విమాన టికెట్ల ధరలపై డిస్కౌంట్ | AirAsia cuts fares on select flights starting from Rs 1,099 | Sakshi
Sakshi News home page

విమాన టికెట్ల ధరలపై డిస్కౌంట్

Published Mon, Mar 7 2016 10:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

విమాన టికెట్ల ధరలపై డిస్కౌంట్

విమాన టికెట్ల ధరలపై డిస్కౌంట్

న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా మరోసారి ఆఫర్లను ప్రకటించింది. దేశవాళీ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో టికెట్ల ధరలపై డిస్కౌంట్ ఆఫర్ చేసింది.

అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది నుంచి మే 22 మధ్యకాలంలో ప్రయాణించడానికి డిస్కౌంట్ ధరలతో కూడిన విమాన టికెట్లను సోమవారం నుంచి ఈ నెల 13 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బెంగళూరు, విశాఖపట్నం, గువహటి, కోచి, ఇంపాల్, పనాజీ, ఢిల్లీ వంటి నగరాల మధ్య దేశవాళీ సర్వీసుల్లో కనీస ధర 1099 రూపాయల నుంచి టికెట్లను అందుబాటులో ఉంచారు.

కోచి నుంచి చెన్నై లేదా హైదరాబాద్ మీదుగా మలేసియా రాజధాని కౌలాలంపూర్కు 2999 రూపాయల నుంచి టికెట్ ధరలను ఎయిర్ ఏషియా ఆఫర్ చేసింది. ఇక చెన్నై నుంచి బెంగళూరు మీదుగా థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్కు 3999 రూపాయల నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement