
ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఆపరేటర్ ఎయిర్ ఏషియా బెర్హాడ్ (AirAsia Berhad) మలేషియా యూనిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రియాద్ అస్మత్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం ఎయిర్‌లైన్‌లో నాయకత్వంలో చెప్పుకోదగ్గ మార్పును సూచిస్తోంది.
కారణమిదేనా?
రియాద్ అస్మత్ 2018 జనవరిలో ఎయిర్ ఏషియా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కంపెనీ బోర్డులో సలహాదారుగా మారాలనే యోచనతో ఆయన సీఈవోగా వైదొలగడానికి సిద్ధమయ్యారు. అస్మత్ నిష్క్రమణ ప్రకటనలో గల కారణాలకు సంబంధించి నిర్దిష్ట వివరాలు లేవు. అయితే ఎయిర్ ఏషియా ఏవియేషన్ గ్రూప్ పునర్నిర్మాణ కార్యక్రమాలు, సిబ్బంది మార్పులపై రాబోయే అప్‌డేట్‌లను ఇది తెలియజేస్తోంది.
బడ్జెట్ ఎయిర్‌లైన్ సెక్టార్‌లో ప్రముఖ సంస్థ అయిన ఎయిర్ ఏషియా ఏవియేషన్ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లను, రానున్న మహమ్మారి నేపథ్యంలో తలెత్తే ఒడిదుడుకులను అధిగమించడానికి ఈ సంస్థాగత మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రియాద్ అస్మత్ తన నైపుణ్యం, అనుభవాన్ని కంపెనీ కోసం మరింతగా వినియోగించేందుకు సలహాదారుగా మారుతున్నట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.