రాంచీ : మద్యం మత్తులో ఓ వ్యాన్ డ్రైవర్ చేసిన పనికి ఏకంగా కొన్ని రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది. జార్ఖండ్ లోని పలము జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన రైల్వే అధికారులను ఆందోళనకు గురిచేసింది. అశోక్ పాశ్వాన్ అనే డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో తన వ్యాన్‌ను రోడ్డుపై కాకుండా రైలు పట్టాలపై నడిపాడు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్) ధన్‌బాద్ డివిజన్‌లోని రాజ్‌హరా-లాల్‌ఘడ్, బర్వాది-సన్ నగర్ రైల్వే స్టేషన్ల మధ్య వ్యాన్‌తో డ్రైవర్ హల్‌చల్ చేశాడు.
రైలు వచ్చే మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైలునే ఢీకొట్టేందుకు ఓ డ్రైవర్ వ్యాన్ తో వస్తున్నాడని రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు టాటా-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ రైలును వ్యాను వెళ్తున్న ప్రాంతానికి కొద్ది దూరంలో నిలిపివేశారు. డ్రైవర్ అశోక్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ రామ్ శుక్రవారం వెల్లడించారు. రైల్వే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ కుమార్ సిన్హా ఇచ్చిన సమాచారంతోనే ప్రమాదాన్ని అడ్డుకోగలిగినట్లు వివరించారు. ఆ సమయంలో వ్యానులో ఎవరైనా ఉన్నారన్న వివరాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment