రూ.611కే గోఎయిర్ టిక్కెట్ | Cheap airfares alert: GoAir celebrates 11th anniversary with fares starting from Rs 611 | Sakshi
Sakshi News home page

రూ.611కే గోఎయిర్ టిక్కెట్

Published Fri, Nov 4 2016 12:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

రూ.611కే గోఎయిర్ టిక్కెట్

రూ.611కే గోఎయిర్ టిక్కెట్

విమానయాన సంస్థలు అందించే సీజన్ టిక్కెట్లు కొనడం చేజారినవని బాదపడుతున్నారా..? అయితే ఎలాంటి దిగులు అవసరం లేదట. వాదియా గ్రూప్కు చెందిన లో-కాస్ట్ విమానయాన సంస్థ గోఎయిర్ ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్ను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, రూ.611కే విమాన టిక్కెట్ను అందించనున్నట్టు పేర్కొంది. నవంబర్ 4 తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో ప్రయాణికులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని తెలిపింది. 2017 జనవరి 11 నుంచి 2017 ఏప్రిల్ 11వరకున్న ట్రావెల్ కాలంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని గోఎయిర్ ప్రకటించింది.
 
రూ.611 ప్రారంభ టిక్కెట్ ధరలో కేవలం బేస్ ఛార్జీలు, ప్యూయెల్ సర్ఛార్జీలు మాత్రమే కలిసి ఉండనున్నాయి. ప్రస్తుతం అందుబాటులోఉన్న నియమాల ప్రకారం పన్నులు, టిక్కెట్ ధరకు ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. డిస్కౌంట్లు మాత్రమే కాక, ఇతర డిస్కౌంట్లను కూడా ప్రయాణికులు పొందవచ్చు. ప్రతి 11వ కస్టమర్, ఉచిత టిక్కెట్ను, 111వ కస్టమర్ అన్ని లెమన్ ట్రీ హోటల్ స్టేలో 40 శాతం డిస్కౌంట్ను, 1,111వ కస్టమర్ తిరుగు ప్రయాణ టెక్కెట్స్తో పాటు, రెండు రాత్రులు హోటల్స్లో గడిపే అవకాశాలను గెలుపొందవచ్చు.  
 
అయితే కొన్ని ట్రావెల్ సెక్టార్లలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు అవి..
ముంబాయి-పోర్ట్ బ్లెయిర్- ముంబాయి
బెంగళూరు-పోర్ట్ బ్లెయిర్-బెంగళూర్
చెన్నై-పోర్ట్ బ్లెయిర్-చెన్నై
ఢిల్లీ-లెహ్-ఢిల్లీ
ముంబాయి-లెహ్-ముంబాయి
కోల్కత్తా-పోర్ట్ బ్లెయిర్-కోల్కత్తా
ఢిల్లీ-పోర్ట్ బ్లెయిర్-ఢిల్లీ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement