East Central Railway
-
రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు!
పాట్నా: బీహార్ ఛప్రా జిల్లాలో ఓ రైలులో ప్రయాణిస్తున్న యువకుడు బిత్తిరి చర్యకు పాల్పడ్డాడు. కదులుతున్న ట్రైన్లో ఒక చేత్తో వేలాడుతూ మరో చేతిలో బెల్టు తోక వైపున పట్టుకుని బకిల్ తగిలేలా పక్క రైల్లో ప్రయాణిస్తున్న వారిని కొడుతూ కనిపించాడు. కదులుతున్న ఒక రైలు కంపార్టుమెంట్ డోర్ దగ్గర నిలబడి మరో ట్రైన్ డోర్ వద్ద కూర్చున్న వారిని బెల్టుతో కొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఓ పోకిరి. పక్కనున్నవారు వాడు చేస్తోన్న పాడు పనికి వత్తాసు పలుకుతున్నారు. ఈ ఆకృత్యాన్ని వీడియో తీసి రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు మరో యువకుడు. ట్విట్టర్లో వీడియో తోపాటు.. పక్క రైలులో డోర్ వద్ద కూర్చున్న వారిని బెల్టుతో కొడుతున్నాడు. ఇది కరెక్టేనా..? దీని వలన ఈ యువకుడితో పాటు అటువైపున్న వ్యక్తికి కూడా ప్రమాదమే. ఒకవేళ ట్రైన్ నుండి పడిపోయినా దారుణం జరుగుతుంది. దయచేసి ఇలాంటి సంఘ వ్యతిరేక వ్యక్తులపై చర్యలు తీసుకోండి.. అంటూ విజ్ఞప్తి చేశాడు. దీని బదులిస్తూ తూర్పు మధ్య రైల్వే.. ఈ సంఘటనను మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకంటామని తెలిపింది. ఇది కూడా చదవండి: మోదీజీ.. ! ‘నా భార్యా, పిల్లల్ని వెనక్కి పంపించండి’ यह व्यक्ति दुसरे ट्रेन में दरवाजे के पास बैठे लोगों को बेल्ट से मार रहा है, क्या यह सही है 🤔 इस व्यक्ति के बेल्ट से मारने के कारण दरवाजे में बैठा व्यक्ति ट्रेन से गिर भी सकतें है,बड़ी दुर्घटना भी हो सकती है कृपया ऐसे आसामाजिक आतंकी लोगों पर कड़ी कार्यवाही करें 🙏@RailMinIndia… pic.twitter.com/BQEgHWe9rO — देव 🚩 (@I_DEV_1993) July 7, 2023 -
భారీ సంఖ్యలో అప్రెంటిస్ జాబ్స్.. రైల్వే నోటిఫికేషన్
ఐటీఐ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్. వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 2226 అప్రెంటిస్‌లు జబల్పూర్ పధాన కేంద్రంగా ఉన్న వెస్ట్ సెంట్రల్ రైల్వే, రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ).. 2021–22 సంవత్సరానికి గాను వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 2226 ► ట్రేడులు: డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, వైర్‌మెన్, కార్పెంటర్, పెయింటర్ తదితరాలు. ► అర్హత: 50శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ/ఎస్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.01.2022 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించి న మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021 ► వెబ్సైట్: https://wcr.indianrailways.gov.in ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 2206 అప్రెంటిస్‌లు పాట్నా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఈసీఆర్)కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ).. వివిధ డివిజన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం ఖాళీల సంఖ్య: 2206 ► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్(డీజిల్), కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, వైర్‌మెన్ తదితరాలు. ► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ/ఎస్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.01.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.11.2021 ► వెబ్సైట్: https://ecr.indianrailways.gov.in సౌత్ వెస్టర్న్ రైల్వే, హుబ్లిలో 904 అప్రెంటిస్‌లు హుబ్లిలోని సౌత్ వెస్టర్న్ రైల్వే(ఎస్డబ్ల్యూఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 904 ► డివిజన్ల వారీగా ఖాళీలు: హుబ్లి డివిజన్–237, క్యారేజ్ రిపెయిర్ వర్క్‌షాప్–217, బెంగళూరు డివిజన్–230, మైసూరు డివిజన్–177, సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు–43. ► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ/ఎస్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 03.11.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021 ► వెబ్సైట్: www.rrchubli.in -
మద్యం మత్తులో రైలునే ఢీకొట్టేందుకు..
రాంచీ : మద్యం మత్తులో ఓ వ్యాన్ డ్రైవర్ చేసిన పనికి ఏకంగా కొన్ని రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది. జార్ఖండ్ లోని పలము జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన రైల్వే అధికారులను ఆందోళనకు గురిచేసింది. అశోక్ పాశ్వాన్ అనే డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో తన వ్యాన్‌ను రోడ్డుపై కాకుండా రైలు పట్టాలపై నడిపాడు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్) ధన్‌బాద్ డివిజన్లోని రాజ్హరా-లాల్‌ఘడ్, బర్వాది-సన్ నగర్ రైల్వే స్టేషన్ల మధ్య వ్యాన్‌తో డ్రైవర్ హల్చల్ చేశాడు. రైలు వచ్చే మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైలునే ఢీకొట్టేందుకు ఓ డ్రైవర్ వ్యాన్ తో వస్తున్నాడని రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు టాటా-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ రైలును వ్యాను వెళ్తున్న ప్రాంతానికి కొద్ది దూరంలో నిలిపివేశారు. డ్రైవర్ అశోక్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అరుణ్ రామ్ శుక్రవారం వెల్లడించారు. రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ సిన్హా ఇచ్చిన సమాచారంతోనే ప్రమాదాన్ని అడ్డుకోగలిగినట్లు వివరించారు. ఆ సమయంలో వ్యానులో ఎవరైనా ఉన్నారన్న వివరాలు తెలియరాలేదు. -
ఈసీఆర్ ఔదర్యం
పాట్నా: నేపాల్ నుంచి వచ్చే భూకంప బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు తూర్పు సెంట్రల్ రైల్వే(ఈసీఆర్) ఔదర్యం చూపింది. బాధితుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయకుండా ఉచితంగా తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం జీరో వేల్యూ టిక్కెట్లు అందుబాటులోకి తెచ్చినట్టు ఈసీఆర్ జనరల్ మేనేజర్ ఏకే మిట్టల్ తెలిపారు. 7 వేల మంది బాధితుల కోసం ఈ టిక్కెట్లు ప్రవేశపెట్టామని చెప్పారు. నేపాల్ నుంచి వచ్చే భూకంప బాధితుల కోసం సరిహద్దులోని రాజ్సాల్, జయనగర్, సీతామార్చి రైల్వేస్టేషన్లలో ఈ టిక్కట్లు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. బాధితులు జీరో వేల్యూ టిక్కెట్లతో ఉచితంగా రైల్లో ప్రయాణించవచ్చని వివరించారు.