శభాష్‌ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్‌ | Man slips between moving train and platform constable save his life Uttarakhand | Sakshi
Sakshi News home page

శభాష్‌ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్‌

Published Wed, May 1 2024 8:05 AM | Last Updated on Wed, May 1 2024 8:11 AM

Man slips between moving train and platform constable save his life Uttarakhand

రైలు ఎక్కేటప్పుడు.. దిగెటప్పుడు ప్రమాదాలు  జరుగుతుంటాయి. రైలు కదులుతుంటే పట్టాలు, ప్లాట్‌ఫామ్‌ మధ్య  ఇరుక్కొని కొంత మంది ప్రాణాలు కోల్పోతే.. మరికొంత మంది అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌( ఆర్‌పీఎఫ్‌) పోలీసుల సాహసంతో ప్రాణాలు దక్కించుకున్నవారు ఉన్నారు. అటువంటి ఘటనే ఒకటి హరిద్వార్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళా ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ రైలు కింది పడిన వ్యక్తిని సాహసంతో​ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు. 

వివరాల్లోకి వెళ్లితే... ఉత్తరాఖండ్‌  హరిద్వార్‌కు సమీపంలోని  లక్సర్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు ఆహారం కోసం రైలు దిగాడు. అతను దిగిన రైలు కదలటంతో పరుగుపెట్టి మరీ ఎక్కడానికి ప్రయిత్నించాడు. కానీ, రైలు వేగంగా ఉండటంతో ఒక్కసారిగా డోర్‌ వద్ద అదుపుతప్పి రైలు పట్టాలు, ప్లాట్‌ మధ్యలో పడిపోయాడు. అప్పటికే రైలు కదులుతోంది. ప్రయాణికుడు రైలు కింద పడినట్లు శబ్దంతో రావటంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వెంటనే వచ్చి.. ముందుగా ఆ ప్రయాణికుడి తలను ప్లాట్‌పైకి లాగింది. 

వెంటనే రైలును అత్యవసరంగా ఆపారు.  తర్వాత ఆ ప్రయాణికుడిని ప్లాట్‌ఫామ్‌కి లాగారు. క్షణాలో సమయస్ఫూర్తితో స్పందించిన ఆర్పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. ప్రయాణికుడిని  రక్షించి కానిస్టేబుల్‌ కే. సుమతి రై​ల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని కాపాడిన వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement