సాక్షి, ముంబై: ఏషియా విమాన సంస్థకు భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం విమానాన్ని నడిపే పైలట్‌కు సామర్థ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు కొన్ని కచ్చితమైన చర్యలు పాటించాలి. వాటిని పాటించడంలో వైఫల్యం చెందినందుకు గానూ ఎయిర్‌ఏషియా యాజమాన్యానికి డీజీసీఏ ఈ ఫైన్ విధించింది.
డీజీసీఏ నిబంధనల మేరకు విధులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శించిన ఎయిర్‌లైన్స్ ట్రైనింగ్ విభాగ అధిపతిని మూడు నెలల పాటు తొలగించింది. అలాగే ఎనిమిది మంది సూపర్వైజర్లకు ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధించింది.
ఈ మేరకు డీజీసీఏ ఎయిర్‌ఏషియా మేనేజర్‌కు, శిక్షణ విభాగం అధిపతికి, పర్యవేక్షకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించడంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. వారి నుంచి వివరణలు వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
చదవండి: ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. ఏం జరిగిందంటే..
Comments
Please login to add a commentAdd a comment