లక్నో : టికెట్లు కొనుగోలు చేద్దామంటే సమయం లేదు. కూర్చుందామంటే సీటు దొరకడం లేదు. దీంతో కోపోద్రికులైన ప్రయాణికులు రిజర్వేషన్ రైలు బోగీని రాళ్లతో ధ్వంసం చేశారు. అద్దాలను పగుల గొట్టి దౌర్జన్యంగా బోగీలోకి ప్రవేశించారు. ఆ ఘటన సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రైన్ నెంబర్ 15101 అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ రాష్ట్రం సారణ్ జిల్లా ఛప్రా అనే ప్రాంతం నుంచి ముంబైకి వెళ్తుంది. ఆట్రైన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మంకాపూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో టికెట్ కౌంటర్ వద్ద ఉన్న పలువురు ప్రయాణికులు ఆ ట్రైన్‌ను ఎక్కేందుకు ప్రయత్నించారు. చేతిలో టికెట్ లేదు. ఎక్కేందుకు బోగీ తలుపు తెరుచుకోవడం లేదు
దీంతో ట్రైన్‌లోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ముందుగా రిజర్వేషన్ బోగీ మెయిన్ డోర్ అద్దాలు పగుల గొట్టి లోపలికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అదే బోగి కిటికీలను ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద బండరాలతో కిటికీ అద్దాలు,కిటికీ ఇనుప కడ్డీ గ్రిల్స్‌ను తొలగించారు. అనంతరం, లోపలికి వెళ్లారు.
Angry passengers pelted stones at the coach due to non-opening of the gate of 15101 Antyodaya Express at Mankapur railway station, which broke the glass and caused a stampede in the train, the train was going from Chhapra to Mumbai:
pic.twitter.com/Y0N5va5ImS— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024
ఈ ఘటన వీడియోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుండగా.. పలువురు నెటిజన్లు రైల్వే ప్రయాణంలో తమకు ఎదురైన ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తున్నారు. మరికొందరు మాత్రం నార్త్ ఇండియాలో ప్రయాణం నరకంతో సమానం. నేను ప్రతి సారి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఈ ప్రాంతం వైపు చట్టానికి లోబడి ప్రయాణించాలంటే మరో 50 ఏళ్లు పడుతుంది. మరికొందరు బీహార్- జార్ఖండ్ మీదుగా ఏ రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలి. ఎందుకంటే అక్కడి ప్రయాణికులు రైలులో గందరగోళం సృష్టిస్తారు. టికెట్లు కొనుగోలు చేయకుండా ట్రైన్ ఎక్కుతారు. అలాంటి వారి వల్ల తోటి ప్రయాణికుల ఇబ్బంది పడుతుంటారు’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment