
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమను బాగా చూసుకుందని, అధికారులు అవసరమైన సరుకులు అందించారని పశ్చిమ బెంగాల్ వలస కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ పొడిగించటంతో స్వస్థలానికి వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్నామని తెలిపారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మా అభ్యర్థనను మన్నించిన ఏపీ సర్కార్ అందుకు ఏర్పాట్లు చేసింది. మా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటంతో ఆందోళన చేశాము. ఆ వీడియోలు పంపితే అనుమతి వస్తుందని అక్కడి ప్రతిపక్ష నేత చెప్పారు. ఒకేచోట వందలమంది చేరటంతో స్థానికులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఎవరో కర్ర విసరటంతో మాలో ఒకరికి గాయం అయింది. మాపై పోలీసులు లాఠీ ఎత్తలేదు, దురుసుగా ప్రవర్తించలేదు. నిన్న మీడియాల్లో వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు’’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment