AirAsia airline
-
ఎయిర్‌ఏషియాకు రూ.20లక్షల ఫైన్! ఎందుకంటే..
సాక్షి, ముంబై: ఏషియా విమాన సంస్థకు భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం విమానాన్ని నడిపే పైలట్‌కు సామర్థ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు కొన్ని కచ్చితమైన చర్యలు పాటించాలి. వాటిని పాటించడంలో వైఫల్యం చెందినందుకు గానూ ఎయిర్ఏషియా యాజమాన్యానికి డీజీసీఏ ఈ ఫైన్ విధించింది. డీజీసీఏ నిబంధనల మేరకు విధులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శించిన ఎయిర్‌లైన్స్ ట్రైనింగ్ విభాగ అధిపతిని మూడు నెలల పాటు తొలగించింది. అలాగే ఎనిమిది మంది సూపర్వైజర్లకు ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు డీజీసీఏ ఎయిర్ఏషియా మేనేజర్‌కు, శిక్షణ విభాగం అధిపతికి, పర్యవేక్షకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించడంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. వారి నుంచి వివరణలు వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చదవండి: ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. ఏం జరిగిందంటే.. -
మరో షాక్.. ప్రయాణికురాలికి ఎయిర్ఏషియా సిబ్బంది వేధింపులు
సాక్షి, బెంగళూర్ : ప్రయాణికుల పట్ల ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెండు రోజలు క్రితం ఇండిగో సిబ్బంది ఓ వ్యక్తిని ఈడ్చిపడేయటం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోక ముందే బెంగళూర్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రయాణికురాలిపై ఎయిర్ఏషియా ఎయిర్‌లైన్ సిబ్బంది వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పైలెట్‌సహా ఇద్దరు సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆమె కేసు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్లో వారి పేర్లను చేర్చారు. అసలేం జరిగిందో యువతి మాటల్లోనే... నవంబర్ 3న ఆ యువతి రాంచీ నుంచి బెంగళూర్‌కు ఏయిర్ ఏషియా విమానంలో ప్రయాణించింది. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమని సూచించటంతో యువతి ఆ పని చేసింది. అయినప్పటికీ పైలెట్‌తో సహా ఆ ఇద్దరు సిబ్బంది అనవరసంగా దూషించారని.. ఒకానోక సమయంలో విమానం నుంచి దించేస్తామని తనను బెదిరించారని ఆమె చెప్పింది. ఇక విమానం సరిగ్గా ఉదయం 12గం.45ని. సమయంలో బెంగళూర్‌లో ల్యాండ్ కాగా.. ప్రయాణికులందరినీ పంపించి వేసి తనను మాత్రం అడ్డుకున్నారని యువతి తెలిపింది. తన తప్పేంటో చెప్పకుండా తనను ఎందుకు ఆపారని ప్రశ్నిస్తే.. పైలెట్‌కు క్షమాపణలు చెబితేనే వెళ్లనిస్తామని చెప్పి ఆ ఇద్దరు సిబ్బంది సమాధానమిచ్చారంట. క్షమాపణలు చెప్పకపోతే ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని.. బయట దొరకబుచ్చుకుని సంగతి తేలుస్తామని బెదిరించారని చెప్పింది. అలా కాసేపు సతాయించాక మూడు గంటల ప్రాంతంలో తనను ఎయిర్‌పోర్టు పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి నిబంధనలు ఉల్లంఘించినట్లు రిపోర్ట్ చేశారని ఆమె పేర్కొంది. ఆపై స్నేహితురాలి సాయంతో ఆమె ఎయిర్ఏషియా సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఘటనపై ఎయిర్ఏషియా ఇంకా స్పందించలేదు. -
విమాన చార్జీల్లో ఎయిర్ ఏషియా 20% డిస్కౌంట్
ముంబై: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ విమాన చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌నిస్తోంది. ఈ డిస్కౌంట్ స్కీమ్ బుధవారమే ప్రారంభమైందని ఎయిర్ ఏషియా సీఈవో మిట్లు చాండిల్య చెప్పారు. ఈనెల 17 వరకూ ఈ ఆఫర్ లభ్యమవుతుందని, డిసెంబర్ 14 లోపు జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. బెంగళూరు నుంచి చెన్నై, కోచి, గోవా విమాన సర్వీసులకు ఈ నగరాల నుంచి బెంగళూరు విమాన సర్వీస్‌లకు ఈ డిస్కౌంట్ లభ్యమవుతుందని వివరించారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి చెన్నై, కోచి,గోవాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 5 నుంచి బెంగళూరు నుంచి జైపూర్‌కు, బెంగళూరు నుంచి చండీగర్‌లకు విమానాలను నడపనున్న్నామని వివరించారు. ఈ విమాన సర్వీసులకు ప్రస్తుత ఆఫర్ వర్తిస్తుందని, సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 25 మధ్య ప్రయాణించాలని చాండిల్య పేర్కొన్నారు. ప్రతి ఒక్క భారతీయుడికి విమానయానం అందించడం లక్ష్యంగా ఎయిర్ ఏషి యా ప్రారంభంలో పేర్కొన్నామని చాండిల్య గుర్తు చేశారు. ఈ లక్ష్యంలో భాగంగానే ఇప్పుడు ఈ డిస్కౌం ట్ను ఇస్తున్నామని వివరించారు. ప్రస్తుతమున్న విమాన చార్జీల్లో 35% తక్కువగానే తమ సర్వీసులనందిస్తామని ఎయిర్ ఏషియా గతంలోనే పేర్కొంది.