ఈసీఆర్ ఔదర్యం
పాట్నా: నేపాల్ నుంచి వచ్చే భూకంప బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు తూర్పు సెంట్రల్ రైల్వే(ఈసీఆర్) ఔదర్యం చూపింది. బాధితుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయకుండా ఉచితంగా తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం జీరో వేల్యూ టిక్కెట్లు అందుబాటులోకి తెచ్చినట్టు ఈసీఆర్ జనరల్ మేనేజర్ ఏకే మిట్టల్ తెలిపారు.
7 వేల మంది బాధితుల కోసం ఈ టిక్కెట్లు ప్రవేశపెట్టామని చెప్పారు. నేపాల్ నుంచి వచ్చే భూకంప బాధితుల కోసం సరిహద్దులోని రాజ్సాల్, జయనగర్, సీతామార్చి రైల్వేస్టేషన్లలో ఈ టిక్కట్లు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. బాధితులు జీరో వేల్యూ టిక్కెట్లతో ఉచితంగా రైల్లో ప్రయాణించవచ్చని వివరించారు.