నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్‌ తలాక్‌! | Man Gives Triple Talaq to Wife in Moving Train | Sakshi
Sakshi News home page

నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్‌ తలాక్‌!

May 2 2024 9:27 AM | Updated on May 2 2024 4:44 PM

Man Gives Triple Talaq to Wife in Moving Train

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాద్‌లో ట్రిపుల్‌ తలాక్‌ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకున్నారు.

బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్‌ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ  ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్‌కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్‌ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్‌ అసద్‌ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడని ఆమె తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement