భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఎయిర్ ఇండియాపై డీజీసీఏ రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది. కొన్ని దీర్ఘ-శ్రేణి, టెరైన్ క్రిటికల్ మార్గాల్లో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎయిర్ ఇండియా ఉద్యోగి నుంచి అందిన స్వచ్ఛంద భద్రతా నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపి ఈ చర్య తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది.
నిర్దిష్ట సుదూర ప్రాంత క్లిష్టమైన మార్గాల్లో ఎయిర్ ఇండియా నిర్వహించే విమానాల విషయంలో భద్రతా నిబంధనలను కంపెనీ ఉల్లంఘించినట్లు ఎయిర్‌లైన్ ఉద్యోగి నుంచి స్వచ్ఛంద భద్రతా నివేదిక అందిందని, వాటిపై సమగ్ర దర్యాప్తును చేపట్టినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చదవండి: ఎగిరిన కొత్త ఫ్లైట్.. దేశంలోనే తొలిసారి!
ఎయిర్ ఇండియా నిబంధనలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, దీంతో ఆ విమానయాన సంస్థ అకౌంటబుల్ మేనేజర్‌కి షోకాజ్ నోటీసు జారీ చేశామని డీజీసీఏ తెలిపింది. దీనికి ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన స్పందనను సంబంధిత చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించినట్లు వివరించింది. లీజుకు తీసుకున్న విమానం కార్యకలాపాలు రెగ్యులేటరీ /ఓఈఎం పనితీరు పరిమితులకు అనుగుణంగా లేనందున ఎయిర్ ఇండియాపై రూ. 1.10 కోట్ల జరిమానా విధించినట్లు డీజీసీఏ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment