Man Hitting Passengers Of Another Moving Train With Belt, Railways Responds To Video - Sakshi
Sakshi News home page

Man Hitting Train Passengers Video: రైలుకు వేలాడుతూ బెల్ట్‌తో బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! 

Published Sat, Jul 8 2023 5:35 PM | Last Updated on Sat, Jul 8 2023 6:12 PM

Man Hitting Passengers Of Another Moving Train With Belt - Sakshi

పాట్నా: బీహార్ ఛప్రా జిల్లాలో ఓ రైలులో ప్రయాణిస్తున్న యువకుడు బిత్తిరి చర్యకు పాల్పడ్డాడు. కదులుతున్న ట్రైన్లో ఒక చేత్తో వేలాడుతూ మరో చేతిలో బెల్టు తోక వైపున పట్టుకుని బకిల్ తగిలేలా పక్క రైల్లో ప్రయాణిస్తున్న వారిని కొడుతూ కనిపించాడు. 

కదులుతున్న ఒక రైలు కంపార్టుమెంట్ డోర్ దగ్గర నిలబడి మరో ట్రైన్ డోర్ వద్ద కూర్చున్న వారిని బెల్టుతో కొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఓ పోకిరి. పక్కనున్నవారు వాడు చేస్తోన్న పాడు పనికి వత్తాసు పలుకుతున్నారు. ఈ ఆకృత్యాన్ని వీడియో తీసి రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు మరో యువకుడు. 

ట్విట్టర్లో వీడియో తోపాటు.. పక్క రైలులో డోర్ వద్ద కూర్చున్న వారిని బెల్టుతో కొడుతున్నాడు. ఇది కరెక్టేనా..? దీని వలన ఈ యువకుడితో పాటు అటువైపున్న వ్యక్తికి కూడా ప్రమాదమే. ఒకవేళ ట్రైన్ నుండి పడిపోయినా దారుణం జరుగుతుంది. దయచేసి ఇలాంటి సంఘ వ్యతిరేక వ్యక్తులపై చర్యలు తీసుకోండి.. అంటూ విజ్ఞప్తి చేశాడు.  

దీని బదులిస్తూ తూర్పు మధ్య రైల్వే.. ఈ సంఘటనను మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకంటామని తెలిపింది.

ఇది కూడా చదవండి: మోదీజీ.. ! ‘నా భార్యా, పిల్లల్ని వెనక్కి పంపించండి’


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement