అప్పట్లో ట్రస్టు నిర్వహణకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు ప్రముఖ టీడీపీ నేతలే ఉన్నారు. వీరి నియామకం జరిగిన రోజుల్లోనే దేవదాయ శాఖ అధికారులు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ట్రస్టు పేరిట 474.44 ఎకరాలుందని నిర్ధారించారు. ఏడాదికల్లా అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తేల్చడం గమనార్హం. -
సింహాచలం భూముల అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వ్యవహారంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కమిటీని నియమించింది. ఈనెల 15లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మాజీ ఈవో రామచంద్రమోహన్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న కాలంలో ఈవోగా రామచంద్రమోహన్ పనిచేశారు. మాన్సాస్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. సింహాచలం దేవస్థానం భూములను 22 ఏ జాబితా నుండి చట్టవిరుద్దంగా తొలగించారనే అభియోగాలు ఉన్నాయి. -
కులాలకు కేసులకు సంబంధమేంటి?
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తుంటే.. ఆయన కులం చాటున దాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని క్షత్రియ నేతలు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ డి.సూర్యనారాయణరాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కె.కె.రాజు మండిపడ్డారు. కులాలకు– కేసులకు సంబంధం లేదని, తప్పు చేసిన వారు ఏ కులంవారైనా శిక్ష పడుతుందని వారు స్పష్టంచేశారు. ‘‘రాజకీయ, న్యాయ వివాదాల్లో... ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాల్లో కులసంఘాల జోక్యం సబబు కాదు. అశోక్‌గ జపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ పేరిట చేసిన మోసాలు, అవినీతి వ్యవహారాలను ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు వదిలిపెట్టాలే తప్ప కుల సంఘాల జోక్యం తగదు. అశోక్‌గజపతిరాజు తప్పు చేసి క్షత్రియ కులాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదెంతమాత్రం క్షమార్హం కాదు’’ అని విశాఖలో ఉత్తరాంధ్ర నేతలు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు విజయవాడలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘గతంలోనూ చంద్రబాబు వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టారు. ఇప్పుడూ ఎల్లో మీడియా సాయంతో రెడ్డి, క్షత్రియుల మధ్య గొడవలు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఆయనకు బుద్ధి రాకపోవడం సిగ్గు చేటు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులకు సంబంధించి ఊరు, పేరు లేకుండానే క్షత్రియుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు ప్రకటనలివ్వడం దారుణం. క్షత్రియులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు... సిద్ధాంతాలకు కట్టుబడే పని చేస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిది’’ అని హితవు చెప్పారు. బాబు హైదరాబాద్‌లో కూర్చుని ఇక్కడ కులాల కురుక్షేత్రాన్ని కోరుకోవడం మానుకోవాలని హితవు పలికారు. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి వైఎస్ జగన్ క్షత్రియులకు మూడు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు, మంత్రి పదవి ఇచ్చారని, దీన్నెవరూ మరచిపోరని చెప్పారాయన. మహిళపై వివక్ష క్షత్రియ ధర్మమా? విశాఖలో మాట్లాడిన క్షత్రియ నేతలు... ఇప్పుడు అశోక్‌గజపతిరాజును సమర్థిస్తూ, కొమ్ముకాస్తున్న ఒక వర్గం క్షత్రియ నేతలే గతంలో ఆయన తండ్రి దోపిడీదారుడని విమర్శించారని గుర్తుచేశారు. అశోక్‌గజపతిరాజు అంశాన్ని కులానికి ముడిపెట్టి కొన్ని పత్రికల్లో కథనాలు రాయడాన్ని క్షత్రియుల తరఫున ఖండిస్తున్నామన్నారు. అశోక్‌గజపతిరాజు తన అన్న కూతురు సంచయితకు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపై వివక్ష చూపించడం క్షత్రియ ధర్మమా? అసలు క్షత్రియ కుటుంబంలో మహిళలకు ఎంత గౌరవమిస్తారో అశోక్ గజపతికి తెలుసా? అని ప్రశ్నించారు. మహిళలకు ఎటువంటి హక్కులుండవని చెప్పడమే అశోక్ గజపతి ఉద్దేశమయితే.. ఆ వాదనను రాష్ట్రంలో క్షత్రియలెవ్వరూ సమర్థించరని చెప్పారు. ‘‘పంచగ్రామాల సమస్య పరిష్కారానికి అనుకూలమో, వ్యతిరేకమో.. అశోక్‌గ జపతి తక్షణమే చెప్పాలి. కోటిపల్లి వద్దనున్న మాన్సాస్ ట్రస్టు భూములను ఏపీఎండీసీకి (2020కి ముందు) అప్పగించక మునుపు అక్కడ ఇసుకను లెక్కాపత్రం లేకుండా దోచుకున్నది ఎవరు? మాన్సాస్ విద్యాసంస్థలకు రావాల్సిన రూ.35 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం« దరఖాస్తు కూడా చేయకుండా ఆ సంస్థలను నాశనం చేసింది ఎవరు? మాన్సాస్ భూములను కోర్టుకు తెలియకుండా వేలం వేయించింది ఎవరు? 20 ఏళ్లుగా మాన్సాస్ ట్రస్టు అకౌంట్లను ఆడిటింగ్ చేయించలేదంటే.. ఇది ట్రస్టుగా నడుస్తోందా? లేక అశోక్‌గజపతి సొంత వ్యవహారంలా నడుస్తోందా? అని ప్రశ్నించారు. వీరితో పాటు ఈ సమావేశంలో విశాఖ డీసీసీబీ చైర్మన్ సుకుమార్‌రాజు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రఘురామరాజు, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, మాజీ సీఈసీ సభ్యుడు శ్రీనివాసరాజు, కార్పొరేటర్లు అనిల్‌కుమార్‌రాజు, భూపతిరాజు సుజాత, జానకిరామరాజు, పార్టీ అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు, సంయుక్త కార్యదర్శి కిరణ్‌రాజు పాల్గొన్నారు. -
మాన్సాస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీల్ కు వెళ్తాము : విజయసాయిరెడ్డి
-
అశోక్‌గజపతిరాజు ఒక దొంగ: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: అశోక్‌గజపతిరాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అశోక్‌గజపతిరాజు ఒక దొంగని ఆరోపించారు. అశోక్‌గజపతిరాజు తీరుతోనే పంచ గ్రామాల్లో భూ సమస్య నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సమస్య పరిష్కారానికి సహకరించాలని ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజును కోరుతున్నట్లు తెలిపారు. అశోక్‌గజపతిరాజు దొడ్డిదారిన మళ్లీ సింహాచలం ఆలయ ఛైర్మన్ అవ్వాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయమై డివిజన్ బెంచ్‌కు అప్పీల్ కోసం వెళ్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. చదవండి: ‘దేవుడి సన్నిధిలో అశోక్‌గజపతిరాజు అసత్యాలు తగదు’ -
‘ఆ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచాడు’
సాక్షి, విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ విషయంలో జడ్జిమెంట్ పరిశీలించిన తర్వాత స్పందిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. పదవులు ముఖ్యం కాదు, అభివృద్ధి కూడా చూడాలన్నారు. ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని.. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని మంత్రి చెప్పారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఆక్రమణలపై ప్రభుత్వ చర్యలతో అందరికీ భయం పట్టుకుందన్నారు. దేవాదాయ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచారని ధ్వజమెత్తారు. దేవాదాయ భూములను సంరక్షించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ వాహనమిత్ర అమలు: సీఎం జగన్ ‘ఇమేజ్ పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబు’ -
మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదు
సాక్షి, అమరావతి: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని పేర్కొంది. అలాగే మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు, ఆర్వీ సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ జారీ చేసిన జీవోను సైతం రద్దు చేసింది. అంతేకాకుండా సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత నియామక జీవోను సైతం కొట్టేసింది. ఇదే సమయంలో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు నియామకం తిరిగి అమల్లోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడిగా/చైర్మన్‌గా 2016లో అశోక్ గజపతిరాజు నియామకం సక్రమంగానే జరిగిందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ సోమవారం తీర్పు వెలువరించారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం గతేడాది జీవో 74ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, ఆర్వీ సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ మరో జీవో ఇచ్చింది. అదేవిధంగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వంశపారంపర్య చైర్‌పర్సన్‌గా సంచైతను నియమిస్తూ మరో జీవోనూ జారీ చేసిన విషయం విదితమే. ఈ మూడు జీవోలను సవాల్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ వెంకటరమణ సోమవారం తీర్పు వెలువరించారు. తీర్పు కాపీ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో హైకోర్టు జీవోలను కొట్టేయడానికి గల కారణాలు తెలియరాలేదు. -
చంద్రబాబువి దగుల్బాజీ రాజకీయాలు
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని, ఈ ఘటనలకు కారకుడైన చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వ్యక్తి కానేకాదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. అంత ఘటన జరిగితే ఆలయ చైర్మన్ అశోక్‌గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పవిత్రమైన హిందువైతే విజయవాడలో ఆలయాలను ఎందుకు కూల్చారని నిలదీశారు. ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తు రాలేదా అని ప్రశి్నంచారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నీచ, దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో గుళ్లను కూల్చేసింది చంద్రబాబే అన్న విషయం జగమెరిగిన సత్యమన్నారు. రామతీర్థం సహా రాష్ట్రంలో మరికొన్ని ఘటనలపై సీఐడీ విచారిస్తుందన్నారు. విగ్రహాల ధ్వంసాలకు కారకులు ఎవరో, ఏ పారీ్టవారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తేలుతుందని చెప్పారు. రేపు తిరుపతి ఎన్నిక జరిగితే బైబిల్ కావాలో, భగవద్గీత కావాలో తెలుస్తుందన్నారు. చంద్రబాబు తిరుపతిలో ఇవే మాటలు చెబితే అప్పుడు ప్రజలు సమాధానం చెబుతారన్నారు. అమరావతి చంద్రబాబు దోపిడీ నగరం అని ఎద్దేవా చేశారు. అసలు అమరావతి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. చంద్రబాబు అమరేశ్వరుని భూములూ దోచుకున్నారని చెప్పారు. -
‘ప్రభుత్వాన్ని లాగటం భావ్యం కాదు’
సాక్షి, విజయనగరం: అశోక్ గజపతిరాజు మాన్సాస్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని లాగటం భావ్యం కాదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ వ్యవహారాలు ఉంటే వారిలో వారు చక్కదిద్దుకోవాలన్నారు. మహారాజ కళాశాల వ్యవహారంలో మాన్సాస్ వలన విద్యార్థులకు, అధ్యాపకులకు నష్టం వాటిల్లుతుంటే తమ పరిధి మేరకు చర్యలు చేపడతామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఎంఆర్ విద్యాసంస్థలను అన్ ఎయిడెడ్ చేయమని గతంలో అశోక్ గజపతే ప్రభుత్వాన్ని కోరినట్టు మాన్సాస్ చైర్మన్ సంచయిత తెలిపారని ఆయన చెప్పారు. తామెప్పుడు మాన్సాస్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదని, ప్రజలకు నష్టం కలిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ నిర్వహణపై పట్టణానికి చెందిన ప్రముఖులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. (చదవండి: రాజకీయాలతో ముడిపెట్టొద్దు: బొత్స) -
ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారా?
సాక్షి, విజయనగరం : టీడీపీ నేత, మాజీమంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలపై సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాజా కళాశాలపై అశోక్ గజపతి రాజు చేసిన ఆరోపణలను ట్విటర్ వేదికగా సంచయిత తిప్పికొట్టారు. ‘మహారాజా కాలేజీ గురించి అశోక్ గజపతి గారు చేస్తున్న తప్పుడు సమాచారం నాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారని ఊహించలేదు. ఎంఆర్ కాలేజీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రయివేటు కాలేజీ. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఎయిడెడ్ హోదాను 2017లో ఆయనే సరెండర్ చేశారు. అప్పుడు తీసుకున్న విధాన నిర్ణయం కొనసాగుతోంది. ఇందులో ప్రభుత్వం జోక్యంకాని, సంబంధం కాని లేదు. ఈ విషయాన్ని ఆయన విస్మరించి మాట్లాడుతున్నారు. దయచేసి మీ రాజకీయాల్లోకి మాన్సాస్ విద్యాసంస్థలను లాగవద్దు. (అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు) అశోక్‌గారు మాన్సాస్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తప్పుడు వివరాలు ఇవ్వటం మూలాన మాన్సాస్ కాలేజీలకు రూ.6.5 కోట్లు నష్టం వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అశోక్‌గారు డిస్కౌంట్‌గా ఈ డబ్బు ఇచ్చారేమో? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి ఈ డబ్బును తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన అనుమతులు లేని కారణంగా 2018–2020లో 170 మంది విద్యార్థులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటు కాకుండా పోయాయి. అశోక్ గజపతి గారి హయాంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. వారిని జీవితాలను చీకట్లోకి నెట్టేశారు. నేను వచ్చాక ఈ సమస్యపై దృష్టి పెట్టాను. అశోక్‌గారు తన రాజకీయ ఆటల కోసం విజయనగరం పెద్దల వారసత్వాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. కనీసం గాంధీ జయంతి రోజు అయినా మీరు నిజం మాట్లాడాలి.’ అని సంచయిత గజపతిరాజు వరుస ట్వీట్లు చేశారు. (పవన్ వ్యాఖ్యలకు సంచయిత కౌంటర్) -
సంచయితపై బాబు, అశోక్ రాజకీయ కుట్ర
సాక్షి, విజయనగరం : మరోసారి విజయనగరం రాజుల పోరు తెరపైకి వచ్చింది. వివాదంగా మారిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై చైర్ పర్సన్ సంచయిత జోక్యం చేసుకోవడాన్ని అశోక్ గజపతిరాజు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబుతో కలిసి తరచూ సంచయిత గజపతిరాజుపై ఎదురుదాడికి దిగుతూ విమర్శలు చేస్తున్నారు. అయితే తానే అసలైన వారసురాలినని, తనకు ప్రజా సేవే ముఖ్యమంటూ దూకుడుగా వెళ్తున్న సంచయితపై బురద జల్లేందుకు టీడీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. గత కొన్నినెలలుగా వివాదంలో నలుగుతున్న పేరు విజయనగరం మాన్సాస్ ట్రస్ట్. ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఈ ట్రస్ట్ గడిచిన అయిదారేళ్లగా పూర్తిగా అవినీతిలోనే కూరుకుపోయింది.. తాజాగా ఈ ట్రస్ట్ కి చైర్ పర్సన్‌గా దివంగత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అశోక్ గజపతిరాజు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత కొన్ని నెలలుగా మాన్సాస్ లో జరిగిన అక్రమ వ్యవహారాలను వెలికి తీసేందుకు చైర్ పర్సన్ సంచయిత చేస్తున్న ప్రయత్నాలు ఆమె వ్యతిరేకులకి మింగుడుపడటంలేదు. (చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు: సంచయిత) చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్ ఇప్పటికే సంచయిత గజపతిరాజుకి చైర్ పర్సన్‌గా అర్హత లేదంటూ కోర్టుని ఆశ్రయించిన ఆమె బాబాయి అశోక్ గజపతిరాజు గత కొన్ని నెలలుగా చంద్రబాబుతో కలిసి కుట్ర రాజకీయాలకి పాల్పడుతున్నట్లు సంచయిత ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్సనంగా రెండు రోజులక్రితం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్సలు అద్దం పడుతున్నాయి. ట్రావెన్ కోర్ మాదిరిగానే వారసులుకే మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు అప్పగించాలంటూ చంద్రబాబు చేసిన ట్వీట్‌కు సంచయిత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పీవీజీ రాజు గారి అసలైన వారసులు తన తండ్రి ఆనంద గజపతిరాజు అయితే ఆయన అసలైన వారసురాలు తానేనని ఘాటుగా రీట్వీట్ చేశారు. ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ విషయంలో అసలైన వారసులనే నియమించిందంటూ చురకలు అంటించారు. ఇప్పటికైనా చంద్రబాబు మాన్సాస్ ట్రస్ట్ పై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!) అశోక్ గజపతిరాజు అసలైన కోణం వాస్తవానికి గత ఏడాది సింహాచలం దేవస్ధానంతో పాటు మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్‌గా ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచయిత గజపతిరాజుకి నియామకం చేయడాన్ని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జీర్ణించుకోలేకపోయారు. చిన్న వయస్సులో తన అన్న కూతురుకి ఆ అవకాశం రావడంపై హర్షించాల్సిన అశోక్ గజపతిరాజు తనలోని అసలైన కోణాన్ని బయటపెడుతూ వ్యతిరేకించారు. ఆమెకు తమ కుటుంబంతో సంబంధం లేనట్టుగా.. తామొక్కరే పీవీజీ రాజు వారసులిగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో మరో ముందడుగు వేసి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి సంచయిత గజపతిరాజు గత కొన్ని సంవత్సరాలుగా సన అనే స్వచ్చంద సంస్ధను స్ధాపించి విశాఖ, ఢిల్లీ తదితర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో టీడీపీ మంత్రులు, ఎంపీలు సైతం ఈమె సేవా కార్యక్రమాలలో పాల్గొని అభినందించిన సంధర్బాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు సేవా కార్యక్రమాలను ప్రశంసించిన నేతలే ఆమెపై తాజా ఎదురుదాడికి పాల్పడుతూ విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. (బాబాయ్ భ్రష్టు పట్టించారు) తండ్రి చితిమంటలు పూర్తిగా ఆరకముందే అయితే ఆమె మాన్సాస్ ట్రస్ట్‌కి చైర్ పర్సన్‌గా నియమితులైన తర్వాతే టార్గెట్ చెస్తూ టీడీపీ విమర్శలకు దిగడం ప్రారంభించింది. ఇదే సమయంలో తరచూ తనపై చేస్తున్న కుట్రలు, ఆరోపణలపై చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు అదే రీతిలో గట్టిగానే సమాధానాలు ఇచ్చేవారు. అయితే గత కొద్ది రోజులగా టీడీపీ తనపై ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేస్తోందని, ఎన్టీఆర్ మహిళలకి సమాన హక్కులు కల్పిస్తే చంద్రబాబు, అశోక్ గజపతిలు మాత్రం లింగ వివక్ష చూపుతున్నారని అన్నారు. ఇదే సమయంలో మాన్సాస్‌లో అక్రమాలు జరగకపోతే ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి చితిమంటలు పూర్తిగా ఆరకముందే అశోక్ గజపతి రాజుకి చైర్ పర్సన్ పదవి కట్టబెడుతూ రాత్రికి రాత్రే జీఓ ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. చంద్రబాబు, తన బాబాయ్ అశోక్ గజపతిరాజులకి మాన్సాస్‌పై ప్రేమ కంటే అధికారంపై మక్కువన్నారు. నిజంగా చంద్రబాబుకి సింహాచలం దేవస్ధానంపై అభిమానం ఉంటే తన తండ్రి, తాతలా సంపాదించిన ఆస్తుల్లో 500 కోట్లు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. సంచయిత గజపతిరాజు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకి ఇచ్చిన కౌంటర్ తీవ్ర కలకలమే రేపుతోంది. ఊహించని విధంగా సంచయిత గజపతిరాజు నుంచి రీట్వీట్ ఎదురుకావడంతో చంద్రబాబు మాత్రం గప్ చుప్ అయ్యారు. -
చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత
సాక్షి, అమరావతి : విజయనగరం నగర అభివృద్ధి పనుల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను అధికారులు తొలగించడంపై ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేయడాన్ని సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు తప్పుబట్టారు. దీనిపై ఆమె ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, కేంద్రమాజీ మంత్రి అశోక గజపతిరాజు తీరుపై మండిపడ్డారు. ‘విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబు నాయుడు, మా బాబాయ్ అశోక్‌గజతి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజం ఏంటంటే.. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారు. విజయనగరం చరిత్ర, సంస్కృతికి ప్రతీక, 1869 నాటి మోతీమహల్‌ను పునరుద్ధరించకుండా, మాన్సాస్ ఛైర్మన్‌గా ఉండగా బాబాయ్ అశోక్‌గజపతిగారు ఎందుకు ధ్వంసంచేశారు. తాతగారైన పీవీజీ రాజుగారి వారసత్వాన్ని ఎందుకు కాపాడలేకపోయారు?. దీనిపై చంద్రబాబు వివరణ ఇవ్వగలరా? ’ అని ట్వీట్ చేశారు. (మాన్సాస్‌లో పెనుమార్పు..!) కాగా శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను గురువారం అధికారుల తొలగించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో ఆధునిక హంగులతో కొత్త కట్టడాన్ని చేపట్టనున్నారు. మూడు లాంతర్లతో పాటు ఆశోకచక్రంతో కూడిన జాతీయ చిహ్నం, మూడు సింహాలను కార్పొరేషన్ కార్యాలయంలో భద్రపరిచారు. కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశాల మేరకు నగర అభివృద్ధి పనుల్లో భాగంగా వాటిని తొలగించామని, మూడు లాంతర్ల స్థానంలో నూతన నిర్మాణం చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ తెలిపారు. ఇప్పటి వరకూ ఉన్న నాలుగు సింహాల బొమ్మతో పాటు నూతన లాంతర్లను ఏర్పాటు చేసే దిశగా పలు నమూనాలను సిద్ధం చేశామన్నారు. రానున్న 15 రోజుల్లో కొత్త కట్టడం పూర్తిచేస్తామని తెలిపారు. దీనిపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. (బాబాయ్ ఇలా మాట్లాడతారా?) -
కుప్పకూలిన కోటలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో రాజుల కోటలు కుప్పకూలాయి. రాజ వంశాలకు చెందిన పలువురు సామాన్యుల చేతిలో మట్టి కరిచారు. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన విజయనగర రాజవంశానికి చెందిన అశోకగజపతి రాజు, విజయనగరం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె అదితి, అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కురుపాం రాజు వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన బొబ్బిలి రాజ వంశానికి చెందిన సుజయకృష్ణ రంగారావు ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో బొబ్బిలి రాజవంశానికి చెందని సుజయకృష్ణ రంగారావు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున విజయం సాధించారు. విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య వైరం ఈనాటి కాదు. కానీ సుజయకృష్ణా రంగరావును టీడీపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. మంత్రి వర్గంలో సైతం చేర్చుకుని గనుల శాఖను కట్టబెట్టారు. చంద్రబాబు సూచనల మేరకు బొబ్బిలి రాజులతో శతాబ్ధాల వైరాన్ని అశోక్‌గజపతిరాజు పక్కన పెట్టారు. బొబ్బిలి, విజయనగర రాజ వంశాలకు చెందిన కుటుంబాలు టీడీపీ తరఫున ఈ ఎన్నికల్లో బరిలోకి దిగాయి. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి అశోక్‌గజపతి రాజును టీడీపీ మళ్లీ బరిలోకి దించింది. బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా సుజయకృష్ణ రంగారావు పోటీ చేయగా, అశోక్‌గజపతి రాజు కూతరు అదితి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి రంగంలోకి దిగారు. కురుపాం రాజా వైరిచర్ల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి అరకు లోక్‌సభ స్థానం టికెట్ సాధించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనం ముందు రాజులు నిలబడలేకపోయారు. విజయనగరం లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజును వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్ చిత్తు చిత్తుగా ఓడించి.. జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. అరకు లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్లపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గొడ్డేటి మాధవి భారీ మెజార్టీతో విజయం సాధించారు. బొబ్బిలి శాసనసభ స్థానంలో సుజయకృష్ణ రంగారావును శంబంగి అప్పలనాయుడు, విజయనగరం శాసనభ స్థానంలో అదితిని కోలగట్ల వీరభద్రస్వామి మట్టికరిపించారు. -
వారి స్వార్థానికి.. వీరు బలి
