పాన్ మసాలా, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు జీఎస్‌టీ (GST) విభాగం భారీ షాక్ ఇచ్చింది. ఆయా ఉత్పత్తుతల ప్యాకింగ్ మెషినరీని తప్పనిసరిగా జీఎస్టీ పరిధిలో నమోదు చేసుకోవాలని, అలా చేసుకోకపోతే రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.
ఈ నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. పొగాకు తయారీ రంగంలో పన్ను ఎగవేతను నిరోధించడమే దీని ఉద్దేశం. ఈమేరకు కేంద్ర జీఎస్టీ చట్టానికి సవరణలను చేసినట్లు పేర్కొంది. జీసీస్టీ పరధిలో నమోదు కాని ప్రతి మెషిన్‌కు రూ. లక్ష జరిమానా విధిస్తారు. నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న మెషిన్లను కొన్ని సందర్భాల్లో సీజ్ కూడా చేస్తారు.
పాన్ మసాలా, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్యాకింగ్ మెషినరీల జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక ప్రత్యేక ప్రక్రియను గత సంవత్సరమే జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది. తాము వినియోగిస్తున్న ప్యాకింగ్ యంత్రాల వివరాలు, కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన మెషీన్‌ల ప్యాకింగ్ సామర్థ్యం వంటి వివరాలను GST SRM-I ఫారంలో సమర్పించాలి. అయితే ఇలా వివరాలు ఇవ్వనివారికి ఇప్పటి వరకూ ఎలాంటి జరిమానా ఉండేది కాదు. కానీ ఇకపై జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment