migrant labourer
-
వలస కార్మికుల మెడపై దేశ బహిష్కరణ కత్తి
నుపూర్ శర్మ బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు విదేశాల్లో బతుకుతున్న వలస కార్మికులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి భవిష్యత్తును అగమ్యగోచరంలో పడేశాయి. ఇందుకు సంబంధించిన ప్రకంపనలు ముందుగా కువైట్‌లో మొదలయ్యాయి. నుపూర్ శర్మ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపిన విషయం విదితమే. దీనిపై గల్ఫ్ దేశాధినేతలు తమ అభిప్రాయాలను భారత రాయబారులకు తెలిపారు. ఖతార్ లాంటి దేశాల్లో భారత వస్తువులను నిషేధించాలనే దాక వ్యవహారం వెళ్లింది. ఇంతలో భారత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అయితే గల్ఫ్ దేశాలు తమ ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవడంలో విఫలం కావడంతో భారత ప్రభుత్వం కూడా దౌత్యపరంగా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేయడంతో గల్ఫ్ దేశాలు పునరాలోచనలో పడ్డాయి. నుపూర్‌శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ గల్ఫ్ దేశాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ఏమవుతుందో ఏమో అనే భయంతో కొందరు, నుపూర్ వ్యాఖ్యలను నొచ్చుకున్న మరికొందరు వలస కార్మికులు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ర్యాలీలు చేశారు. నినాదాలు వినిపించారు. ఇప్పుడు ఇలా ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్న వలస కార్మికులను కువైట్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. అక్కడి చట్టాల ప్రకారం వలస కార్మికులకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు లేదంటూ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వలస కార్మికులను వెంటనే గుర్తించి వారి దేశాలకు పంపించి వేస్తామంటూ హుకుం జారీ చేసింది. అంతేకాదు వారు భవిష్యత్తులో కువైట్‌లో పని చేసుకునే అవకాశం ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు నిరసనలో పాల్గొన్న వలస కార్మికులను గుర్తించే పని మొదలెట్టింది. కువైట్‌లో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఫిలిప్పీన్ దేశాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. అయితే వీరిలో భారతీయులే అధికం. ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వలస కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అప్పులు చేసి అక్కడికి చేరుకున్న వారిని ఉన్న పళంగా వెనక్కి పంపిస్తే వారి కుటుంబాలు మరింత చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. చదవండి: సౌదీలో దుబ్బాక వాసి మృతి.. మమ్మీ నాన్న రాడా అంటూ.. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రవాసి సహాయతా కేంద్రం
ఉపాధి కోసం వలస వెళ్లే కార్మికుల కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)లు సంయుక్తంగా ఈ హెల్ప్‌డెస్క్‌ని ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నిత్యం కార్మికులు వలస కార్మికులు ప్రయాణం చేస్తున్న దృష్ట్యా వారికి సహాయకారిగా ఉండేందుకు ఈ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని ఈ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం కువైల్, అబుదాబి, యూఏఈ, ఖతార్, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు కార్మికులు వెళ్తుంటారు. అయితే సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల విదేశాలకు వెళ్లిన తర్వాత అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు వలస కార్మికులకు ఉండే హక్కులపై అవగాహన లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు, తగు సూచనలు ఇచ్చేందుకు ఈ డెస్క్ ఎంతో తోడ్పాటు అందివ్వనుంది. చదవండి: లైఫ్ అండ్ డెత్ ఇన్ ద గల్ఫ్ -
వలస కార్మికుల ఆశలు ఆవిరి
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకునే విషయంలో మొదట వెనక్కి తగ్గిన కువైట్ ప్రభుత్వం మళ్లీ చర్యలు తీసుకుంటోంది. డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ల వయసు నిండిన విదేశీ వలస కార్మికుల వీసాల రెన్యువల్‌కు సానుకూలత తెలిపిన కువైట్ ప్రభుత్వం అంతలోనే మనసు మార్చుకుంది. తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికులలో 60 ఏళ్ల వయసు నిండినవారికి డిగ్రీ పట్టా లేకుంటే వారిని సొంత గడ్డకు పంపించాలని 2020 డిసెంబర్లో కువైట్ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ నిబంధనను అమలు చేస్తే తమ దేశంలోని వివిధ కంపెనీలలో ఉన్న ఎంతో మంది నిపుణులను కోల్పోవలసి వస్తుందని భావించిన కువైట్ సడలింపులు ఇచ్చింది. దీని ప్రకారం 250 దినార్లు అంటే మన కరెన్సీలో రూ.60 వేల వరకు ఫీజును చెల్లించి 60 ఏళ్లు పైబడిన వలస కార్మికులు వీసాను రెన్యువల్ చేసుకోవచ్చని సూచించింది. దీంతో ఈ కేటగిరీలోని కార్మికులు కాస్త ఊరట చెందారు. సీనియారిటీ ఉన్న వలస కార్మికులకు రూ.50 వేలకు మించి వేతనాలు ఉన్నాయి. కువైట్ ప్రభుత్వం సూచించిన ఫీజు చెల్లిస్తే నెల నుంచి 40 రోజుల వేతనం ఖర్చు చేస్తే సరిపోతుందని వలస కార్మికులు భావించారు. కువైట్‌లోని ఆయిల్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు, మాల్స్ ఇలా ఎన్నో రంగాల్లో 1.75 లక్షల మంది వరకు తెలంగాణకు చెందిన వలస కార్మికులు ఉంటారని అంచనా. ఇందులో డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ల వయసు నిండిన వలస కార్మికుల సంఖ్య 30 వేల వరకు ఉంటుంది. కువైట్ ప్రభుత్వం ఇప్పుడు వీసాలను రెన్యువల్ చేయకపోవడంతో వీసా గడువు ముగిసిన వారు ఇంటికి చేరుకోవాల్సి వస్తోంది. చదవండి: విదేశాల్లో వైద్య విద్యకు ఎన్ఎంసీ కఠిన నిబంధనలు -
సీనియర్ వలస కార్మికులకు శుభవార్త! వీసాల విషయంలో వెనక్కి తగ్గిన కువైట్
ఎన్నాళ్ల నుంచో రెక్కలు ముక్కలు చేసుకుని దేశ అభివృద్ధికి పాటుపడిన సీనియర్ ప్రవాస కార్మికులకు చేటు తెచ్చే నిబంధనల విషయంలో కువైట్ సర్కార్ వెనక్కి తగ్గింది. వయసుపై బడిన కార్మికుల ఇబ్బందులు, వారి సేవలను దృష్టిలో ఉంచుకుని వర్క్ పర్మిట్ వీసా నిబంధనల్లో పలు సవరణలు చేసింది. కువైట్ ప్రభుత్వం ఇటీవల వర్క్ పర్మిట్ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. డిగ్రీ విద్యార్హత లేని 60 ఏళ్లుపై బడిన వలస కార్మికులకు వర్క్ పర్మిట్ వీసాలను రెన్యువల్ చేయడానికి నిరాకరించింది. పనుల్లో వీరి స్కిల్ సరిపోవడం లేదని, శ్రమ కూడా తగ్గిపోతుందనే నెపంతో కువైత్ ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 4,000ల మంది వలస కార్మికులు ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దీంతో కువైత్ ప్రభుత్వ నిర్ణయం పట్ల విమర్శలు ఎక్కువగా వచ్చాయి. దీంతో వర్క్ పర్మిట్ వీసా నిబంధనలకు సంబంధించి తాజాగా జారీ చేసిన గెజిట్‌ను ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంది. మరో ఏడాది తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో డిగ్రీ లేని, 60 ఏళ్లు పైబడిన సీనియర్ వలస కార్మికులకు ఊరట లభించింది. ఎప్పటిలాగే వారు 250 కువైట్ దినార్లు (రూ.61,000) చెల్లించి తమ వర్క్ పర్మిట్‌ను రెన్యూవల్ చేయించుకోవచ్చు. చదవండి: దేశం కాని దేశంలో భారత మహిళ ఒంటరి పోరాటం -
వలస కార్మికులకు ఉచిత వీసాలు, విమాన టిక్కెట్లు
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని కొన్ని కంపెనీలు వలస కార్మికులకు తిరిగి స్వాగతం చెబుతున్నాయి. గతంలో వీసాల జారీ కోసం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు చార్జీలు వసూలు చేసిన ఏజెన్సీలు ప్రస్తుతం ఉచిత రిక్రూటింగ్‌ను చేపట్టాయి. కరోనా కారణంగా కంపెనీలు భారీ సంఖ్యలో కార్మికులను ఇళ్లకు పంపించేయడంతో అనేక పోస్టులు ఖాళీ అయ్యాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, కంపెనీల కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఇప్పుడు వలస కార్మికుల సేవలు అత్యవసరం అయ్యాయి. దీంతో యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టులలో క్లీనింగ్ పని కోసం పలు ఏజెన్సీలు కార్మికులను తరలిస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల్, ఆర్మూర్‌లలో ఒక ఏజెన్సీ కొన్ని రోజులుగా ఉచిత రిక్రూటింగ్‌ను కొనసాగిస్తోంది. కేవలం రూ.5 వేలను సర్వీస్ చార్జీలుగా వసూలు చేస్తూ ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్లను ఇచ్చి యూఏఈ పంపిస్తోంది. గతంలో గల్ఫ్ దేశాలకు వలసలు మొదలైన ఐదు దశాబ్దాల కింద ఉచిత రిక్రూటింగ్ జరిగింది. ఇదిలాఉండగా ఇక్కడి వారికి ఉచిత నియామకాలపై అవగాహన లేకపోవడంతో మన ప్రాంతంలో కొనసాగుతున్న ఇంటర్వ్యూలకు పొరుగు రాష్ట్రాల కార్మికులు హాజరవుతుండటం విశేషం. ఇప్పటివరకు ఏపీ, కేరళ రాష్ట్రాలకు చెందిన దాదాపు 2వేల మందిని యూఏఈ తరలించినట్లు ఏజెన్సీ నిర్వాహకులు వివరించారు. -
‘గల్ఫ్‌బంధు’తో ఆదుకోండి
మోర్తాడ్ (బాల్కొండ): దళితులు ఆర్థికంగా వృద్ధి చెందడానికి అమలు చేస్తున్న దళితబంధు పథకం తరహాలోనే గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్‌బంధు పథకాన్ని అమలు చేయాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గల్ఫ్ వలస కార్మికులకు అన్ని రకాలుగా ప్రయోజనాలను కల్పించడానికి ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆచరణలో అది కార్యరూపం దాల్చలేదు. మరో పక్క గల్ఫ్‌దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అండగా ఉండటానికి గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ హామీ 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా గల్ఫ్ కార్మికుల ఆంశం చర్చకు వచ్చింది. గల్ఫ్ వలస కార్మికుల వల్ల దేశానికి, రాష్ట్రానికి ఆర్థికంగా లాభం జరుగుతోందని, అందువల్ల వారి శ్రేయస్సు కోసం ఒక మంచి పథకాన్ని అమలులోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు గల్ఫ్ కార్మికుల కోసం ఎలాంటి పథకం అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో దళితుల అభివృద్ధి కోసం రూ.10 లక్షల నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తున్న విధంగానే గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గల్ఫ్‌బంధు అమలు చేయాలని కార్మికుల నుంచి, వారికి అండగా ఉంటున్న సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కనీసం గల్ఫ్‌బంధు పథకం అమలు చేస్తే తెలంగాణ జిల్లాల్లో ఉన్న సుమారు 13 లక్షల గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా అండ దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేయూతనివ్వాలి – ఎస్వీరెడ్డి, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గల్ఫ్ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్‌బంధు అమలు చేయాలి. గల్ఫ్ కార్మికులలో కొందరే ఆర్థికంగా స్థిరపడ్డారు. మెజార్టీ కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. గల్ఫ్ కార్మికులకు చేయూతనివ్వడం ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలి – నంగి దేవేందర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు, గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధి గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నోమార్లు హామీ ఇచ్చింది. ఆ హామీలను నిలబెట్టుకోవడానికి దళితబంధు తరహాలో గల్ఫ్‌బంధు లేదా మరేదైనా పథకం అమలు చేయాల్సిందే. -
ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లమంది ఎన్ఆర్ఐలు
విశ్వవ్యాప్తంగా అధిక సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిశీలించి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ, 1990 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని మేరకు డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది. వలస అంటే బతుకుదెరువు కోసం, లేదా ఆర్థికాభివృద్ధి కోసం చేసుకునే ‘నివాస మార్పు‘గా భావించవచ్చు. ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. వలసలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వలస వెళ్లేలా ‘నెట్టివేయబడే’ పరిస్థితులు కొన్నైతే, వున్నచోట పరిస్థితులు అనుకూలంగా లేక మరొక చోట ‘ఆకర్షణీయంగా’ ఉండడం మరొక కారణం. చదవండి:డాక్టర్ ఫస్ట్ లేడీ అంటే తప్పేంటి!? పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ వలస వెళ్లడాన్ని ‘అంతర్గత వలసలు’ అంటారు. ఒకదేశం నుంచి మరొకదేశానికి వెళ్లడాన్ని ‘అంతర్జాతీయ వలసలు’ అంటారు. ప్రవాసులకు రాయితీలు కల్పిస్తూ వారిని ప్రాత్సహిస్తే అభివృద్ధి సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలలో 3 కోట్లమంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారని అంచనా. తెలంగాణ ప్రాంతం నుంచి 1970లో వలసలు ప్రారంభమయ్యాయి. అప్పుడే గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ నిల్వలు బయటపడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది. ఇక్కడ బతుకు దెరువులేని రైతులకు, వ్యవసాయ కూలీలకు అక్కడ మంచి అవకాశం దొరికింది. పొట్టకూటి కోసం వెళ్లిన వలస కార్మికులకు అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు అండగా ఉండాలి. తమ ఉనికిని కాపాడుకుంటూ, మాతృదేశంపై మమకారం చూపుతూ మరెందరికో సహకారాన్ని అందిస్తున్న, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అనే మాటను నిజం చేయాల్సిన బాధ్యత కూడా ప్రవాసుల మీదవుంది. – రఘుపతిరావు గడప మొబైల్ : 99634 99282 -
తిరిగొస్తున్నారు !
సాక్షి, విజయవాడ: వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని కష్ట జీవులు.. చేతి వృత్తుల్లో నిష్ణాతులు. వారి చేతిలో అందమైన డైనింగ్ టేబుల్స్, షోకేసులు, బీరువాలు, భవనాలు, స్వర్ణాభరణాలు అపురూపంగా తయారవుతుంటాయి. అయితే మహమ్మారి కరోనా వారీ జీవితాలను ఛిద్రం చేసింది. లాక్డౌన్ మొదట్లో బతుకు జీవుడా అంటూ సొంతూరు బాట పట్టిన వీరు ఇప్పుడు ఆర్థిక, ఆకలి బాధతో తిరిగి నగరానికి వలస వస్తున్నారు. స్వస్థలాల నుంచి తిరుగుముఖం.. ఉత్తరప్రదేశ్, బీహర్, ఛత్తీస్గడ్, రాజస్థాన్, పశ్చిమబంగా, ఒడిశా తదితర ప్రాంతాల నగరానికి పలువురు కూలీలు వలస వస్తున్నారు. వీరు ఫర్నీచర్, స్వర్ణాభారణాలు, నిర్మాణ రంగంల్లోనూ పనులు చేస్తుంటారు. ముఖ్యంగా యువకులు అక్కడ నుంచి ఇక్కడకు వచ్చి పనులు చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుని తమ తమ ప్రాంతాల్లోని పండుగలకు వెళ్తూ ఉంటారు. అయితే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఉపాధి, ఆదాయం లేక ఇబ్బంది.. తమ సొంత వారిని కలిశామని తృప్తి అయితే ఉంది కాని అక్కడ పనులు చేసుకుందామంటే తగినంత ఉండక.. కుటుంబ పోషణ కష్టమై ఇబ్బందులు పడ్డామని పలువురు కూలీలు చెబుతున్నారు. దీంతో తిరిగి ఇక్కడకు వచ్చేయడమే మంచిదని అందరం కలిసి ఇక్కడికి వచ్చేశామని చెబుతున్నారు. యజమానులు ప్రోత్సాహం.. గతంలో తమ వద్ద పనిచేసే చేతి వృత్తుల వారు స్వస్థలాలకు వెళ్లిన తర్వాత ఇక్కడ వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో పనులు ఆగిపోకూడదని, వెళ్లిన కూలీలను వెనక్కు రమ్మని యజమానులు ప్రోత్సహిస్తున్నారు. అవసరమైతే కొంత ఆర్థిక సహాయం అడ్వాన్స్‌గా అందిస్తున్నారు. దీంతో తమ పాత పనులు ఉన్నాయని తెలుసుకుని వెనక్కు వచ్చేస్తున్నారు. ఇలా నగరంలో సుమారు 40శాతం మంది కూలీలు వెనక్కు వచ్చి ఉండవచ్చని షాపు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చెబుతున్నారు. కరోనా జాగ్రత్తలతో పనులు వెనక్కు వచ్చిన వలస కూలీలు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దూరం దూరం కూర్చుని పనిచేస్తున్నారు, మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతూ, వేడివేడి భోజనం తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. -
'తాపీ'గా లేరు!
కూలన్నా నీ ఆకలినెవరు తీర్చేరూ!బేల్దారన్నా నీ దాహమెవరు తీర్చేనూ!పనుల్లోన మేటి అన్నామెళకువల్లో సాటినీవన్నాతలెత్తుకుని నాడు బతికావుతలదించుకొని నేడు చితికావుతాపీ పడితేనే భవనాలు నిలబడెబొచ్చ..పార ఉంటేనే ఇల్లు పూర్తయ్యెపది అంతస్తులు కూడా నీ ముందు మోకరిల్లెఅపార్టుమెంట్లైనా సలాము చేసేఇంటిలోన పెళ్లాము బిడ్డలునీకోసము చూసేకరోనా సమయంలో ఆకలితో అలమటించేఈ కోవిడ్‌కు కరుణలేదు.. జాలిలేదుచైనా దేశము నుంచి పగబట్టి వచ్చేనుఎప్పటికి పోతుందో ఈ జాడ్యముఎన్నటికి నశిస్తుందో ఈ దారిద్య్రము ఒంగోలు వన్‌టౌన్: అందమైన భవనాలు, రంగుల మేడలు, అబ్బుర పరిచే నిర్మాణాల నైపుణ్యం వెనుక తాపీ మేస్త్రీ కృషి, కష్టం ఎంతో ఉంటుంది. లాక్డౌన్ ముందు చేతినిండా పని.. క్షణం తీరిక లేని వారి జీవితాల్లోకి కరోనా మహమ్మారి రావటంతో వారి బతుకులు తలకిందులయ్యాయి. ప్లాస్టింగ్ చేసినంత సాఫీగా వారి జీవితాలు లేవు. జిల్లా వ్యాప్తంగా కూలీలు, గుంతలు తీసేవారు, తాపీ మేస్త్రీలు, రాడ్‌బెండింగ్ పనులు చేసేవారు, సెంట్రింగ్ పనులు చేసేవారు. ప్లంబ్లర్లు, పెయింటర్లు, చెక్క పని చేసేవారు, ఎలక్ట్రీషియన్లు, గ్రిల్స్ చేసేవారు.. సీలింగ్ వర్క్ చేసేవారు, ఇలా రకరకాల పనులు చేసే కార్మికులున్నారు. ఇలాంటివారు మన జిల్లాలోనే 1, 47, 614 మంది పేర్లు సమోదు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నమోదు చేసుకోని వారు మరో 10 వేల మంది వరకు ఉండవచ్చుని అంచనా. కూలీలుగా ఇతర రాష్ట్రలకు పనులు నిమిత్తం వెళ్లేవారు 40 వేల మంది వరకు ఉంటారు. ప్రకాశం జిల్లాలో నిన్న మొన్నటి వరకు ఆర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మాణాలు జరిగేవి. ఎక్కువగా ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్కాపురం ప్రాంతాల్లో గడిచిన 10 సంవత్సరాల నుంచి అపార్టుమెంట్ కల్చర్ బాగా పెరగడంతో కూలీలకు మేస్త్రీలకు చేతినిండా పని దొరుకుతోంది. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు మేస్త్రీలు కూలీలను తీసుకొని పనులకు వచ్చేవారు. ఎక్కువ రోజుల పని అయితే ఇతర జిల్లాలకు కూడా వెళుతుంటారు. ప్రస్తుతం పనులు లేక వారి జీవితాలు పూట గడవని పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా ముందు ప్రారంభమైన భవనాలు ప్రస్తుతం ప్రారంభించడానికి భవనా యజమానులు, బిల్డర్లు జంకుతున్నారు. కరోనాకు తోడు వర్షాకాలం కావడంతో నిర్మాణాలు చేపట్టరు. ఒకవేళ కట్టినా యజమానులకు, బిల్డర్లకు నష్టం తప్ప లాభాముండదు. దీంతో ప్లాస్టింగ్ పనులకే పరిమితమవుతారు. ప్రతిఏటా నవంబర్ నుంచి మే నెల వరకు భవనాలు నిర్మిస్తుంటారు. వార్షాకాలంలో భవనం లోపల పనులు చేపడుతుంటారు. ఇలా మూడు పువ్వులు, ఆరు కాయలుగా బతికిన జీవితాలు ఇప్పుడు పనుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం దగ్గర నగదు లభ్యత లేక సిమెంట్ ఇటుక ధరలు పెరగటంతో నిర్మాణ రంగంపై భారం పడింది. వాటికి తోడు కరోనా వైరస్, వర్షాకాలం తోడవడంతో కార్మికుల భవిష్యత్తు మీద భరోసా కోల్పోయేలా చేసింది. ఇటుక మీద ఇటుక నిలబెట్టి అందమైన భవనాన్ని నిర్మించిన చేతులు ఈ రోజు పనికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. లాక్డౌన్ సడిలింపుల తర్వత దేశవ్యాప్తంగా భవన నిర్మాణం మొదలు కాలేదు. కరోనా భయం పెరగటంతో ఇప్పుడు బిల్డర్లు కన్స్ట్రక్షన్ ఊసే ఎత్తటం లేదు. మేస్త్రీలను నమ్ముకుని రోజూ కూలీలకు వెళ్లే కూలీల పరిస్థితి దారణంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నెలలో వారం రోజుల పని కూడా దొరకటం కష్టంగా మారింది. అప్పులతో కుస్తీ.. ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి పనులు దొరికినప్పుడు అప్పులు తీర్చుకుందాములే అన్న ఆశతో బతుకుతున్నారు. భవనాల నిర్మాణంలో క్షణం తీరిక లేకుండా పని చేసిన చేతులు నేడు పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిగా స్థిర పడిన వారి పరిస్థితి పర్వలేదు గానీ.. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, వ్యాపారస్తులు నిర్మాణాలపై కాకుండా ఇంటి ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో చిన్న రిపేర్లు వస్తే మేస్త్రీ వచ్చేదాకా అదేపనిగా ఫోన్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక్క కూలీ, ఒక్క మేస్త్రీతో మాత్రమే చేయించుకుంటున్నారు. ఈ కరోనా కష్టం వర్షాకాలం తర్వాత అయినా పోదా అని ఎదురు చూస్తున్నారు. మరి కొంత సమయం పడుతుంది నిత్యం పనులతో సంతోషంగా ఉండే మేస్త్రీలు, కూలీల పరిస్థితి ప్రస్తుతం ఆశా జనకంగా లేదు. కరోనా ముందు పనుల కోసం మేస్త్రీ ఇంటికి వచ్చి తీసుకొని వెళ్లేవారు. ఒక్క అపార్టుమెంట్ పనికి వెళ్తే సుమారు 6 నెలల వరుకు చేతి నిండా పని ఉంటుంది. ప్రస్తుతం పనులు కోసం కూలీలు, మేస్త్రీ ఎదురు చూస్తున్నారు. కూలీలను ప్రభుత్వమే ఆదుకోవాలి రెక్కాడితే డొక్కాడని పరిస్థితి కూలీలది. 4 నెలలుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రేషనే దిక్కుగా మారింది. కూలీలకు పని ఉంటే ఎంత దూరం అయినా వెళ్లి పని చేసేవారు. ప్రస్తుతం చేద్దామన్న పని దొరకటం లేదు. ప్రభుత్వమే పనులు కల్పించేల చర్యలు తీసుకోవాలి. -
అప్పులు చేసి.. బిల్లులు కట్టి..
సాక్షి, హైదరాబాద్: కరోనా కోరల్లో చిక్కి బతుకుజీవుడా అంటూ స్వదేశానికి తిరుగుముఖం పట్టి న ప్రవాసీలను హోం క్వారంటైన్ ఆర్థికంగా మ రింత చితికిపోయేలా చే స్తోంది. వందేభారత్ మి షన్లో భాగంగా గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వారి ని రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 250 విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లను ఏర్పాటు చేయగా, తెలంగాణవాసుల కోసం 40 విమానాలను నడిపారు. అయితే, అత్యధికంగా తరలివచ్చిన కేరళీయుల కోసం అక్కడి ప్రభుత్వం ఉచిత క్వారం టైన్ సౌకర్యం కల్పించింది. మన ప్రభుత్వం క్వా రంటైన్ కోసం అదనంగా చార్జీలను వసూలు చేసింది. తొలుత ఉచిత క్వారంటైన్ అని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని రప్పించేందుకు విమాన చార్జీలు సాధారణ చార్జీలకంటే అదనం గా 10–15శాతం ఎక్కువ వసూలు చేశారు. చార్జీలను లెక్కచేయకుండా స్వదేశంలో అడుగుపెట్టిన ప్రవాసీలను క్వారంటైన్ కష్టాలు వెంటా డాయి. విమానాలు దిగగానే పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్న పోలీసులు, క్వారంటైన్ ముగిశాకే హోటల్ బిల్లు, మెస్ బిల్లు చెల్లించిన తర్వాతే వాటిని తిరిగి అప్పగిస్తున్నారు. దీంతో వలసజీవులు లబోదిబోమంటున్నారు. 90 శాతం మంది కార్మికులే.. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న తెలంగాణ వాసులలో 90 శాతం మంది కార్మికులే ఉంటున్నారు. వీరికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతనం ఉంటుంది. ఒక్కో కార్మికునికి కొన్ని కంపెనీలు నెలల తరబడి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అటు వేతనాలు లేక ఇటు ఇంటికి రావడానికి అప్పుచేసి టికెట్ కొనుగోలు చేస్తే, వా రు క్వారంటైన్ చార్జీలను అదనంగా మోయాల్సి వస్తోంది. క్వారంటైన్ కోసం తమను హైదరాబాద్ పరిసరాల్లోని హోటళ్లలో ఉంచే బదులు ఇంటికి పంపిస్తే తూ.చ.తప్పకుండా క్వారంటైన్ నిబంధనలను పాటిస్తామని వలస కార్మికులు చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఉచితంగా వసతి ఏర్పాటు చేసినా భోజనానికి మాత్రం చార్జీలు వసూలు చేస్తున్నారు. -
వలస కార్మికుల విచిత్ర పరిస్థితి..
బిహార్ రాష్ట్రం హసన్ బజార్ గ్రామానికి చెందిన దశరత్, భార్య పూల్వతిదేవి తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ఏడాదిన్నర క్రితం ఉపాధి కోసం భాగ్యనగరానికి వలస వచ్చారు. నగర శివార్లలోని సూరారంలో బొట్టుబిళ్లలు తయారు చేసే ఒక సూక్ష పరిశ్రమలో భార్య, భర్తలకు పనితోపాటు ఆశ్రయం లభించింది. లాక్‌డౌన్‌తో పనిలేకపోవడంతో యాజమాని సొంతూళ్లకు వెళ్లాలని కొంత నగదు చేతిలో పెట్టి బలవంతంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చి వదిలి వెళ్లిపోయారు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచక ప్లాట్‌ఫామ్‌పై కుటుంబం ఉండటంతో ఒక ఎన్జీవో సంస్థ గుర్తించి సమీపంలోని షెల్టర్‌కు తరలించింది. ఆశ్రయం కల్పించడంతో పాటు, అన్న పానీయాలు అందిస్తూ సొంతూళ్లకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. లింగంపల్లి సమీపంలోని గోపాల పల్లి తండా గుట్టలపై ఒక కంపెనీకి చెందిన క్వారీలో కంకర కొట్టే పనుల్లో జార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన సుమారు 13 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన వలస కార్మికులందరూ సొంతూళ్లకు వెళ్లిపోవడంతో తాము కూడా వేళ్లేందుకు ప్రైవేటు ట్రాన్స్ పోర్టు మాట్లాడుకున్నారు. కానీ కంపెనీ యజమాని ‡వారిని వదలకుండా పనులు చేయిస్తుండటంతో కార్మికులు తమ సంబంధీకులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి ఏపీటీఎస్ సోషల్ ఫోరం సమన్వయకర్త డేవిడ్ సుధాకర్‌కు తెలియడంతో ఆయన కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించి కార్మికులను విముక్తి కలిగించగా భూమిక ఎన్జీవో సొంతూళ్ల కు వేళ్ళే విధంగా సహకరించేందుకు ముందుకు వచ్చింది. సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్డౌన్ సడలింపుల అనంతరం వలస కార్మికులు పరిస్థితి విచిత్రంగా తయారైంది. భవన నిర్మాణ రంగం, వాటి అనుబంధ రంగాల్లో కార్మికుల కొరతతో సొంతూళ్ల వెళ్లిన వారిని తిరిగి రప్పించుకునేందుకు ఒక వైపు తీవ్ర ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు అందుబాటులో గల కార్మికులను బలవంతంగా వెళ్లగొట్టేందుకు చిన్న , మధ్య తరహ పరిశ్రమలు చర్యలకు ఉపక్రమించాయి. దీంతో స్వస్థలాలకు వెళ్లిన కార్మికులు తిరిగి రాలేక...ఇక్కడ ఉన్న కార్మికులకు చేతిలో పనిలేక స్వస్థలాలకు వెళ్లలేక తల్లడిల్లుతున్నారు. ఏదో రకంగా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నా గమ్య స్థానాల వరకు వెళ్లే రైళ్ల కోసం రోజుల తరబడి ఎదురు చూడక తప్పడంలేదు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించే బాధ్యతల నుంచి పాలకులు తప్పుకోవడంతో ఎన్జీవోలు ముందుకు వచ్చి రైల్వే స్టేషన్ల సమీపంలో షెల్టర్లను ఏర్పాటు చేసి ఆన్న పానీయాలతోపాటు స్వస్థలాకు వెళ్లే వరకు అన్నీ తామై సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. వెళ్లలేని వారు ఇంకా లక్షన్నర మంది హైదరాబాద్ మహా నగరంలో మరో లక్షన్నర వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లలేక ఇక్కడే ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 13.50 లక్షల మంది సొంతూళ్లకు చేరుకున్నారు. మిగిలిన వారు సైతం స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సొంతూళ్లకు తిరిగి వెళ్లలేక పని దొరుకుతుందన్న ఆశతో లాక్డౌన్ కష్టాలను సైతం ఎదుర్కొన్నా ఇక్కడే ఉన్న వారికి నిరాశ తప్పడం లేదు. ఇదిలా ఉండగా భవన నిర్మాణ రంగం అనుబంధ రంగాల్లో కార్మికుల కొరత విపరీతంగా ఉంది. సొంతూళ్లకు వెళ్లిన వారిని సైతం తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వారు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో వలస కార్మికుల విచిత్ర పరిస్థితి నెలకొంది. -
చుక్‌బుక్ దందా
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్టకాలంలో రైల్వే ప్రయాణికులను దళారులు దోచుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థతుల్లో సొంతూళ్లకు వెళ్లాల్సినవారిని, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకొని ఏజెంట్లు దోపిడీకి పాల్పడుతున్నారు. వలస కార్మికుల కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడుపుతున్నప్పటికీ డిమాండ్దృష్ట్యా చాలా మందికి అవకాశం లభించడం లేదు. దీంతో చాలామంది కార్మికులు ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లపై ఆధారపడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్‌లపై అవగాహన ఉండటంలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వస్తున్న అమాయక, నిరక్షరాస్యులైన వలస కార్మికులను లక్ష్యంగా చేసుకొని అక్రమార్జన పర్వాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రామిక్ రైళ్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యాప్రత్యేక రైళ్లలో వెళ్లేందుకు నిర్ధారిత టికెట్లు ఇస్తామంటూ కార్మికుల జేబులు లూటీ చేస్తున్నారు. మోసాలు ఇలా.. దానాపూర్‌కు వెళ్లే నలుగురు ప్రయాణికుల నుంచి ఇటీవల ఒక బ్రోకర్ రూ.8000 వరకు వసూలు చేశాడు. ట్రైన్ వచ్చే తేదీనాటికి కూడా తమకు టికెట్లు అందకపోవడంతో మోసపోయినట్లు వారు గుర్తించారు. ‘ఇద్దరు ప్రయాణికులను పంపించేందుకు ఓ మధ్యవర్తి రూ.2500 తీసుకున్నాడని, మరుసటి రోజు ట్రైన్ కోసం సిద్ధంగా ఉండాలని చెప్పి వెళ్లిపోయాడని సుభాష్ అనే మరో ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వలస కూలీలు ఈ తరహా మోసాలకు గురవుతుండగా, ప్రత్యేక రైళ్ల కోసం ఎదురు చూసే సాధారణ ప్రయాణికులు కూడా ఏజెంట్ల చేతికి చిక్కి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేని నిస్సహాయతను ఏజెంట్లు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో నగరంలో చిక్కుకుపోయినవారు ప్రస్తుతం ఏదో విధంగా సొంత గ్రామాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దళారులు, ఏజెంట్లు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల చుట్టుపక్కల తిష్టవేసి ఇలాంటి ప్రయాణికులను గుర్తించి ఆన్లైన్ బుకింగ్‌ల పేరిట అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అన్నింటికీ ఆన్లైన్ బుకింగ్‌లే.. ప్రయాణికుల అవసరాల కోసం నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ప్రతిరోజూ 9 ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటితో పాటు సికింద్రాబాద్– బెంగళూర్ డైలీ, సికింద్రాబాద్– న్యూఢిల్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. శ్రామిక్ రైళ్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మందికిపైగా వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లారు. అయినప్పటికీ వివిధ ప్రాంతాల మధ్య నడిచే ప్రత్యేక రైళ్లకు డిమాండ్ కొనసాగుతోంది. సాధారణ ప్రయాణికులతో పాటు వలస కూలీలు కూడా ప్రత్యేక రైళ్లలో బయలుదేరుతున్నారు. దీంతో సికింద్రాబాద్– దానాపూర్, సికింద్రాబాద్– హౌరా వంటి రైళ్లకు డిమాండ్ భారీగా ఉంది. ప్రతి రోజు సుమారు 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. మరోవైపు సాధారణ బోగీల్లో ప్రయాణానికి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉండటంతో చాలా మంది ప్రయాణికులు ఆధార్ కార్డులతో ఏజెంట్ల వద్దకు తరలి వస్తున్నారు. ప్రయాణికుల తప్పనిసరి అవసరం, అప్పటికప్పుడు బయలుదేరాల్సి రావడంతో ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రయాణికుల వివరాల నమోదు కోసం ప్రారంభించిన ఆన్లైన్ బుకింగ్‌లు ఏజెంట్లు, దళారులకు వరంగా మారాయి. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ పరిసరాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులు ఏ ఒక్కరికీ అధిక చార్జీలు చెల్లించరాదని, దళారులను ఆశ్రయించవద్దని ఆయన సూచించారు. -
ప్లాట్‌ఫామ్‌పై ఆహార పొట్లాలు.. ఎగబడ్డ జనం!
పాట్నా: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడేసిన ఆహారం, నీటి పొట్లాలకోసం పెద్దసంఖ్యలో వలస కార్మికులు ఎగబడ్డారు. భౌతిక దూరాన్ని సైతం పక్కన పెట్టి పొట్లాల కోసం తోసుకున్నారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌కు సంబంధించిన సడలింపులు అమల్లోకి రావటంతో వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు చేరుకునే మార్గం సుగమమైంది. వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్రాలు రైళ్లను ఏర్పాటు చేసి మరీ తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం బీహార్‌కు చెందిన వలస కార్మికులు శ్రామిక్ రైలులో రాష్ట్రంలోని సమస్తిపూర్‌కు చేరుకున్నారు. (ఆకలి కేకలు: కుక్క కళేబరమే ఆహారం) అక్కడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఆహారం, నీటి పొట్లాలు పడేసి ఉండటం గమనించిన సదరు కార్మికులు ఒక్కసారిగా వాటి కోసం ఎగబడ్డారు. భౌతిక దూరాన్ని సైతం పట్టించుకోకుండా ఒకరిని ఒకరు తోసుకుంటూ అందిన కాడికి పొట్లాలను తీసుకెళ్లిపోయారు. కథిహార్ ఘటన చోటుచేసుకుని రెండు వారాలు గడవకముందే ఈ సంఘటన చోటుచేసుకోవటం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( ఇంటి పై కప్పు మీద నాగుపాము) -
ఆ వార్తల్లో నిజం లేదు: బెంగాల్ వలస కార్మికులు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమను బాగా చూసుకుందని, అధికారులు అవసరమైన సరుకులు అందించారని పశ్చిమ బెంగాల్ వలస కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. లాక్డౌన్ పొడిగించటంతో స్వస్థలానికి వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్నామని తెలిపారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మా అభ్యర్థనను మన్నించిన ఏపీ సర్కార్ అందుకు ఏర్పాట్లు చేసింది. మా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటంతో ఆందోళన చేశాము. ఆ వీడియోలు పంపితే అనుమతి వస్తుందని అక్కడి ప్రతిపక్ష నేత చెప్పారు. ఒకేచోట వందలమంది చేరటంతో స్థానికులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఎవరో కర్ర విసరటంతో మాలో ఒకరికి గాయం అయింది. మాపై పోలీసులు లాఠీ ఎత్తలేదు, దురుసుగా ప్రవర్తించలేదు. నిన్న మీడియాల్లో వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు’’ అని స్పష్టం చేశారు. -
కేంద్ర నిర్ణయంపై తెలంగాణ సర్కార్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం సడలింపుల ప్రకటన జారీచేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వలస కార్మికుల తరలింపుకు ఉచితంగా రైళ్ళను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఓ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సుల్లో తరలించాలని నిర్ణయించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. (ప్రత్యేక రైళ్లు నడపాలి : మోదీకి సీఎం లేఖ) తెలంగాణలో బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 15 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని తెలిపారు. తెలంగాణ నుంచి బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గడ్‌కు బస్సుల్లో వెళ్లేందుకు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుందన్నారు. ఇది కూలీలకు చాలా ఇబ్బందికరమైన ప్రయాణమని తలసాని పేర్కొన్నారు. రైళ్ళలో వలస కూలీలను వారి స్వరాష్ట్రాలకు చేర్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా బస్సులతో స్వగ్రామాలకు తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. (సొంతూళ్లకు వెళ్లేందుకు ఓకే) కాగా అలాగే, లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన భక్తులు, పర్యాటకులు తదితరులకూ ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీచేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు లోబడి వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించింది. అయితే కూలీల తరలింపుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సొంతంగా బస్సులను పంపాలన్న నింబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే యూపీ, ఉత్తరాఖండ్, గుజ రాత్, పంజాబ్, అస్సాం, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ విద్యార్థులు, పర్యాటకులను వెనక్కు తీసుకువెళ్లాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వలస కార్మికుల కోసం హెల్ప్‌డెస్క్
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ కార్మిక శాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు లాక్డౌన్ కారణంగా వారి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు వీలు లేకుండాపోయింది. ఇలాంటి వారికి సహాయపడేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్టు తెలంగాణ సంయుక్త కార్మిక కమిషనర్ ఎన్. చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. పారిశ్రామిక రంగ కార్మికుల వేతన చెల్లింపులు, సంక్షేమం, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వలస కార్మికులు సమస్యల పరిష్కారం కోసం 94925 55379 (వాట్సప్)లో సంప్రదించాలని ఆయన సూచించారు. covid19cotr@gmail.comకు ఈ-మెయిల్ కూడా పంపొచ్చని చెప్పారు. హెచ్చార్సీ కేసుల విచారణ వాయిదా లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో కేసుల విచారణను వాయిదా వేస్తున్నట్టు మానవ హక్కుల సంఘం(హెచ్చార్సీ) ప్రకటించింది. వాయిదా వేసిన కేసులను మే 9 నుంచి విచారిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 99631 41253, 90002 64345 నంబర్లలో సంప్రదించవచ్చు. (లాక్డౌన్.. మరిన్ని సడలింపులు ప్రకటించిన కేంద్రం) -
‘చాలా తీవ్రమైన సంఘటన’
ముంబై: వలస కార్మికులను ఆదుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం వలస కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంపై స్పందిస్తూ.. ‘చాలా తీవ్రమైన సంఘటన’గా పేర్కొన్నారు. దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. వలస కార్మికుల వెతలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని వ్యాఖ్యానించిన మంత్రి ఆదిత్య ఠాక్రేకు పరోక్షంగా ఫడ్నవీస్ చురకలంటించారు. కోవిడ్-19పై చేస్తున్నది రాజకీయ పోరాటం కాదన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిపై సమరంలో సీరియస్‌నెస్ చూపాలని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా, లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో మంగళవారం వేలాది కార్మికులు బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వినయ్ దూబే అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వలస కార్మికులను రెచ్చగొట్టినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ముంబై అలజడి; వినయ్ దూబే అరెస్ట్ -
తలకిందులుగా వేలాడదీసి కొట్టి చంపేశారు..
-
తలకిందులుగా వేలాడదీసి కొట్టి చంపేశారు..
అమృత్ సర్: దొంగతనం నెపంతో ఓ వలస కూలీని యజమాని దారుణంగా హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.... పంజాబ్ లోని అమృత్ సర్ పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాక్టరీలో దొంగతనం చేశాడన్న నెపంతో బీహార్ కు చెందిన వలస కూలీ రాంసింగ్‌ను గురువారం ఉదయం ప్యాక్టరీ యజమాని జస్ప్రీత్ సింగ్ కిడ్నాప్ చేశాడు. అనంతరం తలకిందులు గా వేలాడదీసి ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు. అయితే ఈ సంఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. 47 నిమిషాల నిడివిగల వీడియో బయటకు రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. సంఘటన జరిగిన మరుసటి రోజే రాంసింగ్ మృతదేహం లభించింది. ఈ దారుణానికి సహకరించిన మరో ఇద్దరిపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.