Mittu Chandilya
-
‘ప్రపంచంలోనే అతిపెద్ద దళారీ’
సాక్షి, హైదరాబాద్: ‘‘అక్రమ మార్గంలో ఏ పని జరగాలన్నా ఆయనను కలిస్తే సరిపోతుంది.. ఆయన అవినీతి ప్రపంచ స్థాయికి చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద దళారీ చంద్రబాబు నాయుడే. ఓట్లు వేసిన ప్రజల్ని దారుణంగా వంచించిన ఆయన.. పక్కరాష్ట్రాలకు వెళ్లి ఏపీ పరువు తీస్తున్నారు..’’ అంటూ ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి తీరును తూర్పారపట్టారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. ఎయిర్ ఏషియా కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్లు బయటపడటంతో వారి అవినీతి స్థాయి ఏమిటో మరోసారి బట్టబయలైందని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. (ప్రధాన వార్త: చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!) ‘‘చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం ఎంతదాకా విస్తరించిందో ఎయిర్ ఏషియా కుంభకోణంతో మరోసారి బయటపడింది. అక్రమ మార్గాల్లో ఆయన చేయలేని పనులంటూ లేవని రుజువులు దొరికాయి. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా ఎల్లో మీడియా మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మహిళా లోకాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. పెట్రోల్‌పై వ్యాట్ పేరుతో వాహనదారుల నడ్డివిరుస్తున్నారు. గిట్టుబాటు ధర రానీయకుండా రైతులను దగాచేస్తున్నారు..’’ అని భూమన అన్నారు. ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రచురించిన కథనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌కు అదే సంస్థకు చెందిన ఇండియా సీఈఓ మిట్టూ శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణలో చంద్రబాబు దళారీల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. అంతర్జాతీయంగా కలకలం రేపుతోన్న ఈ ఉదంతంపై టీడీపీతోపాటు పచ్చ మీడియా సైతం కిమ్మనకుండా ఉండిపోయంది. (ప్రధాన వార్త: చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!) మీడియాతో మాట్లాడుతున్న భూమన -
ఎయిర్ ఏషియా స్కాంలో చంద్రబాబు
-
చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఆడియో టేపుల్లో దొరికిపోయారు. చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోకగజపతిరాజుల వ్యవహారం ఈ టేపుల్లో బయటపడింది. గతంలో ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఈసారి ఎయిర్ ఏషియా కుంభకోణంలో బుక్కయ్యారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోన్న ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రకటించింది. దీనికి సంబంధించి ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌కు అదే సంస్థకు చెందిన ఇండియా సీఈఓ మిట్టూ శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణను ఆ పత్రిక ప్రచురించింది. ‘‘మనం ఎలాగోలా కొత్త రూట్లకు సంబంధించిన లైసెన్సులను సంపాదించాలి. ఎంత ఖర్చయినా పరవాలేదు. ఎవరిని పట్టుకుంటే పనవుతుంది? ఎలాగోలా ఈ పని చేయాల్సిందే.’’అని టోనీ ఫెర్నాండెజ్ చెబుతుండగా.. ‘‘ఈ పని చేయాలంటే చంద్రబాబు నాయుడు సమర్థుడు. ఆయనను ఒప్పించగలిగితే మొత్తం పని అయిపోతుంది. ఈ పనిని చంద్రబాబు ద్వారా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనిషే ఇపుడు పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఉన్నాడు.’’అని మిట్టూ శాండిల్య వ్యాఖ్యానించినట్లు ఆడియో టేపుల్లో ఉండడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఎయిర్ ఏషియా కుంభకోణంపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెల్సిందే. విదేశీ రూట్ల లైసెన్సులను దొడ్డిదారిన పొందడానికి గాను భారతీయ అధికారులకు లంచాలిచ్చినట్లు బయటపడడంతో వారిని అరెస్టు చేసి సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి గతంలో జరిగిన సంభాషణలతో కూడిన ఆడియో టేపులు బయటపడడం, అందులో చంద్రబాబు, అశోక గజపతి రాజు పేర్లు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌తో అశోక గజపతిరాజు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలలో టీడీపీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహనరావు కూడా ఉండడం గమనార్హం. టోనీ ఫెర్నాండేజ్, శాండిల్య మధ్య జరిగిన సంభాషణలివీ.. ప్రముఖ లాబీయిస్టు రాజేందర్ దూబే సమక్షంలో శాండిల్యకు, టోనీ ఫెర్నాండెజ్‌కు మధ్య జరిగిన సంభాషణలతో కూడిన ఆడియో టేపులను బిజినెస్ టుడే బయటపెట్టింది. వాటిలో ఏమున్నదంటే.. టోనీ ఫెర్నాండెజ్: నాకు ఎయిర్ ఏషియా ఇండియా ఇంటర్నేషనల్ రూట్ పర్మిట్లు కావాలి. ఏ మార్గం ఎంచుకున్నా ఒకే. ఇందుకోసం కొంత నష్టపోవడానికి కూడా సిద్ధమే. నిజాయితీగా సరైన మార్గంలో వెళితే పర్మిట్లు రావడానికి చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లైనా సరే త్వరగా ఇంటర్నేషనల్ పర్మిట్లు తీసుకురండి. శాండిల్య : సరే సర్.. అంటే అడ్డదారిలో వెళ్లమంటారా? టోనీ ఫెర్నాండెజ్: యెస్. నేను చెప్పింది చేయి. లైసెన్స్‌కోసం ఏదైనా చేయి. ఇక్కడ మన పురోగతి చాలా నెమ్మదిగా ఉంది. పని పూర్తయ్యేటట్లు చూడు. శాండిల్య : ప్రస్తుత నియంత్రణ నిబంధనల ప్రకారం చూస్తే మనం మరో మార్గంలో వెళ్లాలి. ప్రభుత్వంలో ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో నాకు తెలుసు. కీలక స్థానంలో ఉన్న పై స్థాయి వ్యక్తి నుంచి కింద స్థాయి వరకు వెళ్లాలి. టోనీ ఫెర్నాండెజ్: స్థానికంగా ఉన్న దూబే, మీరు కలిసి చూసుకోండి. వారితో బేరసారాలు చేయండి. ఎలా చేస్తారన్నది నీ ఇష్టం. నువ్వు అంతర్జాతీయ లైసెన్స్ తీసుకువస్తే మీకు అదనపు విమానాలను సమకూరుస్తాను. శాండిల్య : ‘సమర్థత’ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో మనం జాగ్రత్తగా డీల్ చేస్తే మొత్తం పనయిపోతుంది. పైగా గతంలో చంద్రబాబు వద్ద ఆర్థికమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజే ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన మనతో ప్రత్యక్షంగా కనిపించడానికి ఇష్ట పడటం లేదు కానీ అడిగిన పని చేసి పెడతా అన్నారు. ఇలాంటివాడు మనతో ఉండటం మన అదృష్టం. హైదరాబాద్ కేంద్రంగానే సాగిన వ్యవహారం.. ఈ మొత్తం వ్యవహారమంతా హైదరాబాద్ కేంద్రంగానే జరిగినట్లు మరికొన్ని సాక్షాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆడియో టేపులకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ రాయబేరం కోసం సింగపూర్‌కు చెందిన కంపెనీని రంగంలోకి దింపడానికి ఎయిర్ ఏషియా హైదరాబాద్ నోవాటెల్‌లో సమావేశమైనట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 21, 2015లో హైదరాబాద్‌లో జరిగిన 11వ ఎయిర్ ఏషియా ఇండియా బోర్డు మీటింగ్‌లో సింగపూర్‌కు చెందిన హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్ పీటీఈని లాబీ కోసం నియమిస్తూ తీసుకున్న కాపీని మనీ కంట్రోల్ వెబ్సైట్ వెలుగులోకి తీసుకొచ్చింది. టేపుల్లో ఫెర్నాండెజ్ స్థానికంగా ఉన్న వ్యక్తిని రాయబేరాలకు తీసుకోమనడం.. హైదరాబాద్ కేంద్రంగా బోర్డు సమావేశంలో హెచ్ఎన్ఆర్ ట్రేడెండ్‌కు చెందిన రాజేంద్ర దూబేకు బాధ్యతలు అప్పచెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. అప్పటికి ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఆడియో టేపులు వెలుగులోకి రాకపోవడంతో చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి విదితమే. ఓటుకు కోట్లు కుంభకోణం బయటపడిన తర్వాతనే చంద్రబాబు తన కార్యక్షేత్రాన్ని అమరావతికి మార్చారు. కాగా మలేషియా ఎయిర్‌లైన్స్ కంపెనీ ఈ రాయబేరాల కోసం ఒక సింగపూర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదీ ఎయిర్ ఏషియా కుంభకోణం.. మలేషియాకు చెందిన బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా 2014లో టాటా గ్రూపుతో కలిసి దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టింది. కానీ అప్పటి నిబంధనల ప్రకారం స్థానికంగా 5 ఏళ్లు సర్వీసులు నడిపి, 20 విమానాలు కలిగిన ఉన్న సంస్థలకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అనుమతిచ్చేవారు. దీన్నే 5/20 నిబంధన అని పేర్కొంటారు. కానీ ఎయిర్ ఏషియా ఇండియాకు విదేశీ సర్వీసులు నడపడానికి గాను ఈ నిబంధనను మార్చాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ దీన్ని స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ వంటి స్థానిక విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా జూన్, 2016లో 5/20 నిబంధనను సవరిస్తూ అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణ ప్రకారం ఐదేళ్ల సర్వీసు లేకుండా కేవలం 20 విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చు. ఈ నిబంధన వల్ల మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా, విస్తారా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ప్రయోజనం జరిగింది. ఆ విధంగా ఎయిర్ ఏషియా దేశీయ విమానయానంలోకి అడుగు పెట్టిన రెండేళ్లలోనే ఈ లైసెన్స్‌ను దక్కించుకుంది. ఇలా బయటకు వచ్చింది... రతన్ టాటా, సైరస్ మిస్త్రీ మధ్య జరిగిన వివాదంతో ఈ కేసు బయటకు వచ్చింది. అప్పటి టాటా గ్రూపు చైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీ ఎయిర్ ఏషియా లైసెన్స్‌లు దక్కించుకోవడంలో రూ.22 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ 2017మార్చిలో శాండిల్యాను ప్రశ్నించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన సీబీఐ.. ఫెర్నాండెజ్‌తో సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఏషియా ఇండియా ఆ సంస్థకు రూ.12.28 కోట్లు చెల్లించి, ఈ మొత్తాన్ని రాయబేరాలకు వినియోగించినట్లు సీబీఐ పేర్కొంటోంది. విచారణలో భాగంగా 6వ తేదీ ఫెర్నాండేజ్‌ను హజరు కావాల్సిందిగా సీబీఐ సమన్లు పంపింది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. -
ఎయిర్ ఏషియా కేసులో సంచలన విషయాలు
-
ఎయిర్ ఏషియా స్కాం : చంద్రబాబు పేరు
న్యూఢిల్లీ : ఎయిర్ ఏషియా కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్ ఏషియా అడ్డదారులు తొక్కిన విషయం తెలిసిందే. పర్మిట్ల కోసం విమానయాన శాఖ ఉద్యోగులకు ఎయిర్ ఏషియా లంచాలు ఎర వేసింది. దాదాపు పది లక్షల డాలర్లను లంచాలను విమానయాన శాఖ అధికారులు స్వీకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అంచనా వేసింది. దీనిపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే పలువురు పౌర విమానయాన శాఖ ఉద్యోగులను అరెస్టు చేసింది. అవినీతి కేసును తవ్వితీస్తున్న సమయంలో సీబీఐకు ఎయిర్ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఈ ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. అడ్డదారిలో పర్మిట్లు రావాలంటే చంద్రబాబును పట్టుకోవాలని ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్, ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యాల మధ్య సంభాషణలు జరిగాయి. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్(ఎడమ), ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యా(కుడి) ‘చంద్రబాబును పట్టుకుంటే మనకు కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలు దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్ గజపతి రాజే చెప్పారు.’ అని ఆడియో టేపులో ఛాండిల్యా మాట్లాడారు. అయితే, ఈ ఆడియో టేపు ఎప్పటిదో తెలియాల్సివుంది. బీజేపీతో తెగదెంపుల సందర్భంగా అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్ ఏషియా సీఈవో ఫెర్నాండెజ్ బుధవారం సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. -
విమాన చార్జీల్లో ఎయిర్ ఏషియా 20% డిస్కౌంట్
ముంబై: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ విమాన చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌నిస్తోంది. ఈ డిస్కౌంట్ స్కీమ్ బుధవారమే ప్రారంభమైందని ఎయిర్ ఏషియా సీఈవో మిట్లు చాండిల్య చెప్పారు. ఈనెల 17 వరకూ ఈ ఆఫర్ లభ్యమవుతుందని, డిసెంబర్ 14 లోపు జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. బెంగళూరు నుంచి చెన్నై, కోచి, గోవా విమాన సర్వీసులకు ఈ నగరాల నుంచి బెంగళూరు విమాన సర్వీస్‌లకు ఈ డిస్కౌంట్ లభ్యమవుతుందని వివరించారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి చెన్నై, కోచి,గోవాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 5 నుంచి బెంగళూరు నుంచి జైపూర్‌కు, బెంగళూరు నుంచి చండీగర్‌లకు విమానాలను నడపనున్న్నామని వివరించారు. ఈ విమాన సర్వీసులకు ప్రస్తుత ఆఫర్ వర్తిస్తుందని, సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 25 మధ్య ప్రయాణించాలని చాండిల్య పేర్కొన్నారు. ప్రతి ఒక్క భారతీయుడికి విమానయానం అందించడం లక్ష్యంగా ఎయిర్ ఏషి యా ప్రారంభంలో పేర్కొన్నామని చాండిల్య గుర్తు చేశారు. ఈ లక్ష్యంలో భాగంగానే ఇప్పుడు ఈ డిస్కౌం ట్ను ఇస్తున్నామని వివరించారు. ప్రస్తుతమున్న విమాన చార్జీల్లో 35% తక్కువగానే తమ సర్వీసులనందిస్తామని ఎయిర్ ఏషియా గతంలోనే పేర్కొంది. -
ఎయిర్ ఏషియా ఎగిరింది..
విమానయాన సేవలు షురూ.. తొలి ఫ్లయిట్ బెంగళూరు నుంచి టేకాఫ్ బెంగళూరు: దేశంలో ఎయిర్ ఏషియా విమాన సేవలు గురువారం మొదలయ్యాయి. తొలి విమాన సర్వీసును బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి గోవాకు నడిపారు. మలేసియా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియాలోనే అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా భారతీయ విభాగమే ఎయిర్ ఏషియా ఇండియా. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఈ రంగంలోకి ఎయిర్ ఏషియా ప్రవేశంతో ధరల పోరు తీవ్రతరం కానుంది. ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ తర్వాత దేశంలో చౌకగా విమాన సేవలందించే కంపెనీగా ఎయిర్ ఏషియా ఆవిర్భవించింది. ప్రారంభ ఆఫరుగా బెంగళూరు - గోవా టికెట్‌ను రూ.990గా ప్రకటించారు. అందుబాటు ధరలో విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం, విమానంలో ప్రయాణించే అవకాశాన్ని భారతీయులందరికీ కల్పించడమే తమ లక్ష్యమని ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిట్టు చాండిల్య మీడియాకు తెలిపారు. మార్కెట్ రేట్లతో పోలిస్తే తమ చార్జీలు 35 శాతం తక్కువగా ఉంటాయని చెప్పారు. స్థిరమైన కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తామనేది తమ విశ్వాసమనీ, అందుకే చార్జీలను మరింత తగ్గించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.డీజీసీఏ గణాంకాల ప్రకారం.. స్థానిక మార్కెట్లో 31.6% వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. జెట్‌ఎయిర్‌వేస్-జెట్‌లైట్ 21.8%, ఎయిర్ఇండియా 18.3%, స్పైస్‌జెట్ 17.9%, గోఎయిర్ 9.5% మార్కెట్ వాటాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎయిర్ ఏషియాపై స్వార్థశక్తుల పన్నాగం: టాటాసన్స్ న్యూఢిల్లీ: చౌక ధరలకే విమాన సేవలను అందించే ఎయిర్ ఏషియా కార్యకలాపాలను అడ్డుకోవడానికి కొన్ని స్వార్థశక్తులు యత్నిస్తున్నాయని ఈ సంస్థ వాటాదారు టాటా సన్స్ ఆరోపించింది. దేశంలో ఎయిర్ ఏషియా సర్వీసులు గురువారం ప్రారంభమైన కొద్దిసేపటికే టాటా సన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి ఎయిర్ ఏషియాపై చేసిన ఆరోపణలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. విమాన ప్రయాణికులకు ప్రయోజనం కలిగించే స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన పోటీని వ్యతిరేకిస్తున్న కొన్ని శక్తులు ఎయిర్ ఏషియా కార్యకలాపాలకు భంగం కలిగేలా దుష్ర్పచారం సాగిస్తున్నాయి’ అని టాటా సన్స్ ఘాటుగా విమర్శించింది. భారత్‌లో విమాన సేవలు ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి, డీజీసీఏ నుంచి అన్ని అనుమతులూ పొందామని ఉద్ఘాటించింది. స్వామి తో పాటు మరికొందరు కోర్టును ఆశ్రయించినప్పటికీ కార్యకలాపాల నిలిపివేతకు ఇంజంక్షన్ ఉత్తర్వులేమీ రాలేదని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టుకు ఈ విషయంపై పూర్తి అవగాహన ఉందనీ, న్యాయస్థానం ఆదేశాలను తాము, ఎయిర్ ఏషియా ఇండియా గౌరవిస్తామనీ టాటా సన్స్ తెలిపింది. కాగా, ఎయిర్ ఏషియా వ్యవహారం కోర్టులో ఉందనీ, కనుక ఆ సంస్థకు అనుమతి మంజూరు చేయవద్దంటూ ఎన్నికల సంఘం, డీజీసీఏకు, పౌర విమానయాన శాఖకు డాక్టర్ స్వామి గతంలో ఫిర్యాదు చేశారు.