అదేమీ రహదారి కాదు.... మున్సిపల్ అధికారులు చేపడుతున్న రహదారుల విస్తరణ కూడా కానే కాదు.... ఒక్క మాటలో చెప్పాలంటే మున్సిపాలిటీకి ఆ స్థలాలతో సంబంధం లేదు... ఎవరు చెప్పారో... ? ఎవరి మెప్పుకోరారో...? తెలియదు కానీ.... ట్రస్ట్ సభ్యులు రోడ్డెక్కే పని లేకుండా ... వారి చేతులకు మట్టి అంటకుండా పని కానిచ్చేశారు. వందలాది మంది పేదల జీవితాలను రోడ్డు పాల్జేశారు. ఏళ్ల తరబడి ఆ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారి పొట్టలు కొట్టారు. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు... విజయగనరం జిల్లా కేంద్రం నడిబొడ్డున గల విజయనగరం మహా రాజుల కోట పరిసరాల్లోనే.... ఆ భూములు ఎవరివో కాదు... స్వయానా మాజీ కేంద్రమంత్రి, ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజు ట్రస్టీగా వ్యవహరిస్తున్న మాన్సాస్‌కు చెందిన భూములే. ఈ విషయంలో మున్సిపల్ యంత్రాంగం పెత్తనం చేలాయించిన తీరు రెండేళ్లయిౖనా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. విజయనగరం మున్సిపాలిటీ: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రాత్మక నేపథ్యం కలిగిన విజయనగరం మహారాజా కోట పరిసరాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా కోటకు పడమర దిక్కులో పార్కు తరహాలో 2016 నుంచి పనులు ప్రారంభించారు. అదే తరహాలో కోట చుట్టూ అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా దశాబ్దాల కిందటి నుంచి కోట పరిసరాల్లో చిన్నపాటి వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిని ఒక్కసారిగా ఖాళీ చేయించడంపై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. 2017 ఫిబ్రవరిలో మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న వందలాది దుకాణాలను ఖాళీ చేయించేశారు. వాస్తవానికైతే ఇలా ఖాళీ చేయించే బాధ్యతను రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలి. ఇందుకోసం ముందస్తుగా ట్రస్ట్ నుంచి నోటీసులు జారీ చేయాలి. అయితే ఇదంతా అన్యాయమని ప్రశ్నించే వారి గొంతులను పోలీసు బలగాలను ప్రదర్శించి నొక్కేశారు. తాము మాన్సాస్ ట్రస్టుకు పన్నులు చెల్లిస్తే మున్సిపల్ యంత్రాంగం ఆ స్థలాల నుంచి ఖాళీ చేయించడం ఎంత వరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ యంత్రాంగానికి ఆ అధికారం ఎవరిచ్చారన్న ప్రశ్న తలెత్తినప్పటికీ అప్పటికే మాన్సాస్ ట్రస్ట్ డైరెక్టర్‌గా ఉన్న అదితి గజపతిరాజు తన తండ్రి అశోక్ గజపతిరాజు అధికారంతో ప్రశ్నించే వారిని అధికారులతో బెదిరించారు. దీంతో ఏళ్ల తరబడి ఉపాధి పొందిన వారంతా సామాన్య కుటుంబాలకు చెందిన వారే కావడంతో మిన్నకుండిపోయారు. ఈ ప్రక్రియపై ఒకానొక దశంలో రాజవంశానికి చెందిన పలువురు పెద్దలు అదితి గజపతిరాజు స్వలాభం కోసం వెంపర్లాడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడే ఎందుకు..? విజయనగరం మున్సిపాలిటీలో ఎక్కడా లేని అభివృద్ధి కోట చుట్టూ మాత్రమే జరిగింది. కోట పరిసరాల్లో రెండు కిలోమీటర్ల మేర మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. వాస్తవానికి విజయనగరం పట్టణంలో సుమారు 15 మార్గాల్లో గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మున్సిపాలిటీ శ్రీకారం చుట్టగా... అందులో కోట పరిసరాల్లో పనులు మాత్రమే నెలల వ్యవధిలో పనులు పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలిస్తే ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో రహదారి విస్తరణ పనులతో పాటు అభివృద్ధి పనులు పూర్తికాలేదు. కానరాని ప్రత్యామ్నాయం కోట పరిసరాల్లో ఆక్రమణల పేరిట తొలగించిన వారికి ప్రత్యామ్నాయం చూపించడంలో ఏ ఒక్కరికీ సంబంధం లేకుండా పోయింది. స్థలం మాన్సాస్ ట్రస్ట్‌కు చెందగా.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించింది మున్సిపల్ అధికారులు. ఆక్రమణలు తొలగించాలంటూ ఉపాధి పొందుతున్న వారిని హెచ్చరించిన సమయంలోనే వారంతా ఎదురు ప్రశ్నించినా ఉన్నతాధికారులు ఆదేశాలంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. బలవతంగా పోలీసుల సమక్షంలో భారీ యంత్రాలతో వారి దుకాణాలను నేలమట్టం చేశారు. ప్రస్తుతం తమకు ప్రత్యామ్నాయం చూపించాలని ఎవరిని అడగాలో తెలియని అయోమయ పరిస్థితిలో బాధితులున్నారు. అదితి పోటీతో హడల్.. విజయనగరం నియోజకవర్గంలో వంశపారంపర్య రాచరిక పాలనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా మాన్సాస్ ట్రస్ట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే పూసపాటి అదితి గజపతిరాజు తన తండ్రి అశోక్ గజపతిరాజు అధికారాన్ని ఉపయోగించుకుని వారి సొంత ఆస్తుల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను పట్టణ ప్రజలు కళ్లారా చూశారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే బరిలో ఉండడంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా బతుకులు కూల్చేశారు కోటను అందంగా మారుస్తామంటూ మా బతుకులు కూల్చేశారు. మాన్సాస్‌కు చెందిన స్థలంలో ఏళ్ల తరబడి టీ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాను. స్థలంలో ఉంటున్నందుకు పన్ను కూడా చెల్లిస్తున్నాం. అయితే ట్రస్ట్ నుంచి ఎటువంటి నోటీసులు, సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు వచ్చి ఆక్రమణలంటూ దుకాణాన్ని పడగొట్టారు. కనీసం ప్రత్యామ్నాయం కూడా చూపించలేదు. – అప్పలరాజు, బాధితుడు, విజయనగరం. -
‘ఇద్దరు రాజు’లకు వ్యతిరేక పవనాలు
తెలుగుదేశం పార్టీకి మొదటినుంచీ జిల్లాలో పెద్ద దిక్కుగా నిలుస్తున్నవారు ఒకరు. ఎంతోకాలంగా రాష్ట్ర మంత్రిగా... కేంద్ర మంత్రిగా... ఎంపీగా... ఎన్నో పదవులు ఆయన అలంకరించారు. కానీ జనం కోసం ఈయనేమీ చేయలేదన్న అపప్రధ మాత్రం మూటగట్టుకున్నారు. ఇక రెండో వ్యక్తి పదవికోసం గెలిపించిన పార్టీని... నమ్మిన జనాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరినవారు. ఈయన కూడా అభవృద్ధికోసమే ఈ మార్పు అని చెప్పి సొంత లాభం చూసుకున్నారు. జనం సమస్యలను గాలికొదిలేశారు. వీరిద్దరూ రాజ వంశీయులే. రాజులంటే ప్రజలకు అండగా నిలవాలి. ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. వారి సమస్యల్లో పాలుపంచుకోవాలి. వాటన్నింటికీ వీరు వ్యతిరేకం. అందుకే ఈ సారి ఎన్నికల్లో వారు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనం నుంచి వ్యతిరేకతను చవిచూస్తున్నారు. వీరి వైఖరి ప్రత్యర్థులకు అనుకూలంగా మారుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాకు చెందిన ఇద్దరు రాజులకు తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వీరు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో భాగంగా జనం వద్దకు వెళుతుంటే.. ఇన్నాళ్లూ ఏం చేశారని మళ్లీ ఓట్లడగడానికి వచ్చారంటూ ఒక రాజుని ప్రజలు నిలదీస్తున్నా రు. దీంతో ప్రచారంలోకి వెళ్లడమే మానేశారు మరొక రాజు. ఇదీ జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుల పరిస్థితి. 1955 సంవత్సరంలో నిర్వహించిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం కొనసాగుతోంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో పూసపాటి వంశానికి చెందిన పి.వి.జి.రాజు, పి.అశోక్ గజపతిరాజు అధిక ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారంలో మాత్రం చొరవ చూపించలేకపోయారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన మీసాల గీతను కాదని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రీ కూతుళ్లు అశోక్, అదితి టిక్కెట్టు తెచ్చుకున్నారు. ఇన్నేళ్ల పాలనపై ఇప్పుడు వ్యతిరేకత ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జిల్లా నుంచి ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి విజయనగరం పార్లమెంట్‌కు చేసిందేమీ లేదు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్‌మిల్లులు మూతపడి సుమారు 12వేల కార్మిక కుంటుంబాలు రోడ్డున పడ్డా పట్టించుకోలేదు. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు ఉన్నా విజయనగరంలో ఏర్పాటు కాలేదు. ఇన్నాళ్లూ అశోక్‌గజపతిరాజుకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ ద్వారా మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామంటూ కాలం గడిపారు. కనీసం తాను నివసించే బంగ్లా ఉన్న విజయనగరం పట్టణాన్ని తాగు నీటి సమస్య వేధిస్తున్నా ఆయనకదేమీ పట్టలేదు. ఇవన్నీ అశోక్‌కు, ఆయన కుమార్తె అదితికి ప్రతికూలతలుగా మారనున్నాయి. ప్రత్యర్ధి పార్టీకి ప్రచారాస్త్రాలుగా మారాయి. కేవలం టీడీపీకి, రాజ వంశానికి ఉన్న సంప్రదాయ ఓటింగ్‌పైనే వీరిద్దరూ ఆధారపడాల్సి వస్తోంది. సొంత ప్రాభవం లేని బొబ్బిలి రాజు 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బొబ్బిలి రాజులకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఈ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి సుజయకృష్ణ రంగారావు గెలుపొందారు. ఆ తరువాత 2009లో కూడా వైఎస్ హయాంలోనే సుజయ్ గెలుపొందారు. 2014లో వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ నుంచి సుజయ్ పోటీచేసి గెలిచారు. అంటే వైఎస్ .రాజశేఖరెడ్డి, జగన్‌ల నేతృత్వంలోనే ప్రజలు బొబ్బిలి రాజును గెలిపించారు తప్ప ఆయన వ్యక్తిగత చరిష్మా ఏమీ లేదని స్పష్టమవుతోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలిచింది లేదు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్ కుటుంబాన్ని సుజయ్ పదవి కోసం వంచించి, పార్టీ మారడంతో ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అంతగా తలకెత్తుకున్న అభిమానమంతా ఒక్కసారిగా చల్లారిపోయిందనీ, తాము వైఎస్ కుటుంబానికి నేటికీ అండగా ఉంటామని స్థానిక ప్రజలు, నాయకులు ఇప్పటికీ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మంత్రి పదవి రాగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పిన సుజయ్ ఆ విషయాన్ని మర్చిపోయి సొంత ప్రయోజనాలకు పదవిని వినియోగించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనివల్లే ఆయనపై ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఇటు పార్టీలోనూ సుజయ్‌పై బహిరంగంగానే నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిని బయటపెట్టారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో పర్యటనకు వెళుతున్న సుజయ్‌కు అక్కడక్కడ జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తన నియోజకవర్గాన్ని కాదు కదా కనీసం తాను నివసిస్తున్న బొబ్బిలి పట్టణాన్ని కూడా సుజయ్ పట్టించుకోలేకపోవడం ఆయనకు ప్రధాన అవరోధంగా మారింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ధనాన్ని, రాజుల సంప్రదాయ ఓటింగ్‌ను నమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. -
చంద్రబాబు అవినీతి ఆకాశయానం
-
విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపిం చాలని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును టీఆర్ఎస్ ఎంపీ కవిత కోరారు. ఆమె బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి సురేశ్ ప్రభును కలసి బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న స్పైసెస్ పార్కుకు సంబంధించిన వివరాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పార్కుకు 40 ఎకరాలు కేటాయించి రూ.30 కోట్లు విడుదల చేసిందని వివరించారు. కేంద్రం తరఫున రూ.20 కోట్లు విడుదల చేసేందుకు సురేశ్ ప్రభు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆమె తెలిపారు. -
'వాళ్ల ఉద్యోగాలు పోనివ్వం'
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరి ఎయిరిండియాను అవ్వాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గణపతిరాజు చెప్పారు. ఎయిరిండియా ఎప్పటికీ దేశానికి సేవ చేసేలా ఉండేలా చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎయిరిండియాలో పనిచేసే ఎవరూ కూడా ఉద్యోగం కోల్పోవడానికి వీలులేదని అశోక్ గణపతిరాజు లోక్‌సభలో చెప్పారు. ఈ నేషనల్ క్యారియల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.'' ఎయిరిండియాలో పనిచేసే ఏ ఒక్కరూ నిరుద్యోగులుగా మారాలని కోరుకోవడం లేదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరి ఎయిరిండియా కావాలనుకోవడం లేదు. ఎయిరిండియా దేశానికి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అతి పైపై ఎత్తులకు ఇంకా ఎగరాలి'' అని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేశామని, ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఈ కమిటీ చూస్తుందని తెలిపారు. ఈ ప్యానల్‌కు ఎంపీలతో సహా సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు. జూన్ 28న ఎయిరిండియాలోని పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ తుది పద్ధతులను ఆర్థికమంత్రి నేతృత్వంలోని మంత్రులే నిర్ణయిస్తారని అశోక్ గణపతి రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిరిండియా రుణభారం రూ.52వేల కోట్లకు చేరుకుంది. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. -
ఆ ట్రస్ట్ ఏదో తెలియదా ?
ప్రభుత్వ, ప్రైవేటుకు వ్యత్యాసం లేదా చర్చనీయాంశమైన అశోక్ వ్యాఖ్యలు వైద్యకళాశాల కోసం మాన్సాస్ ట్రస్టు దరఖాస్తు చేసిందని అందరికీ తెలుసు తమ ట్రస్టు అని చెప్పుకోలేకపోయిన అశోక్ గజపతిరాజు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘మెడికల్ కాలేజ్ ఇప్పటికే ఒకటి ఉంది. మరొకటి ఓ ట్రస్టు అడుగుతోంది. మీ పత్రికల ద్వారా చూశాను. మూడు నాలుగు మెడికల్ కాలేజీలు ఒకే ప్రాంతంలో ఉంటే అవి ఇబ్బందిపడతాయి. అన్నీ పడిపోతాయి. న్యాణ్యత కొరవడుతుంది.ప్రభుత్వమైనా, ప్రైవేటైనా మెడికల్ కాలేజ్ కదా. అక్కడ చదివే పిల్లలంతా డాక్టర్లవుతారు.’ ఇవీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సోమవారం కేంద్రాస్పత్రిలోని పరికరాల ప్రారంభోత్సవ అనంతరం విలేకర్ల వద్ద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడీ వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. వైద్య కళాశాల కోసం దరఖాస్తు చేసిన ట్రస్టు తనకేదో తెలియదన్నట్టు అశోక్ మాట్లాడారు. ప్రభుత్వ స్థాయిలో జరగాల్సినదంతా జరిగిపోయినప్పటికీ ఆ ట్రస్టు అడుగుతుందని పత్రికల్లో చూశానని చెప్పడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటులో ఎక్కడ చదివినా వైద్యులే అవుతారని హితబోధ చేసిన కేంద్రమంత్రికి, విద్యార్థులకొచ్చే ప్రయోజనాల వ్యత్యాసాలు తెలియవా అన్న సందేహాన్ని రేకెత్తించారు. మాన్సాస్ ట్రస్టుకు వైస్ చైర్మనైన అశోక్‌కు తెలియదా? ప్రైవేటు వైద్య కళాశాల ఏదో ట్రస్టు అడుగుతోందని, అది కూడా పత్రికల్లో చూశానని అశోక్ గజపతిరాజు చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలీ ప్రైవేటు కళాశాల కోసం దరఖాస్తు చేసింది మాన్సాస్ ట్రస్టు అని జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం తెలుసు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటు చేయాలని అనేక ఆందోళనలు జరిగాయి. శాసనసభలో సైతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సీఎం చంద్రబాబునాయుడు సైతం మాన్సాస్ ట్రస్టు ప్రైవేటు కళాశాలను ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. జిల్లాకొచ్చిన వైద్య ఆరోగ్యశాఖామంత్రి, ఇతరత్రా మంత్రులు బహిరంగంగా వెల్లడించారు. అలాంటిది ఆ ట్రస్టు వైస్ చైర్మనైన అశోక్ గజపతిరాజుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికే వైద్య కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వ ఆనుమతితో మాన్సాస్ ట్రస్టు భూములను వేలం కూడా వేశారు. జిల్లా కేంద్రాస్పత్రు క్లీనికల్ అటాచ్మెంట్ కింద మాన్సాస్ ట్రస్టు ఏర్పాటు చేయబోయే వైద్య కళాశాల కోసం ఇచ్చేందుకు ప్రభుత్వం సూచనప్రాయంగా స్పష్టం చేసింది. ఈ విధంగా తన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ స్థాయిలో జరిగే వ్యవహారాలన్నీ అశోక్‌కు తెలియవన్నట్టు మాట్లాడారు. తమ ట్రస్టు అని చెప్పుకోలేకపోయారు. ప్రభుత్వ, ప్రైవేటుకు తేడా తెలియదా ప్రభుత్వ, ప్రైవేటులో ఎక్కడ చదవినా వైద్యులే అవుతారని అశోక్ చెప్పడం జిల్లా ప్రజల్ని మరింత విస్మయానికి గురి చేసింది. జిల్లాకు మూడు నాలుగు వైద్య కళాశాలు ఏర్పాటు చేయాలని ఎవరూ కోరలేదు. ఇప్పటికే నెల్లిమర్లలో ప్రైవేటు వైద్య కళాశాల ఉంది. మరొకటి ప్రభుత్వ వైద్య కళాశాలైతే బాగుంటుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజలకు ఉచితంగా ఉన్నత వైద్యసేవలందడమే కాకుండా తక్కవ ఫీజుతో వైద్య విద్యనభ్యసించేందుకు విద్యార్థులకు అవకాశం వస్తుంది. ఒకవేళ ప్రైవేటు వైద్య కళాశాలే ఏర్పాటు చేద్దామనుకుంటే ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న పార్వతీపురంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అక్కడి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించడం ద్వారా చాలామంది ప్రాణాలు నిలబెట్టవచ్చనేది ప్రజల అభిప్రాయం. ఆ తేడా తెలియదన్నట్టుగా అశోక్ వ్యాఖ్యలుండటం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి. ఓ ట్రస్టు అనడం సరికాదు కేంద్రమంత్రి స్థాయిలో వైద్య కళాశాలను ఓ ట్రస్టు అడుగుతోందని చెప్పడం సరికాదు. మాన్సాస్ ట్రస్టు పెడుతుందని జిల్లా ప్రజలందరికీ తెలుసు. దానిపై ఆందోళనలు కూడా జరిగాయి. అలాంటి ఆ ట్రస్టు వైస్ చైర్మనైన అశోక్ గజపతిరాజుకు వైద్య కళాశాలను అడుగుతున్నట్టు తెలియదా. ఇప్పటికే భూ ముల వేలం, ఇతరత్రా కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వ స్థాయిలో అన్నీ జరిగిపోతున్నా మాన్సాస్ ట్రస్టే అని చెప్పుకోవడానికి ఎందుకంత ఇబ్బంది. ఎక్కడ చదవినా వైద్యులే అవుతారని అందరికీ తెలుసని, ప్రభుత్వ వైద్య కళాశాలైతే రోగులకు ఉచిత వైద్యసేవలు, విద్యార్థులకు తక్కువ ఫీజుతో వైద్య విద్యను చదువుకోవడానికి అవకాశం ఉంటుందనేది తెలియదా. - బీశెట్టి బాబ్జీ, లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. -
పాత పాటే..
► పారిశ్రామిక కారిడార్..ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా మారుస్తానంటూ హామీ ► ఇచ్చిన హామీలకు నిధుల ప్రస్తావన లేదు ► రిజర్వాయర్ల కింద సాగు చేసింది 6 లక్షల ఎకరాలైతే.. 8.50 లక్షల ఎకరాలకు నీరిచ్చామన్న సీఎం. ► లక్షల ఎకరాలు ఎండిపోతే.. పంటల్ని కాపాడామని గొప్పలు ► పింఛను తొలగించారని ప్రశ్నించిన వికలాంగుడు ► సీఎం ప్రసంగిస్తుండగానే లేచి వెళ్లిపోయిని మహిళలు ► హడావుడిగా సాగిన సీఎం చంద్రబాబు కార్యక్రమం సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ముఖ్యమంత్రి హోదాలో ఆరోసారి జిల్లాకు వచ్చిన బాబు కార్యక్రమం హడావుడిగా.. చప్పగా ముగిసింది. కొత్తసీసాలో పాత సారా అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం సాగింది. గతంలో ఇచ్చిన హామీలకు ఎటువంటి క్లారిటీ లేకుండా కార్యక్రమాన్ని ముగించుకుని తిరుగు పయనమయ్యారు. తూపిలిపాళెంలో సుమారు రూ.600 కోట్లతో ఏర్పాటు చేయనున్న సునామీ, సముద్ర పరిశోధన కేంద్రానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, హర్షవర్ధన్, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసరావు, నారాయణ, గోపాలకృష్ణారెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తదితరులు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కొత్త వరాలతో పాటు.. గతంలో ఇచ్చిన హామీల అమలుకు నిధులు మంజూరు విషయంపై ప్రకటన చేస్తారని భావించారు. అయితే ఎక్కడా ఆ ప్రస్తావన రాలేదు. అయితే నెల్లూరు జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంచుతానని ప్రకటించారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలు పారిశ్రామిక కారిడార్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మరోసారి చెప్పుకొచ్చారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... జిల్లాలో రిజర్వాయర్ల కింద 6 లక్షల ఎకరాలు సాగైతే.. 8.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పంటలను కాపాడమని చెప్పటం సభకు హాజరైన రైతులు నవ్వుకోవటం కనిపించింది. సాగునీరందక సుమారు లక్ష ఎకరాలకుపైగా పంటలు ఎండిపోతే... ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎండిన పంటల గురించి కానీ.. అకాల వర్షంతో నష్టపోయిన పంటల గురించి ప్రస్తావించకుండా.. అంతా బాగుందనే విధంగా సీఎం మాట్లాడటంవిమర్శలకు దారితీసింది. రుణమాఫీకి ఇంత వరకు నిధులు విడుదల చేయకపోయినా.. రైతులను రుణ విముక్తుల్ని చేసిన ఘనత తమదేనని గొప్పలు చెప్పారు. పింఛను తొలగించారంటూ వికలాంగుడు ఆగ్రహం సీఎం సభలో పింఛన్ల గురించి ప్రస్తావన కొచ్చిన సమయంలో వికలాంగుడొకరు లేచి తనకు పింఛను తీసేశారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వెళ్లి వికలాంగుడు నోరెత్తకుండా అడ్డుకున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చెప్పిన విషయాలే మళ్లీ చెపుతుండటంతో మహిళలకు విసుగొచ్చి మధ్యలోనే లేచి వెళ్లిపోవటం కనిపించింది. దీంతో సీఎం చంద్రబాబు ఒకింత నిరాశకు గురికావటంతో పోలీసులు అప్రమత్తమై వెళ్లిపోతున్న వారిని కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. ఇక చేసేది లేక సీఎం తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించేశారు. సభలో మోదీ, వెంకయ్యని పొగిడిన సీఎం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటంతో జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని, వెంకయ్యనాయుడు, సీఎం దిష్టిబొమ్మలను తగులబెడుతుంటే... సీఎం చంద్రబాబు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తటం గమనార్హం. అదేవిధంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా సీఎం చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. తెప్పించుకునే విధంగా పోరాడకపోయినా ఒకరినొకరు పొగుడుకుంటుండటంతో సభకు హాజరైన వారంతా నవ్వుకోవటం కనిపించింది.