విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుభవార్త చెప్పింది. చెక్ ఇన్ బ్యాగేజీ లేకుండా ప్రయాణించడానికి ఇష్టపడే ప్రయాణీకులకు తగ్గింపు ధరలలో టికెట్ల ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ లైట్ ద్వారా ప్రయాణికులు సాధారణ ఛార్జీల కంటే తక్కువ ధరలో విమాన టికెట్లను పొందవచ్చు.
ఎక్స్ ప్రెస్ చెక్ ఇన్ ఫ్లయర్ కౌంటర్లు, బ్యాగేజీ బెల్ట్ వద్ద క్యూలను నివారించేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా బుక్ చేసుకుంటే 15 కిలోలు, 20 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీలపై డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలపై ప్రయాణించే ప్రయాణికులు కాంప్లిమెంటరీ కింద అదనంగా 3 కిలోల బ్యాగేజీని ఫ్రీగా బుక్ చేసుకునే అవకాశం ఉంది.
ఈ అవకాశాన్ని ఎయిర్ పోర్ట్ ఎయిర్ లైన్ కౌంటర్లలోని ప్రయాణికులు చెక్ ఇన్ బ్యాగేజీ సేవలను వినియోగించుకోవచ్చని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment