
సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపిం చాలని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును టీఆర్‌ఎస్ ఎంపీ కవిత కోరారు. ఆమె బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.
అనంతరం కేంద్ర మంత్రి సురేశ్ ప్రభును కలసి బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న స్పైసెస్ పార్కుకు సంబంధించిన వివరాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పార్కుకు 40 ఎకరాలు కేటాయించి రూ.30 కోట్లు విడుదల చేసిందని వివరించారు. కేంద్రం తరఫున రూ.20 కోట్లు విడుదల చేసేందుకు సురేశ్ ప్రభు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment