కాజీపేట నుంచి చుక్.. చుక్ | Chuck .. Chuck from Kazipet | Sakshi
Sakshi News home page

కాజీపేట నుంచి చుక్.. చుక్

Published Tue, Sep 2 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

కాజీపేట నుంచి చుక్.. చుక్

కాజీపేట నుంచి చుక్.. చుక్

  •       కొత్త రైళ్లు ప్రారంభం
  •      కాజీపేట-ముంబయి, ముంబయి-కాజీపేట
  •      బెల్లంపెల్లి, విజయవాడ మార్గంలో నాలుగు ట్రైన్లు
  •      కాజీపేట మీదుగా రాకపోకలు..మారిన పలు ఎక్స్‌ప్రెస్‌ల వేళలు
  • కాజీపేట రూరల్ : నిజాం రైల్వే కాలంలో నిర్మించిన కాజీపేట జంక్షన్‌కు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక మొదటిసారిగా రైల్వే పరంగా ప్రాధాన్యం లభించింది. ఉత్తర, దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉంటున్న అతి ప్రధానమైన ఈ జంక్షన్ నుంచి దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. 2014-15 రైల్వే బడ్జెట్‌లో రైల్వేమంత్రి సదానందగౌడ ప్రకటించిన మేరకు కాజీపేట-ముంబయి వేళ్లే ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి రాకపోకలు సాగించనుంది. వరంగల్, కరీంనగర్ జిల్లావాసుల 30 ఏళ్ల డిమాండ్‌ను పరిశీలించిన రైల్వే శాఖ ఎట్టకేలకు కాజీపేట జంక్షన్ నుంచి నేరుగా ముంబయికి అప్ అండ్ డౌన్‌లో రెండు సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు కాజీపేట రైల్వే అధికారులు సోమవారం కాజీపేట నుంచి ప్రారంభం కానున్న రైలు, ఈ జంక్షన్ మీదుగా ప్రయాణించే రైళ్ల వేళల్లో మార్పులను వివరించారు.
     
    కాజీపేట-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్

    కాజీపేట జంక్షన్ నుంచి లోకమాన్యతిలక్ టర్మినల్ (ఎల్‌టీటీ) వెళ్లే 11804 నంబర్ గల ముంబయి ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 11083 నంబర్ గల ముంబయి ఎక్స్‌ప్రెస్ ఎల్‌టీటీ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. ఈ రైలుకు అప్ అండ్ డౌన్‌లో జమ్మికుంట, పెద్దపెల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపెల్లి, సిర్‌పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఉంది.
     
    విశాఖపట్నం-సికింద్రాబాద్ ఏసీ ఎక్స్‌ప్రెస్

    12783 నంబర్ గల విశాఖ పట్నం-సికింద్రాబాద్ వెళ్లే  ఏసీ ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు ప్రతి సోమవారం ఉదయం 4.44 గంటలకు చేరుకుని 4.46 గంటలకు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో 12784 నంబర్ గల సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్లే ఏసీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం కాజీపేటకు రాత్రి 7.43 గంటలకు చేరుకుని 7.45 గంటలకు వెళ్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు మౌళాలి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడిపెల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
     
    పలు రైళ్ల వేళల్లో మార్పులు

    కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మారాయి. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 18520 నంబర్ గల ఎల్‌టీటీ-విశాఖపట్నం వెళ్లే లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ కాజీ పేటకు ప్రతి రోజు రాత్రి  11.30 గంటలకు చేరుకుంటుంది. 17250 నంబర్ గల సికింద్రాబాద్-మచిలీపట్నం వెళ్లే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు కాజీపేటకు అర్ధరాత్రి  12.25 గంటలకు వస్తుంది. 12710 నంబర్ గల సికింద్రాబాద్-గూడూరు వెళ్లే సిం హపురి ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు ప్రతిరోజు అర్ధరాత్రి  12.55 గంటలకు చేరుకుంటుంది. 17026 నంబర్ గల సికింద్రాబాద్-మణుగూర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు కాజీపేటకు అర్ధరాత్రి 1.45 గంటలకు వస్తుంది. 12709 నంబర్ గల గూడూర్-సికింద్రాబాద్ వెళ్లే సింహపురి ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు ప్రతి రోజు తెల్లవారుజాము 6.05 గంటలకు చేరుకుంటుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement