విమాన చార్జీల్లో ఎయిర్ ఏషియా 20% డిస్కౌంట్ | AirAsia India lowers fares, offers 20% discount | Sakshi
Sakshi News home page

విమాన చార్జీల్లో ఎయిర్ ఏషియా 20% డిస్కౌంట్

Published Thu, Aug 14 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

విమాన చార్జీల్లో ఎయిర్ ఏషియా 20% డిస్కౌంట్

విమాన చార్జీల్లో ఎయిర్ ఏషియా 20% డిస్కౌంట్

ముంబై: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ విమాన చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌నిస్తోంది. ఈ డిస్కౌంట్ స్కీమ్ బుధవారమే ప్రారంభమైందని ఎయిర్ ఏషియా సీఈవో మిట్లు చాండిల్య చెప్పారు. ఈనెల 17 వరకూ ఈ ఆఫర్ లభ్యమవుతుందని, డిసెంబర్ 14 లోపు జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. బెంగళూరు నుంచి చెన్నై, కోచి, గోవా విమాన సర్వీసులకు ఈ నగరాల నుంచి బెంగళూరు విమాన సర్వీస్‌లకు ఈ డిస్కౌంట్ లభ్యమవుతుందని వివరించారు.

ప్రస్తుతం బెంగళూరు నుంచి చెన్నై, కోచి,గోవాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నామని చెప్పారు.  వచ్చే నెల 5 నుంచి బెంగళూరు నుంచి జైపూర్‌కు, బెంగళూరు నుంచి చండీగర్‌లకు విమానాలను నడపనున్న్నామని  వివరించారు. ఈ విమాన సర్వీసులకు ప్రస్తుత ఆఫర్ వర్తిస్తుందని,  సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 25 మధ్య ప్రయాణించాలని చాండిల్య పేర్కొన్నారు. ప్రతి ఒక్క భారతీయుడికి విమానయానం అందించడం లక్ష్యంగా ఎయిర్ ఏషి యా ప్రారంభంలో పేర్కొన్నామని చాండిల్య గుర్తు చేశారు. ఈ లక్ష్యంలో భాగంగానే ఇప్పుడు ఈ డిస్కౌం ట్‌ను ఇస్తున్నామని వివరించారు. ప్రస్తుతమున్న విమాన చార్జీల్లో 35% తక్కువగానే తమ సర్వీసులనందిస్తామని ఎయిర్ ఏషియా గతంలోనే పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement