కోర్టులోకి అడవి ఏనుగు ఎంట్రీ.. జనం హడల్! | Panic At Uttarakhand Court After Wild Elephant Enters Compound | Sakshi
Sakshi News home page

వీడియో: కోర్టులోకి అడవి ఏనుగు ఎంట్రీ.. జనం హడల్!

Published Thu, Dec 28 2023 11:37 AM | Last Updated on Thu, Dec 28 2023 1:18 PM

Panic At Uttarakhand Court After Wild Elephant Enters Compound - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఓ కోర్టులో అడవి ఏనుగు అలజడి సృష్టించింది. గేటును ఢీకొట్టి కోర్టు ప్రాంగణంలోకి ఏనుగు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హరిద్వార్‌ రోషనాబాద్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులో ఈ ఘటన జరిగింది. 

రాజాజీ టైగర్ రిజర్వ్ నుండి బయటికి వచ్చిన అడవి ఏనుగు.. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలోకి చొరబడింది. కోర్టు ఆవరణలో తిరుగుతూ గందరగోళం సృష్టించింది. కోర్టు గేట్లను తోసేసి గోడను కూడా ధ్వంసం చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Video Credits: India Rising Show

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏనుగు కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు కోర్టు ప్రధాన గేటును అమాంతం పక్కకు తోసేసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి వచ్చి ఆ ఏనుగును అడవిలోకి తరలించారు. 

ఇదీ చదవండి: హైదరాబాద్‌ నుంచే అయోధ్య రామ మందిర తలుపులు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement