
ముంబై: భారతదేశంలోని ముంబై కేంద్రంగా స్థాపించిన గోఎయిర్ విమానాయాన సంస్థ విమానయాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు కరోనా టీకాలు వేసుకున్న ప్రయాణీకులకు 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. గోఎయిర్ దేశీయ విమానాలలో ప్రయాణించే ప్రయాణీకులు గోవక్కి పథకాన్ని(GOVACCI Scheme) ఉపయోగించడం ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. విమానయాన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆఫర్ భారతదేశంలో ప్రయాణించే ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుంది.
భారత ప్రభుత్వ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్లడం లేదా ఎయిర్ పోర్ట్ చెక్ ఇన్ కౌంటర్ వద్ద ఆరోగ్య సేతు మొబైల్ యాప్లో వ్యాక్సినేషన్ స్టేటస్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ గో ఫస్ట్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అని కంపెనీ తెలిపింది. భారతదేశం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటడంతో ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో 54 పైగా కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో, గత వారం వచ్చిన కొత్త కోవిడ్-19 కేసులలో సుమారు 73 శాతం ఓమిక్రాన్ కేసులకు సంబంధించినవే.
(చదవండి: ఇక పాకిస్తాన్, చైనాకు చుక్కలే.. పంజాబ్‌లో ఎస్-400 మోహరింపు!)
Comments
Please login to add a commentAdd a comment