బ్రేకింగ్ సిస్టమ్స్ తయారీలో ఉన్న బ్రేక్స్ ఇండియా వివిధ ప్లాంట్లలో సామర్థ్యం పెంపునకు 2030 నాటికి రూ.1,000 కోట్లు పెట్టుబడి చేయాలని నిర్ణయించింది. నూతన ప్లాంట్లు సైతం ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ఎండీ శ్రీరామ్ విజి వెల్లడించారు.
రాబోయే 4–5 సంవత్సరాలలో పెద్ద పెట్టుబడులతో సాఫ్ట్‌వేర్, ఎల్రక్టానిక్ సామర్థ్యాలను మెరుగుపరుస్తామని ఆయన చెప్పారు. జపాన్‌కు చెందిన ప్రీమియం బ్రేక్ సిస్టమ్ సరఫరాదారు యాడ్‌విక్స్‌తో కలిసి జేవీ నెలకొల్పింది. ఈ జేవీలో బ్రేక్స్ ఇండియాకు 51 శాతం వాటా ఉంది.
తమిళనాడులోని హోసూరు వద్ద రూ.500 కోట్లతో జేవీ ప్లాంటు ఏర్పాటవుతోంది. తొలి ఉత్పాదన అయిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్స్‌ను 2027 నుంచి తయారు చేయనున్నారు. సంస్థకు దేశవ్యాప్తంగా 17 ప్లాంట్లు ఉన్నాయి. 2023–24లో రూ.7,500 కోట్ల
టర్నోవర్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment