టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. వన్‌వే టికెట్ డొమెస్టిక్ రూట్లలో రూ. 1,799, అంతర్జాతీయ రూట్లలో రూ. 3,899 నుంచి ప్రారంభమయ్యే నెట్‌వర్క్-వైడ్ సేల్‌ను ప్రారంభించింది .
ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ పేరిట పరిమిత-కాల నెట్‌వర్క్-వ్యాప్త ఆఫర్‌ను ఫిబ్రవరి 2న ప్రారంభించింది. ఇది ఫిబ్రవరి 5 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసే బుకింగ్ చేస్తే ఈ ఆఫర్‌పై కన్వీనియన్స్ ఫీజు కూడా మినహాయించనున్నట్లు ఎయిర్‌ఇండియా ఒక విడుదలలో తెలిపింది.
షరతులు ఇవే..
ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ కింద బుకింగ్‌లు కేవలం నలుగురికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 2 నుంచి సెప్టెంబర్ 30 మధ్య చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ లోపు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
దేశీయ మార్గాల్లో అన్నీ కలుపుకొని వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ.1,799 నుంచి ప్రారంభమవుతాయి. అయితే వన్-వే బిజినెస్ క్లాస్‌లో ఇది రూ. 10,899. ఇక అంతర్జాతీయ మార్గాల్లో వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ. 3,899 నుంచి ప్రారంభమవుతాయి.
ఈ సేల్ అందుబాటులో ఉన్న సీట్లు పరిమితంగా ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్నవారికి సీట్లు లభిస్తాయని ఎయిర్ లైన్స్ తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్‌లపై కన్వీనియన్స్ ఫీజు ఆదా చేసుకోవచ్చు.
దేశంలోని పలు నగరాలతో పాటు యూఎస్, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ & మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, దక్షిణ ఆసియాలో ఎయిర్‌లైన్ నిర్వహించే గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment