న్యూఢిల్లీ: త్వరలోనే రైల్వే బడ్జెట్ కూత పెట్టనుంది. అయితే, కానీ ఆ కూత సామాన్యుల గుండెల్లో భయం పుట్టించకపోవచ్చు. ఎందుకంటే ఈసారి రైల్వే ప్రయాణీకుల ఛార్జీలు పెంచడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ బడ్జెట్లో ప్రయాణీకులపై ఎలాంటి బరువులు పెట్టకుండానే రైల్వే బడ్జెట్ను పరుగులుపెట్టించేందుకు కేంద్రం ఇప్పటికే అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం పది శాతం టికెట్ చార్జీలను పెంచాలని తొలుత భావించిందని, దీనిద్వారా కేవలం రూ.4,500 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరనుండగా.. అది కాస్త ఈ బడ్జెట్పై ఉండే సానూకూల దృక్ఫథాన్ని దూరం చేస్తుందని, ప్రజలకు ప్రభుత్వం కోపం వస్తుందని కేంద్రం గ్రహించినట్లు కీలక వర్గాల సమాచారం. అయితే, ఈ మొత్తం ఆదాయాన్ని వేరే ఇతర కార్యకలాపాల ద్వారా, ప్రకటనల ద్వారా రాబట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు రైల్వే ప్రయాణీకులపై ఛార్జీల భారాన్ని మోపింది. గత ఏడాది నవంబర్ లోనే రెండోసారి ఛార్జీలు పెంచింది. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఈసారి వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.
ఈసారి మోత లేకుండానే రైలు కూత?
Published Thu, Feb 11 2016 6:57 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM
Advertisement
Advertisement