సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని, ఈ ఘటనలకు కారకుడైన చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వ్యక్తి కానేకాదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. అంత ఘటన జరిగితే ఆలయ చైర్మన్ అశోక్‌గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పవిత్రమైన హిందువైతే విజయవాడలో ఆలయాలను ఎందుకు కూల్చారని నిలదీశారు. ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తు రాలేదా అని ప్రశి్నంచారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నీచ, దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
విజయవాడలో గుళ్లను కూల్చేసింది చంద్రబాబే అన్న విషయం జగమెరిగిన సత్యమన్నారు. రామతీర్థం సహా రాష్ట్రంలో మరికొన్ని ఘటనలపై సీఐడీ విచారిస్తుందన్నారు. విగ్రహాల ధ్వంసాలకు కారకులు ఎవరో, ఏ పారీ్టవారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తేలుతుందని చెప్పారు. రేపు తిరుపతి ఎన్నిక జరిగితే బైబిల్ కావాలో, భగవద్గీత కావాలో తెలుస్తుందన్నారు. చంద్రబాబు తిరుపతిలో ఇవే మాటలు చెబితే అప్పుడు ప్రజలు సమాధానం చెబుతారన్నారు. అమరావతి చంద్రబాబు దోపిడీ నగరం అని ఎద్దేవా చేశారు. అసలు అమరావతి అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. చంద్రబాబు అమరేశ్వరుని భూములూ దోచుకున్నారని చెప్పారు.
చంద్రబాబువి దగుల్బాజీ రాజకీయాలు
Published Wed, Jan 6 2021 3:30 AM | Last Updated on Wed, Jan 6 2021 9:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment