దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు సినిమా థియేటర్లలో ‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎయిరేషియా ప్రకటించింది. భారత్‌లోని 16 నగరాల నుంచి మలేషియా, థాయ్‌ల్యాండ్‌ల మీదుగా 130 గమ్యస్థానాలకు ఎయిరేషియా విమానాలు నడుపుతోంది. తన నెట్‌వర్క్‌లోని పర్యాటక స్థలాలను వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తామని కంపెనీ తెలిపింది. దానివల్ల భారత్‌లో తమ ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కరోల్ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సినిమా థియేటర్లలో ‘‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’’ ద్వారా కంపెనీ నెట్‌వర్క్‌లోని పర్యాటక స్థలాలను ప్రదర్శిస్తాం. దానివల్ల భారత్‌లో కంపెనీకి ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం క్యూబ్ సినిమాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. వచ్చే ఆరు నెలల్లో దేశంలోని 12 ప్రధాన నగరాల్లో 130 థియేటర్ల ద్వారా ఎయిరేషియా గమ్యస్థానాల గురించి వివరిస్తాం. భారతీయులు ఎక్కువ ప్రయాణించే ఆసియా, ఆస్ట్రేలియాల్లో పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది’ అన్నారు.
ఇదీ చదవండి: ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్
ప్రస్తుతం ఎయిరేషియా భారత్ నుంచి మలేషియా, థాయ్‌లాండ్‌లకు 22 డైరెక్ట్ సర్వీసులను నడుపుతోంది. త్వరలో మరో నాలుగు మార్గాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం గౌహతి, కోజికోడ్, లఖ్‌నవూ, కౌలాలంపూర్‌లను ఎంచుకుంది. రాబోయే కొన్ని వారాల్లో తిరుచిరాపల్లి నుంచి నేరుగా బ్యాంకాక్‌కు విమాన సర్వీసు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment